Type Here to Get Search Results !

Vinays Info

స్వామి రామానంద తీర్థ | Swamy Ramananda Thirdha

స్వామి రామానంద తీర్థ (అక్టోబర్ 3, 1903 - జనవరి 22, 1972) స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి.

బాల్యం, విద్యాభ్యాసం

స్వామి రామానంద తీర్థ బాల్యనామం వెంకటేష్ భావు రావు ఖెడ్గేకర్. ఈయన అక్టోబర్ 3, 1903 లో గుల్బర్గా జిల్లా, జాగిర్ గ్రామం లో జన్మించారు. ఆయన తండ్రి సన్యాసం స్వీకరించటంతో బంధువుల ఔదార్యం తో తన విద్యాభ్యాసాన్ని సాగించవలసి వచ్చింది. లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను ఈయన ఆదర్శంగా తీసుకున్నాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని బడికి గాంధీ టోపి వేసుకుని వెళ్ళి తన నిరసన తెలిపి కొంత కాలం చదువుకు సెలవిచ్చాడు. తరువాత కాంగ్రెస్ లో చేరాడు. తన ఇరవై ఒకటో యేడాది తరువాత చదువుపై దృష్టి పెట్టి ఎం ఏ పట్టా సాధించాడు.

యవ్వనం

కొంత కాలం ప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్ ఎం జోషి కార్మికోద్యమం లో పాల్గొన్నాడు. 1926 లో ఢిల్లీ లో ఉండగా పాక్షిక పక్షవాతానికి గురై కొంత కాలానికి కోలుకున్నాడు. తన ఆరోగ్య పరిమితి దృష్ట్యా జోషి అనుమతితో కార్మికోద్యమానికి స్వస్తి చెప్పి ఒస్మనాబాద్ స్కూల్ లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. ఈ దరిమిలా హైదరాబాదు రాష్ట్రం లో హిందువులపై జరుపుతున్న దుశ్చర్యలు, ఆంక్షల గురించి తెలుసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం, హిందూ ఉన్నత పాఠశాల స్థాపపనకు నిరాకరించింది. ఐతే ఓ లొసుగును ఉపయోగించుకుని ప్రాథమిక పాఠశాలను విస్తరించి ఉన్నత పాఠశాల నెలకొల్పాడు. ఆ స్కూల్ ప్రప్రధమ ప్రధానోపాధ్యాయుడిగా రామానంద తీర్థ ను నియమించడం జరిగింది.

జనవరి 14, 1930 లో ఆయన సన్యాస దీక్ష స్వీకరించాడు. ఆయన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నాడు. వితరణల ద్వారా జీవనం సాగిస్తూ విద్యారంగానికే అంకితమైయ్యారు.

మరణం

1972, జనవరి 22న మరణించారు.

..........................వినయ్ కుమార్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section