మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జన్మదిన సంధర్బంగా....
![]() |
| VINAYS INFO |
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.
బాల్యము, విద్య
"మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన (శుక్ల నామ సంవత్సరం బాధ్రపద బహుళ ద్వాదశి శనివారం) గుజరాత్ లోని పోర్ బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్ బందర్ లోను, రాజ్‌కోట్ లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివాడు. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. 1891 లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. బొంబాయి లోను, రాజ్‌కోట్ లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893 లో దక్షిణాఫ్రికా లోని నాటల్ లో ఒక న్యాయవాద (లా) కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది.
దక్షిణ ఆఫ్రికా ప్రవాసముసవరించు
1906లో దక్షిణాఫ్రికాలో బారిస్టరుగా గాంధీ
దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీ కుటుంబము
ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా భారతదేశం లో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894 లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించాడు.

ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913 లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు. కష్టనష్టాలకు తట్టుకొని నిలచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది. కానీ గాంధీకి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు. వారి న్యాయమైన విధానాలను ఆయన సమర్ధించాడు. బోయర్ యుద్ధకాలం లో (1899-1902) ఆయన తన పోరాటాన్ని ఆపి, వైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడు. ప్రభుత్వము ఆయన సేవలను గుర్తించి, పతకంతో సత్కరించింది. ఈ కాలంలో అనేక గ్రంథాలు చదవడం వలన, సమాజాన్ని అధ్యయనం చేయడం వలన ఆయన తత్వము ఎంతో పరిణతి చెందింది. లియో టాల్‌స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు(The Kingdom of God is Within You), జాన్ రస్కిన్ యొక్క అన్టూ దిలాస్ట్ (Unto the Last) అనే గ్రంథాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. కాని, అన్నిటికంటే ఆయన ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీత. గీతా పఠనం వల్ల ఆయనకు ఆత్మజ్ఞానము యొక్క ప్రాముఖ్యతా, నిష్కామ కర్మ విధానమూ వంటబట్టాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా ఆయన గ్రహించాడు. దక్షిణాఫ్రికాలో "ఫీనిక్స్ ఫార్మ్", "టాల్ స్టాయ్ ఫార్మ్" లలో ఆయన సామాజిక జీవనాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేశాడు. ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు - కోరికలకు కళ్ళెం వేయడమూ, ఉన్నదేదో నలుగురూ పంచుకోవడమూ, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకొన్నాడు.
ఈ సమయంలోనే ఆయన అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించాడు. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గము. పోరాటాలూ, సంస్కరణలూ ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి, మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరము. 1914 లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.
భారతదేశములో పోరాటము ఆరంభ దశసవరించు
1915లో భారతదేశం తిరిగివచ్చిన గాంధీ దంపతులు
భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ వారిని సమర్ధించి, సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛనూ, హక్కులనూ కోరుకొనేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని ఆయన వాదం. బీహారు లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులూ ఆహార పంటలు వదలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికమూ, దురాచారాలూ, మురికివాడలూ అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆపైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. గుజరాత్ లోని ఖేడా లోనూ ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. ఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై ఆయనను అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో "బాపు" అనీ, "మహాత్ముడు" అనీ పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి. 1919 లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినపుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డు కట్ట వేసింది. కాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు ఆయన బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపు చేసి, పరిహారంగా నిరాహారదీక్ష సలిపాడు. పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజలపట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింసయినా తప్పే. ఏప్రిల్ 13, 1919 న అమృత్ సర్, పంజాబు లోని జలియన్ వాలా బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలగా, అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతే కాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ, సర్వత్రానూ ప్రబలమైంది. 1921 లో భారత జాతీయ కాంగ్రెస్ కు ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డాడు. కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయము "స్వరాజ్యము" అని ప్రకటించాడు. వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు. వ్యక్తికీ, మనసుకీ, ప్రభుత్వానికీ స్వరాజ్యము కావాలి. తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు.

1921లో ఆంధ్ర పర్యటనలో గాంధీ
"స్వదేశీ" - విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్ధిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం.
"సహాయ నిరాకరణ" - ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922 లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరా లో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి, గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు.
"సమాజ దురాచార నిర్మూలన" - గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్ర్య మున్నదనుకోవడంలో అర్ధం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచనా సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలూ, విలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి.
1922 లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశాడు. 1924 లో మూడు వారాల నిరాహారదీక్ష సాగించాడు. కాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో ఆయన లీనమయ్యారు. 1927 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడు. అందరికీ సర్ది చెప్పి, 1928 లో కలకత్తా కాంగ్రెసులో "స్వతంత్ర ప్రతిపత్తి" తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. అందుకు బ్రిటిషు వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. ఆయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్ 31 న లాహోరు లో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26 ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును

పతాకస్థాయి పోరాటముసవరించు
దండి సత్యాగ్రహంలో గాంధీ
దండి సత్యాగ్రహం మార్గం
ఉప్పు సత్యాగ్రహం (దండియాత్ర), క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రంలోంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దారిపొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు - ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరినవారితో దండి చేరుకొనే సరికి జనం వెల్లువలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931 లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932 లో లండను లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కాని ఆ సమావేశం గాంధీని, స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరచింది. లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించాడు. 1932 లో నిమ్న కులాలవారినీ, ముస్లిము లనూ వేరుచేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు. తరువాత అంటరానివారిగా చూడబడిన వర్గాలపట్ల సమాజ దృక్పథాన్నీ, వారి స్థితిగతులనూ మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులని పిలిచాడు. ఆత్మశోధనకూ, ఉద్యమస్ఫూర్తికీ 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహారదీక్ష సాగించాడు. 1934 లో ఆయనపై మూడు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెసు సిద్ధమైనపుడు గాంధీ కాంగ్రెసుకు రాజీనామా చేశాడు. తన నాయకత్వంవల్ల కాంగ్రెసులోని వివిధ వర్గాల నాయకుల రాజకీయనాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదనీ, స్వాతంత్ర్యమనే ప్రధాన లక్ష్యాన్నుంచి దృష్టి మరలకూడదనీ ఆయన ఉద్దేశము.

1936 లో లక్నో కాంగ్రెసు సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధానపాత్ర తీసుకొన్నాడు. 1938 లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాస్ చంద్రబోసు తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యంపైనా, అహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ యొక్క ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తరువాత సంభవించిన తీవ్రసంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యాడు.
1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారనీ, ఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ, మరొకప్రక్క స్వేచ్ఛకోసం యుద్ధమని చెబుతున్నారనీ బ్రిటిషు విధానాన్ని కాంగ్రెసు వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెసు వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో "క్విట్ ఇండియా" ఉద్యమం ప్రారంభమైంది.
"క్విట్ ఇండియా" ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. "భారత్ ఛోడో"- భారతదేశాన్ని వదలండి - అన్నది నినాదము. "కరో యా మరో" - చేస్తాం, లేదా చస్తాం - అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది.
1942 ఆగష్టు 9 న గాంధీతో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయ్యింది. గాంధీ రెండేళ్ళు పూణే జైలులో గడిపాడు. ఈ సమయంలోనే ఆయన కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించాడు. ఆయన సహధర్మచారిణి కస్తూరిబాయి 18నెలల కారాగారవాసం తరువాత మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాలవల్ల ఆయనను 1944 లో విడుదల చేశారు.
గాంధీ హత్య సవరించు
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పని చేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం"1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు. కానీ ఆ సమయంలో బాపు ‘హేరాం’ అని ఉచ్ఛరించలేదు.[1][2] గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు." గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.

ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన రాజ్ ఘాట్ వద్ద ఈ మంత్రమే చెక్కి ఉన్నది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్ లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు: "మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము".

Social Plugin