నేడు ప్రపంచ పొదుపు దినోత్సవం
(ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం.....)
(ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం.....)
'బూంద్ బూంద్ బనేగా సముందర్, పైసా పైసా పైదాకరేగా' అనేది హిందీ సామెతలో ఒకటి తెలుగులో ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం తయారు అవుతుంది అని . ఒక్క రూపాయి అంటుంది నన్ను వంద వరకు పెంచు తరువాత నిన్ను నేను పెంచుతాను అని ఇవన్నీ మీకు తెలిసినవే, ఇవన్ని పోదుపు గురించి చెప్పటానికే పుట్టినవి.
కాలు వంకర పోకుండానే, కంటిచూపు తగ్గిపోకుండానే వీలైనంత కూడబెట్టు అనేదే మన పెద్దలు మనకి ఉగ్గుపాలతో నేర్పే మొట్టమొదటి ప్రాథమిక ఆర్థిక సూత్రం. 'సేవ్ ఫర్ ఎ రెయినీ డే, టు మేక్ ఇట్ ఆల్సో ఎ సన్ని డే' అన్న ఇంగ్లిష్ సామెతలో కూడా, పొదుపు యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది . ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ప్రపంచ పొదుపు దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదా అందుకే మరి .
1924, అక్టోబర్ 31వ తేదీన, ప్రప్రథమ ‘ఇంటర్నేషల్ థ్రిఫ్ట్ కాంగ్రెస్’ సమావేశం ముగి సిన వెంటనే, ప్రొఫెసర్ ఫిలిప్పో రవిజ్జా ఆరోజుని, ‘వరల్డ థ్రిఫ్ట్ డే’గా సాధికారంగా ప్రకటించారు. సామాన్య పౌరులకి ‘పొదుపు’లోని ముఖ్యత్వాన్ని వివరించడం ఈ ‘వరల్డ థ్రిఫ్ట్ డే’ ముఖ్యోద్దేశం.
అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వున్న సేవింగ్స్ బ్యాంక్స్ అన్నీ ‘వరల్డ్ సేవింగ్స్ డే’ని వైభవోపేతంగా జరుపుకోవడం ఆరంభించాయి. ఇప్పుడు ప్రపంచమంతటా ‘ఇంటర్నేషనల్ సేవింగ్స్ బ్యాంక్స్ ఇన్స్టిట్యూట్’ కి చెందిన 940 సేవింగ్స్ బ్యాంక్స్ క్రియాశీలకం గా,నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాయి.ఏటేటా, అక్టోబర్ 30వ తేదీన ‘వరల్డ్ సేవింగ్స్ డే’ / ‘వరల్డ్ థ్రిఫ్ట్ డే’ జరుపుకునే సందర్భంలో, ప్రపంచమంతటా కొన్ని రిటేల్ బ్యాంక్స్ వారం రోజుల పాటు, వైభవంగా వు త్సవాలు నిర్వహిస్తూ, ‘పొదుపు’ ప్రాముఖ్య త విషయంలో, ప్రజలలో చైతన్య స్ఫూర్తి కలిగిం చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
అలా, చిన్న చిన్న మొత్తాలతో ‘పొదుపు’ చేసుకోవడ మనే అలవాటుని ప్రజలలో కలిగించాలనే సదాశయం ఈనాటికి ఒక మహోద్యమంగా రూపొంది, ప్రపంచ వ్యాప్తమైపోయింది.
అయితే పొదుపు అనేది అన్ని విషయాలకు వర్తిస్తుంది. విధ్యుత్ ను పోదుపు చేయటం, నీటిని, ఆహారాన్ని, అనావసరంగా వృదా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. చిన్న పిల్లలకు పొదుపు యొక్క విశిష్టత చిన్న తనము నుండే అలవారచాలి . ప్రతిమనిషి తను సంపాదించిన దానిలో పూర్తిగా 20% పొదుపు చేసుకోవాలిట. మరి మీరుకూడా పోదుపుచేయటం మొదలుపెట్టండి మరి .
అందరికి ప్రపంచ పొదుపు దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.