Type Here to Get Search Results !

Vinays Info

ఎంపీ ల్యాడ్స్ | MP LADS

-లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కోసం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీం (ఎంపీలాడ్స్)ను 1993లో ప్రారంభించారు.
-ఈ స్కీంలో భాగంగా ఎంపీలు తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నది లక్ష్యం. ముఖ్యంగా ఆరోగ్య, విద్య, తాగునీటి, విద్యుత్, శానిటేషన్ తదితర సాంఘిక అభివృద్ధి అంశాల కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు.
-ప్రతి ఏటా రూ. 5 కోట్లు ఈ పథకం కింద లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉపయోగించవచ్చు. ఈ నిధులను కేంద్రం ఇస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నేరుగా జిల్లా అథారిటీస్‌కి ఇస్తారు.
-ఈ పథకంలో నిధులు మురిగిపోవు. ఈ సంవత్సరం నిధులను ఉపయోగించుకోకుంటే వచ్చే ఏడాది వాటిని ఉపయోగించుకొనే అవకాశం ఉంది.
-దీని కింద ఎంపీ కేవలం ఆయా అవసరాలను బట్టి పనులను రికమండ్ చేయడం వరకే. మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకొంటాయి.
-జిల్లా యంత్రాంగం పనుల ఆవశ్యకతను, పర్యవేక్షణను చేపడుతాయి. జిల్లా కలెక్టర్ పూర్తిగా వీటిని పర్యవేక్షిస్తారు. ఒక్కో పనికి గరిష్ఠంగా రూ. 25 లక్షలు మాత్రమే కేటాయిస్తారు.
-అయితే ఈ స్కీం అనుకున్నంత సక్సెస్ కాలేదు. చాలా జిల్లాల్లో నిబంధనలను అతిక్రమించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది.
-రాజ్యసభ సభ్యులు వారు ఎంపికైన రాష్ట్రంలో ఏ జిల్లాకైనా ఈ నిధులను ఖర్చు చేయవచ్చు. పార్లమెంట్ నామినేటెడ్ సభ్యులు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section