కంచ ఐలయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగము యొక్క అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త మరియు రచయిత.
భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.
ఈయనను అనేకమంది విమర్శకులు (హిందువులూ, ముస్లింలు కూడా), హిందూ వర్గాలు హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారు.
ఐలయ్య స్వయంగా తను హిందూ మతాన్ని ద్వేషిస్తానని చెప్పుకున్నాడు.
ఐలయ్య ఇంగ్లీషులో "Why I am not a Hindu?" పేరుతో వ్రాసిన పుస్తకం తెలుగులో నేను హిందువు నెట్లయిత? అనేపేరుతో ప్రచురితమయ్యింది.
ఐలయ్య 1952, అక్టోబర్ 5న వరంగల్ జిల్లాలోని పాపన్నపేట గ్రామంలో కురుమ గొల్ల కుటుంబంలో జన్మించాడు. ఈయన కుటుంబం యొక్క ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. ఐలయ్య గౌతమబుద్ధుని రాజకీయ తత్త్వముపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రాజనీతిశాస్త్రంలో డాక్టరేటు పొందాడు.
ప్రత్యేక తెలంగాణా వుద్యమంపై అభిప్రాయాలు
తెలంగాణా వుద్యమ నాయకత్వంలో భూస్వామ్య యుగపు ఛాయలున్నాయని, ఈ నాయకత్వంతో తెలంగాణ ఏర్పడితే షెడ్యూల్ తెగలు, జాతులు, వెనుకబడిన తరగతులు మరింత వెనకబడతారని ఐలయ్య అభిప్రాయం.
రచనములు
●నేను హిందువు నెట్లయిత? (Eng. Why I Am Not a Hindu: A Sudra critique of Hindutva philosophy, culture and political economy (Calcutta: Samya, 1996) )
●Post-Hindu India: A Discourse in Dalit -Bahujan, Socio-Spiritual and Scientific Revolution
●Weapon of the Other HB,
●Turning the Pot, Tilling the Land
●Mother
●Weapon of the Other: Dalitbahuja
●Writings and the Remarking of Indian Nationalist Thought
●God as Political Philosopher: Buddha's Challenge to Brahminism
●Buffalo Nationalism
Posted by : Admin