నాయని సుబ్బారావు 📃📚
జయంతి సందర్భంగా....
🔸తొలితరం తెలుగు భావకవి, భారతస్వాతంత్ర్యసమరయోధుడు
జననం:-
〰〰
🔸సుబ్బారావు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలిపట్టణములో జన్మించాడు.
🔸ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.
🔸సుబ్బారావు స్వాతంత్ర్య పోరాటములో సహాయనిరాకర ణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. విశ్వనాథ సత్యనారాయణ, తన' వేయి పడగలు ' నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.
🔸1928 నుండి అధ్యాపక వృత్తిలో కొనసాగి, 1955లో గుంటూరు జిల్లా, నరసరావుపేట పురపాలక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యా యులుగా పదవీవిరమణ చేసిన సుబ్బారావు.
🔸1958లో హైదరాబాదు నగరంలో నివాస మేర్పరచుకొని హైదరాబాదుఆకాశవాణి కేంద్రంలో ఆయా ప్రసారాలకు అవసరమయ్యే విషయాలను వ్రాసే పనిని చేపట్టాడు. ఎక్కువగా గ్రామస్థుల కార్యక్రమాలకు వ్రాస్తుండేవాడు. స్త్రీల కార్యక్రమాలు నడిపే న్యాపతి కామేశ్వరి కూడా సుబ్బారావుచే తన కార్యక్రమాలకు కవితలు, పద్యాలు, నాటికలు వ్రాయించు కునేది.
🔸హైదరాబాదుకు వచ్చిన కొత్తలో వివిధ అంశాలపై వ్రాసిన 25 ఖండిక లను భాగ్యనగర కోకిల అనే కావ్యంగా ప్రకటించాడు.
🔸నాయని సుబ్బారావు 1978, జూలై 8న మరణించాడు.
Collection by : VINAYS INFO