Type Here to Get Search Results !

Vinays Info

భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులు - Fundamental Rights

భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులు
భారతదేశంలో ప్రాథమిక హక్కులు- Fundamental Rights in India'

ప్రాముఖ్యత మరియు లక్షణాలు

ప్రాథమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, మరియు బాధ్యతగలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇక్కడ ప్రభుత్వమనగా, భారతదేశంలో అధికారంగల అన్ని అంగాలు. వీటిలో భారత ప్రభుత్వము, పార్లమెంటు, భారతదేశంలోని రాష్ట్రాలూ, రాష్ట్రాలలో గల, జిల్లాపరిషత్తులూ, కార్పొరేషన్లు, నగరపాలికలు, పంచాయతీలు, గ్రామపంచాయతీలు వగైరా.

సమానత్వపు హక్కు

సమానత్వపు హక్కు, రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17 మరియు 18 ల ప్రకారం ప్రసాదించబడినది. ఈ హక్కు చాలా ప్రధానమైనది, స్వేచ్ఛా సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు, క్రింది విషయాల గ్యారంటీనిస్తుంది :

చట్టం ముందు సమానత్వం : రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, పౌరులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం పౌరుల పట్ల ఏలాంటి వివక్షలు మరియు భేదాలు చూపరాదు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ మరియు పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి భేదాలు చూపరాదు.
పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం మరియు సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, మరియు దేవాలయాలు మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగివున్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వాలు కలుగజేయవచ్చు.

పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం : అధికరణ 16 ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు, పౌరులకు ఏలాంటి వివక్షలూ చూపరాదు. 2003 'పౌర (సవరణ) బిల్లు' ప్రకారం, ఈ హక్కు, ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు.

🔹అంటరానితనం నిషేధాలు : అధికరణ 17 ప్రకారం, అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూవుంటే చట్టం ప్రకారం శిక్షార్హులు. అంటరానితనం నేర చట్టం (1955), 1976లో పౌరహక్కుల పరిరక్షణా చట్టం పేరుమార్పు పొందింది.
🔹బిరుదుల నిషేధాలు : అధికరణ 18 ప్రకారం, భారత పౌరులు, ఏలాంటి బిరుదులూ పొందరాదు. ఇతరదేశాలనుండి కూడా ఏలాంటి బిరుదులు పొందరాదు.ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం, రాయ్ బహాదుర్, ఖాన్ బహాదుర్ లాంటి, "ప్రభుత్వ లేక రాజ్య సంబంధ బిరుదులు", సైన్యపరమైన బిరుదులూ ప్రకటించేది, ఇలాంటివి నిషేధం. కానీ విద్య, సంస్కృతీ, కళలు, శాస్త్రాలు మొదలగువాటి బిరుదులు ప్రసాదించనూవచ్చు మరియు పొందనూ వచ్చు. భారత రత్న మరియు పద్మ విభూషణ్ లాంటి వాటిని పొందినవారు, వీటిన తమ "గౌరవాలు"గా పరిగణించవచ్చుగాని, 'బిరుదులు'గా పరగణించరాదు.1995, 15 డిసెంబరు న సుప్రీంకోర్టు, ఇలాంటి బిరుదుల విలువలను నిలుపుదలచేసింది.

🔹స్వాతంత్ర్యపు హక్కు

భారత రాజ్యాంగము, తన అధికరణలు 19, 20, 21 మరియు 22, ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కును ఇస్తున్నది. ఇది వైయుక్తిక హక్కు. ప్రతి పౌరుడూ ఈ హక్కును కలిగివుండడం, రాజ్యాంగ రచనకర్తల అసలు అభిలాష. అధికరణ 19, క్రింది ఆరు స్వేచ్ఛలను పౌరులకు ఇస్తున్నది.

వాక్-స్వాతంత్ర్యపు హక్కు మరియు భావవ్యక్తీకరణ స్వాతంత్ర్యం,
సమావేశాలకు స్వేచ్ఛ, ఈ సమావేశాలు శాంతియుతంగా, ఆయుధాలు కలిగివుండరాదు. దేశం మరియు ప్రజా శ్రేయస్సులను దృష్టిలో వుంచుకుని, ప్రభుత్వాలు వీటి అనుమతులు నియంత్రించనూవచ్చు.
సంస్థలు, సొసైటీలు స్థాపించే హక్కు. దేశ మరియు ప్రజా శ్రేయస్సుల దృష్ట్యా ప్రభుత్వం వీటిని నియంత్రించనూ వచ్చు లేదా నిషేధించనూ వచ్చు.
భారత పౌరుడు, భారతదేశం అంతర్భాగంలో ఏప్రాంతంలోనైనా పర్యటించవచ్చు. కాని కొన్నిసార్లు ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అంటురోగం గల సమయాలలో వాటిని అరికట్టే ప్రయత్నాలలో, పౌరుల ప్రయాణాలను నిషేధించవచ్చు.
భారత అంతర్భాగంలో ఏప్రదేశంలోనైనా, పౌరులు, నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు. కానీ, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్ తెగల పరిరక్షణ దృష్ట్యా, ప్రభుత్వం కొన్ని నియంత్రణలు చేయవచ్చును.
భారతదేశంలోని ఏప్రాంతంలోనైనా, పౌరులు వ్యాపారాలు, వర్తకాలూ, ఉద్యోగాలూ చేపట్టవచ్చును. కానీ, నేరాలుగల వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు మరియు నీతిబాహ్య వ్యాపారాలు చేపట్టరాదు.
ప్రాణాలు కాపాడే మరియు కాపాడుకునే హక్కునూ రాజ్యాంగం కల్పిస్తున్నది. అధికరణ 20, ఈ విషయాన్నీ చర్చిస్తుంది.
ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణింపబడుతుంది. అధికరణ 21 ప్రకారం, ఏ పౌరుడూ తన స్వేచ్ఛనూ, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగిలేడు, చట్టాన్ని తప్పించి.

🔹దోపిడిని నివారించే హక్కు

బాలకార్మికుడు మరియు 'స్వేచ్ఛారహిత కార్మికులు' (కట్టు బానిసలు) గల విధానం నిషేధం.
The right against exploitation, అధికరణలు 23 మరియు 24 ల ప్రకారం, కట్టు బానిసత్వం మరియు బాలకార్మిక విధానాలు నిషేధం. మరియు 14 సంవత్సరాలకు లోబడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు (కర్మాగారాలలో, గనులలో) చేయించుట నిషేధం. బాలకార్మిక విధానం, రాజ్యాంగ ఊపిరికే విఘాతం లాంటిది. కట్టు బానిసత్వం, విధానంలో భూస్వాములు లేదా పెత్తందార్లు, మానవహక్కులకు విఘాతాలు కలుగజేసేవారు. మానవులకు కట్టుబానిసలుగా ఉంచుకుని, తరతరాల స్వాతంత్ర్యాన్ని హరించివేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించడానికే ఈ హక్కు కల్పించబడినది. మానవులకు 'బానిస వర్తకాలు', 'వ్యభిచారం' లాంటి అశ్లీల వృత్తులయందు బలవంతంగా ప్రవేశించేలా చేయువారికి చట్టప్రకారం కఠిన శిక్షలున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు, జీతభత్యాలు లేని ఉద్యోగాలు మరియు, తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట, లాంటి వాటిని, ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చును.

🔹మతస్వాతంత్రపు హక్కు

భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్రపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27 మరియు 28 ల ప్రకారం ఇవ్వబడినది. ఈ స్వేచ్ఛా స్వాతంత్రం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకు ఉద్ద్యేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, ఏమతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. పౌరులు తమ మతాలగూర్చి ఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చు మరియు మతవ్యాప్తికొరకు పాటుపడవచ్చు. అలాగే, మతపరమైన సాంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు కిర్పాన్ లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, నిరోధించవచ్చు.

ధార్మిక సంస్థలు, ప్రజాపయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించుకొనవచ్చు. ఇతరత్రా, మతసంబంధం కాని కార్యకలాపాలను, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల ప్రకారం చేపట్టవచ్చు. చారిటబుల్ సంస్థలను కూడా ప్రజాపయోగం, సుహృద్భావన మరియు నియమాలను పునస్కరించుకొని, తమ కార్యకలాపాలు చేయునట్లుగా ప్రభుత్వం నిర్దేశించవచ్చును.మతపరమైన కార్యకలాపాల కొరకు ఏలాంటి పన్నులను విధించగూడదు మరియు నిర్దేశించగూడదు.ప్రభుత్వాలు నడిపే విద్యాసంస్థలలో, ప్రత్యేక మతాన్ని రుద్దే బోధనలు చేపట్టకూడదు.అలాగే, ఈ ఆర్టికల్స్ లోని విషయాలు, ప్రభుత్వాలు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలపై ఏలాంటి విఘాతాలు కలిగించగూడదు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో, ధార్మిక సంస్థల కార్యకలాపాలు అడ్డంకులుగా వుండరాదు.

🔹సాంస్కృతిక మరియు విద్యాహక్కులు

భారతదేశం, అనేక మతాలకు, భాషలకు మరియు సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తూంది. అధికరణ 29 మరియు 30 ల ప్రకారం, మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి. ఏ మైనారిటీలకు చెందినవాడైననూ, ప్రభుత్వం వీరికి, ప్రభుత్వ మరియు ప్రభుత్వసహాయం పొందిన సంస్థలలో ప్రవేశానికి నిషేధించరాదు.

మైనారిటీలు, అనగా మతం, భాష మరియు సాంస్కృతిక పరమైన మైనారిటీలు, తమ మతాన్ని, భాషలనూ, సంస్కృతినీ రక్షించుకొనుటకు, మైనారిటీ సంస్థలు స్థాపించుకొనవచ్చును. ఆ సంస్థలద్వారా వారు, తమ అభ్యున్నతికి పాటుపడవచ్చును. ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమ ప్రమేయాలు కలుగజేసుకోవచ్చును.

రాజ్యాంగ పరిహారపు హక్కు

ప్రాథమిక హక్కులకు ఏపాటియైనా భంగం కలిగితే, రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు, పౌరుడు, జైలు శిక్షను పొందితే, ఆ వ్యక్తి, న్యాయస్థానాలను ఆశ్రయించి, ఇది దేశచట్టాలనుసారంగా వున్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగివున్నాడు. ఒకవేళ, న్యాయస్థానం నుండి జవాబు "కాదు" అని వస్తే, ఆవ్యక్తికి తక్షణమే విడుదలచేయవలసి వస్తుంది. పౌరుల హక్కులను వాటి సంరక్షణలను గూర్చి న్యాయస్థానాలను అడిగే విధానాలు కొన్ని వున్నాయి. న్యాయస్థానాలు కొన్ని దావాలను ప్రవేశపెట్టవచ్చు. ఆ దావాలు, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో మరియు సెర్టియోరారి. ఒక వేళ దేశంలో అత్యవసర పరిస్థితి యేర్పడితే, ఈ హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వంచే 'సస్పెండు' చేయబడుతాయి.

ఆస్తి హక్కు - క్రిత ప్రాథమిక హక్కు

భారత రాజ్యాంగం, ఆర్టికల్ 19 మరియు 31 వరకు గల విషయాలలో ఆస్తి హక్కును పౌరుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19, పౌరులందరికీ, ఆస్తులను సంపాదించడం, వుంచుకొనడం, అమ్మడం లాంటి హక్కులను కలుగజేసింది. ఆర్టికల్ 31 'పౌరులెవ్వరూ తమ ఆస్తి హక్కును, ప్రభుత్వాల ద్వారా కోల్పోగూడదు'. ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా పౌరుల ఆస్తిని గైకొన్న యెడల, ఆ ఆస్తిదారునికి 'కాంపెన్‌జేషన్' చెల్లించవలెనని కూడా నొక్కి వక్కాణిస్తుంది.

కానీ భారత రాజ్యాంగ 44వ సవరణ ద్వారా, 1978 లో ఈ ఆస్తి హక్కును, ప్రాథమిక హక్కుల జాబితానుండి తొలగించింది.ఓ క్రొత్త ఆర్టికల్ 300-ఏ, సృష్టింపబడినది. ఈ ఆర్టికల్ ప్రకారం "చట్టం ప్రకారం, పౌరుడు పొందిన ఆస్తిని, భంగం కలిగించరాదు". ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా పరిగణించబడుతున్ననూ, ప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది.

👉విమర్శాత్మక విశ్లేషణ

ఈ ప్రాథమిక హక్కులను చాలా మంది పలువిధాలుగా విమర్శించారు. రాజకీయ సముదాయాలు, ప్రాథమిక హక్కులలో పని హక్కు, నిరుద్యోగస్థితి మరియు వయసు మీరిన స్థితులలో ఆర్థికసహాయ హక్కు, మున్నగునవి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.ఈ హక్కులన్నీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు లో క్రోడీకరించియున్నవి. స్వాతంత్ర్యపు హక్కు మరియు స్వీయస్వతంత్రం కూడా కొన్నిసార్లు విమర్శలకు లోనైనవి. ఇవి పరిధులకు మించి స్వేచ్ఛలు కలిగివున్నవని విమర్శింపబడినవి. ఈ పౌరహక్కులు ఎమర్జన్సీ యందు, నిలుపుదల చేయబడుతాయి, ఇలా నిలుపుదల చేసే చట్టాలకు ఉదాహరణ; 'మీసా' (MISA Maintenance of Internal Security Act) మరియు జాతీయ రక్షణా చట్టం ఎన్.ఎస్.ఏ. NSA (National Security Act). జాతీయ విపత్తుల (దేశ రాజకీయ అంతర్గత సంక్షోభం) సమయాలలో 'అత్యవసర పరిస్థితి' ని ప్రకటించి, ఈ కాలంలో పౌరహక్కులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటారు.

"పత్రికా స్వేచ్ఛ" స్వాతంత్ర్యపు హక్కులలో మిళితం చేయబడలేదు, ప్రజల ఉద్దేశ్యాల ప్రకటన, భావ ప్రకటనా స్వాతంత్ర్యం మున్నగు విషయాల కొరకు పత్రికాస్వేచ్ఛ అవసరం.అపాయకర పనులలో బాలల చాకిరి కొంచెం తగ్గుముఖం పట్టినా, అపాయాలులేని పనులలో బాలల చాకిరి (Child Labour) అనేవి, భారతరాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయి. 1.65 కోట్లమంది బాలబాలికలు నేటికీ భారతదేశంలో వివిధ పనులలో ఉద్యోగాలు చేస్తున్నారు.2005 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' అనే పత్రిక ప్రచురించిన ప్రచురణల ఆధారంగా, ప్రపంచంలో లంచగొండితనం గల 159 దేశాల జాబితాలో భారత్ 88వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ లంచగొండులలో అధికారులు, రాజకీయనాయకులూ వున్నారు.2003 'పౌర బిల్లు' (సవరణ) ప్రకారం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు సమాన హక్కులు పొందివుంటారు గాని, ఉద్యోగాలు పొందే విధానంలో సమానత్వపు హక్కు పరిగణలోకి రాదు. పోటీలో నెగ్గినవారే ఉద్యోగాలు పొందే అర్హత గలిగి వుంటారు.

👉సవరణలు

🔹ప్రాథమిక హక్కులలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఈ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందాలి. పార్లమెంటు ఆమోదానికి మూడింట రెండొంతుల పార్లమెంటు సభ్యుల ఆమోదం అవసరం. ఈ ఆమోదానికి పార్లమెంటు లో ఓటింగ్ అవసరం.

🔹ఆస్తి హక్కు ప్రథమ దశలో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడింది. కాని 1978 లో జరిగిన భారత రాజ్యాంగ 44వ సవరణ ప్రకారం దీనిని ఓహక్కుగా కాకుండా, ప్రతి పౌరుడు తన ఆస్తిని కాపాడుకోవడానికి చట్టం ప్రకారం హక్కును కలిగి వున్నాడని చట్టం చేయబడింది. ఈ చట్టం, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి సామ్యవాద ఉద్దేశ్యాలు సాధించడానికి, చేయబడినది.
👉విద్యా హక్కు ను, 2002 లో, భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం ప్రాథమికహక్కు గా చేయబడినది. ఈ హక్కు ప్రకారం, ప్రతి బాలురు/బాలికలు, పౌరులు, ఎలిమెంటరీ స్థాయిలో ప్రాథమిక విద్యను ఓ హక్కుగా కలిగివుంటారు.

# VINAYS INFO

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section