Type Here to Get Search Results !

Vinays Info

హరగోవింద్ ఖొరానా | Haragovinda Khorana

Haragovinda Khorana #honored by Nobel Prize on this day #vinaysinfo on 16 October

#VINAYS INFO

👉హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు.
🔹జనవరి 9, 1922న అవిభక్త భారత దేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అను గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది).

👉విద్య

🔹తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. అయిదుగురి సంతానములో చివరి వాడు.
🔹తొలుత తండ్రి శిక్షణలోను, తదుపరి ముల్తాన్ లో దయానంద్ ఆర్య విద్యా (DAV) ఉన్నత పాఠశాలలో చదివాడు.
🔹పంజాబ్ విశ్వవిద్యాలయము, లాహోర్ నుండి 1943 లో B.Sc మరియు 1945లో M.Sc పట్టాలు పొందాడు.
🔹లివర్ పూల్ విశ్వవిద్యాలయము లో 1945 నుండి 1948 వరకు శాస్త్ర పరిశొధనలు చేసి Ph.D పట్టా పొందాడు.
🔹తదుపరి రెండు సంవత్సరములు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పరిశోధనలు సాగించాడు.

👉పరిశోధనలు

🔹1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టాడు.
🔹1952లో కెనడా లోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వవిద్యాలములో చేరాడు. అటు పిమ్మట 1960 లో అమెరికా లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలములో (మ్యాడిసన్) ఆచార్యునిగా చేరాడు.
🔹1970లో ప్రతిష్ఠాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో (Massachusets Institute of Technology) రసాయనశాస్త్ర ఆచార్యునిగా చేరాడు.
🔹2007లో పదవీవిరమణ చేశాడు. అప్పటి నుండి గౌరవ ఆచార్యునిగా పరిశోధనలు సాగిస్తున్నాడు.

👉నోబెల్ పురస్కారము

🔹జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమం గా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశపారంపర్యముగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే "కృత్రిమ జీన్" ను సృష్టించగలిగాడు.
🔹ఈ ఆవిష్కరణ Genetic Engineering అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది.

🔹ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నాడు. 🔹వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (DNA) ముక్క ను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించాడు. DNA ముక్కలను అతికించు DNA ligase అనబడు ఎంజైమును కనుగొన్నాడు.
🔹ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవము వచ్చింది.
🔹1968 లో వైద్యశాస్త్రములొ నోబెల్ బహుమతి లభించింది.

👉పరివారము

🔹1952లో స్విస్ జాతీయురాలైన ఎలిజబెత్ సిబ్లర్ ను వివాహమాడాడు. వీరికి ముగ్గురు పిల్లలు: జూలియా ఎలిజబెత్, ఎమిలీ యాన్నె మరియూ డేవ్ రాయ్.

👉అవార్డులు

🔹మెడిసిన్ లో నోబెల్ బహుమతి (1968),
🔹గైరిందర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డు,
🔹లూయిసా స్థూల హోర్విత్జ్ బహుమతి,
🔹ప్రాథమిక మెడికల్ రీసెర్చ్ ఆల్బర్ట్ లస్కెర్ అవార్డు,
🔹పద్మ విభూషణ్,
🔹విల్లార్డ్ గిబ్స్ అవార్డు

👉మరణము

🔹ఖొరానా నవంబర్ 9, 2011 న కంకార్డ్, మసాచుసెట్స్ లో 89వ ఏట సహజ మరణము చెందాడు.

#vinays info, #VINAYSINFO

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section