🌸అడవులు భూమి మీద మోత్తం విస్తీర్ణంలో మూడింట ఒక వంతు (అనగా 33%) ఉండాలి.
🌸మోక్కలు పెరగడానికి నీరు, సూర్యకాంతి,సారవంతమైన నేల అవసరం.
🌸పెద్దవిగా పెరిగే కొన్ని రకాల చెట్లు -మామిడి, చింత, మర్రి, నారింజ.
🌸పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని "వామన వృక్షాలు(బోన్సాయ్)" అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ.
🌸కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఏర్పడింది.
🌸వన ప్రేరణ ఉద్యమం మోక్కల పెంపకంకోసం ఏర్పడింది.
🌸మోక్కలు పరిరక్షణకు పాటుపడ్డ విద్యార్థులకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ "వన ప్రేమి" పురష్కారంతో సత్కరిస్తుంది.
🌸నేషనల్ గ్రీన్ కోర్ లక్ష్యం- పాఠశాల పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ,శ్రమ విలువను మరియు వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, గ్రామస్తులకు పర్యావరణం పై అవగహాన కల్పించడం.
🌸కల్తీ కూరగాయలు తినడం వల్లా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.
🌸వేప చెట్టును ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షం గా ప్రకటించింది.
Posted by : Matam Shivananda Swamy
5th EVS-మనం చెట్లను పెంచుదాం
October 04, 2016
Tags