Type Here to Get Search Results !

Vinays Info

వ్యవసాయం - Agriculture - VINAYSINFO

👉వ్యవసాయం - Agriculture

-అగ్రికల్చర్ అనే ఆంగ్లపదం లాటిన్ భాష నుంచి వచ్చింది. అగ్రి అంటే లాటిన్‌లోట్టి, కల్టివేషన్ అంటే సాగు చేయడం అని అర్థం.

-దేశంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆగ్రికల్చర్ రిసెర్చ్) న్యూఢిల్లీలో ఉంది.

-దేశంలో వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వ్యవసాయాన్ని రుతుపవనాలతో జూదం ఆడటం అంటారు.

-మనదేశంలో వ్యవసాయాన్ని 6 భాగాలుగా విభజించారు.

1) విస్థాపన వ్యవసాయం/పోడు వ్యవసాయం
2) జీవనాధార వ్యవసాయం
3) విస్తృత వ్యవసాయం
4) సాంద్ర వ్యవసాయం
5) తోట వ్యవసాయం
6) మిశ్రమ వ్యవసాయం

👉జీవానాధార వ్యవసాయం
-రైతు కుటుంబం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది.
-ఇది ఒక ప్రాంతంలో స్థిరపడి చేసే వ్యవసాయం.
-ఈ వ్యవసాయం వల్ల లాభం ఉండదు. ప్రచ్ఛన్న నిరుద్యోగానికి దారితీస్తుంది.
-ఈ వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది.
-ఇండియాలో ఈ వ్యవసాయాన్ని రుతుపవనాలతో జూదం అంటారు.
విస్తృత వ్యవసాయం/ఆధునిక వ్యవసాయం
-వ్యవసాయ భూమి ఎక్కువ, జనసాంద్రత తక్కువగా ఉన్నచోట యంత్రాలను ఎక్కువగా ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని విస్తృత/ఆధునిక వ్యవసాయం అంటారు.
-ఇండియాలో ఈ వ్యవసాయం లేదు.
ఉదా: రాంచీలు (ఆస్ట్రేలియా)

👉సాంద్ర వ్యవసాయం
-పురాతన పద్ధతులు ఉపయోగిస్తారు.
-జనసాంద్రత ఎక్కువ, కమతాల పరిమాణం తక్కువ.
-నీటిపారుదల వసతులు తక్కువ, క్రిమిసంహార మందుల వాడకం ఎక్కువ
ఉదా: ఇండియా

👉తోట వ్యవసాయం (వాణిజ్య వ్యవసాయం)
-దీన్ని బ్రిటీష్‌వారు ప్రవేశపెట్టారు.
-ఈ వ్యవసాయానికి ఎక్కువ పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం అవసరం (దిగుబడి నిచ్చే విత్తనాలు)
-సాధారణంగా ఈ వ్యవసాయాన్ని ఎత్తయిన ప్రదేశాల్లో చేస్తారు.
ఉదా: పశ్చిమకనుమలు, ఈశాన్య భారత్

👉మిశ్రమ వ్యవసాయం
-వ్యవసాయంతోపాటు పశుపోషణ, కోళ్ల పెంపకం, సెరికల్చర్, ఎపికల్చర్ వంటి కార్యక్రమాలు చేపడితే మిశ్రమ వ్యవసాయం అంటారు.
-మిశ్రమ అంటే-పంటలతోపాటు పశువుల పెంపకం.
-ఇంద్రధనస్సు విప్లవంలో మిశ్రమ వ్యవసాయం ఒక భాగం.

👉దేశంలో పంటకాలాలు-రకాలు
-మనదేశంలో వ్యవసాయం 3 కాలాల్లో జరుపుతున్నారు. ఇవి రుతుపవనాలకు అనుసంధానంగా ఉన్నాయి.

👉-ఖరీఫ్: జూన్-సెప్టెంబర్/అక్టోబర్

-ఇది ముఖ్యంగా నైరుతి రుతుపవన పంటకాలం
-ముఖ్య పంటలు.. వరి, మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ, చెరకు, నూనెగింజలు

👉-రబీ: అక్టోబర్-మార్చి/ఏప్రిల్

-ఇది ముఖ్యంగా ఈశాన్యరుతుపవన పంటకాలం
-గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాలు ముఖ్యమైన పంటలు.

👉-జయాద్: ఏప్రిల్-జూన్

-ఇది వేసవి కాలం పంట
-ముఖ్య పంటలు కూరగాయలు, మక్కజొన్న, పుచ్చకాయలు
-నీటి పారుదల సౌకర్యాలు ఉన్నచోట జయాద్ పంటకాలంలో అన్ని రకాల పంటలు పండించవచ్చు.

👉పంట రకాలు
-దేశంలో పంటలను 4 రకాలుగా విభజించవచ్చు.

1. ఆహార పంటలు: వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, బార్లీ, పప్పుదినుసులు. ఇవి 2 రకాలు
-ప్రధాన ధాన్యాలు: వరి, గోధుమ, మొక్కజొన్న
-తృణ ధాన్యాలు: జొన్న, సజ్జ, రాగులు, బార్లీ

2. నగదు పంటలు: పొగాకు, పత్తి, జనుము, చెరకు, నూనెగింజల పంటలు (వేరుశనగ, ఆముదం, పొద్దు తిరుగుడు)

3. తోట పంటలు: కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు

4. ఉద్యాన పంటలు: పండ్లు, పూలు, కూరగాయలు
ఆహార పంటలు
-ఆహార పంటలు మనదేశంలో విస్తీర్ణపరంగా 3/4 వంతు, ఉత్పత్తి పరంగా 1/2 వంతు స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
వరి
-2004ను అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించారు.
-ఇది ఉష్ణమండల పంట.
-దీని నినాదం రైస్ ఈజ్ లైఫ్.
-వాతావరణ పరిస్థితి (ఉష్ణోగ్రత) 240c-320c,
-వర్షపాతం 150 - 200 సెం.మీ.
-వరి సాగును Hoe culture అంటారు.
-ప్రపంచ వరి ఉత్పత్తిలో.. చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.
-దేశంలో.. పశ్చిమబెంగాల్-1 (16 శాతం), ఉత్తరప్రదేశ్-2, ఆంధప్రదేశ్-3, పంజాబ్-4, బీహార్-5, తమిళనాడు-6వ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.

-తెలంగాణలో.. కరీంనగర్ మొదటి స్థానంలో (కరీంనగర్‌ను రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటారు), వరంగల్ రెండో (2014-15 ప్రకారం నల్లగొండ) స్థానంలో ఉన్నాయి.

-వరి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా పండుతుంది.
-ఈ పంటకు ఒండ్రు నేలలు అనుకూలం.
-దేశంలో వరిని అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాలు: కేజీ బేసిన్ జిల్లాలు (ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా), తంజావూరు (తమిళనాడు).
-రైస్ బైల్ ఆఫ్ ఇండియా- కేజీ డెల్టా
-అంతర్జాతీయ వరి పరిశోధానా కేంద్రం- మనీలా (ఫిలిప్పీన్స్)
-అభివృద్ధి చేసిన హైబ్రిడ్ వరి వంగడం- మిరాకల్ రైస్
-జాతీయ వరి పరిశోధనా కేంద్రం- కటక్ (ఒడిశా)
-ఇక్కడ అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకం- తానిశ్రీ
-చైనా అభివృద్ధి చేసిన వరి వంగడం- గోల్డెన్ రైస్ (విటమిన్ -ఏ అధికం)
-నార్వేలోని స్వాల్‌బర్డ్ విత్తనకేంద్రంలో భారత్ డిపాజిట్ చేసిన వరి వంగడాలు.. ఆర్-36, ఐఆర్-64
-ప్రపంచంలో వరిని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాలు-థాయ్‌లాండ్, మయన్మార్.
-వర్షాభావ ప్రాంతాల్లో ఆరుతడుల మీద వరిని సాగుచేయడానికి రూపొందించిన సాంకేతిక విధానం- శ్రీ (ఎస్‌ఆర్‌ఐ-సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్)

👉గోధుమ
-ఇది సమశీతోష్ణ మండల పంట.
-ఉష్ణోగ్రత 150c - 210c, వర్షపాతం 75 -100 సెం.మీ.
-ప్రపంచ గోధుమల ఉత్పత్తిలో.. చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్, అమెరికా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో.. ఉత్తరప్రదేశ్-1 (34 శాతం), పంజాబ్-2 (19 శాతం), హర్యానా-3, మధ్యప్రదేశ్-4, రాజస్థాన్-5వ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
-తెలంగాణలో.. ఆదిలాబాద్ మొదటి స్థానంలో, మెదక్ రెండో స్థానంలో ఉన్నాయి.
-ఇది రబీ కాలపు పంట
-ఈ పంటకు ఒండ్రు, లోమ్ నేలలు అనుకూలం.
-గోధుమ దిగుబడి అధికంగా గల రాష్ట్రం- పంజాబ్
-ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ర్టాలను భారతదేశ గోధుమ ధాన్యాగారాలు అంటారు.
-ఉక్రెయిన్‌ను ప్రపంచ రొట్టెల గంప అంటారు.
-నార్వేలోని స్వాల్‌బర్డ్ విత్తనకేంద్రంలో డిపాజిట్ చేసిన గోధమ రకాలు రిడ్లీ, లెర్మారోజా, సోనారో-64.
-దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే గోధుమ రకాలు.. సొనాలికా, కళ్యాణ్ సోనా, షర్బతి
-హరితవిప్లవం (1960) ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందిన పంటలు.. గోధుమ, వరి, జొన్న, మక్కజొన్న.
-తక్కువ ప్రయోజనం పొందిన పంటలు.. పప్పు ధన్యాలు, నూనె గింజలు
-హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి-విలియం గాండ్.
-హరిత విప్లవాన్ని మొదటిసారిగా ప్రపంచంలో వ్యాప్తి చేసిన వ్యక్తి - నార్మన్ బోర్లాంగ్ (మెక్సికో)
-దేశంలో హరితవిప్లవాన్ని అధికంగా వ్యాప్తి చేసిన వ్యక్తి-ఎంఎస్ స్వామినాథన్

👉జొన్న

-ఇదీ రబీకాలం పంట
-ఈ పంటకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు- 200c-320c ఉష్ణోగ్రత, 30-100 సెం.మీ. వర్షపాతం.
-ప్రపంచ జొన్న ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో, అమెరికా, చైనా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో జొన్న ఉత్పత్తిలో.. మహారాష్ట్ర (19 శాతం), కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి.
-రాష్ట్రంలో.. జొన్న ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ మొదటిస్థానంలో (2014-15), ఆదిలాబాద్ రెండోస్థానంలో ఉన్నాయి.
-ఈ పంటకు నల్ల జంబాల మృత్తికలు (పొర మాదిరి మృత్తికలు) చాలా అనుకూలం.
-దీనికి పేదల ఆహారం అని పేరు.

👉మక్కజొన్న

-ప్రపంచ మక్కజొన్న ఉత్పత్తిలో.. అమెరికా, చైనాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో.. తెలంగాణ మొదటి స్థానంలో, కర్ణాటక రెండో స్థానంలో ఉన్నాయి.
-తెలంగాణలో.. మెదక్ (2012-13), నిజామాబాద్‌లు మక్కజొన్నను అత్యధికంగా పండిస్తున్నాయి.

👉రాగులు
-ఈ పంట ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే పండుతుంది.
-దీనికి ఫింగర్ మిల్లెట్, బుక్ వీట్ అనే పేర్లున్నాయి.
-ప్రపంచ రాగులు ఉత్పత్తిలో.. ప్రథమస్థానంలో భారత్, రెండో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి.
-దేశంలో.. కర్ణాటక మొదటి స్థానంలో, తమిళనాడు, కేరళ, తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-తెలంగాణలో.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
విస్థాపన వ్యవసాయం (సంచార వ్యవసాయం)
-ఈ వ్యవసాయంలో అడవుల్లో చెట్లను కాల్చి పంట భూములుగా మార్చుతారు.
-నిర్ధిష్ట కాలం తర్వాత అంటే భూసారం తగ్గిన తర్వాత ఆ భూమిని వదిలి వేరే చోటుకు వెళ్తారు. అంటే వేరే భూమికి మారిపోయే ప్రక్రియను విస్థాపక వ్యవసాయం అంటారు.

👉-ఈ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలిస్తారు.
రాష్ట్రం/ప్రాంతం పేరు మారుపేరు
తెలంగాణ  ➡ పోడు
అసోం, ఈశాన్య రాష్ర్టాలు ➡ జూమ్
హిమాలయాలు ➡ఖిల్
మధ్యప్రదేశ్➡ బేవార్, పెండ
జార్ఖండ్ ➡కురువా, పెండ
కేరళ ➡పోనమ్
పశ్చిమకనుమలు ➡కమ్రి
ఒడిశా ➡పామిగాబి, బ్రింగా
రాజస్థాన్ ➡వాత్రా

👉ప్రపంచస్థాయి పేర్లు

దేశం➡ మారుపేరు
శ్రీలంక ➡చినా
ఇండోనేషియా ➡లడంగ్
థాయ్‌లాండ్ ➡తమారి
వియాత్నాం ➡రే
బ్రెజిల్ ➡రోకా
వెనుజులా ➡కొనుకో
మధ్య అమెరికా ➡మిల్ఫా
మధ్య ఆఫ్రికా ➡మసోలి

-2000 సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వం మిశ్రమ వ్యవసాయాన్ని ప్రారంభించింది.
-2014ను యూఎన్‌ఓ అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది.
-2016ను యూఎప్‌ఓ పప్పు దినుసుల సంవత్సరంగా ప్రకటించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section