Type Here to Get Search Results !

Vinays Info

రావాడ సత్యనారాయణ | Ravada SatyaNarayana | VINAYS INFO

రావాడ సత్యనారాయణ (ఫిబ్రవరి 22, 1911 - సెప్టెంబరు 28, 1980) తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆయన 1969 - 72 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా కూడా యున్నారు.

జీవిత విశేషాలు

శాస్త్రవేత్తగా పేరుపొందిన రావాడ సత్యనారాయణ ఫిబ్రవరి 22, 1911న వరంగల్లు నగరంలో జన్మించారు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ మరియు పీహెచ్‌డి పట్టా పొందారు. కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయములో భౌతికశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేసి ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. భౌతికశాస్త్రంలో పలు పరిశోధనలు చేసిన రావాడ సత్యనారాయణ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు. పలు గౌరవపదవులు పొందడమే కాకుండా దేశవిదేశాలలోని విశ్వవిద్యాలయాల ఫెలోషిప్‌లను కూడా అందుకున్నారు.

ఆయన భౌతిక శాస్త్ర రంగములో అధ్యయనం చేసిన ప్రయోగశీలిగా ప్రసిద్ధిపొందారు. ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. జాతీయ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక గౌరవ పదవులను అధిష్టించారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో ఫెలోషిప్ లు అందుకున్నారు. భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా, ఉపన్యాస కర్తగా విశేష కీర్తినార్జించారు.

మరణం

సెప్టెంబరు 28, 1980న అమెరికా లోని టెక్సాస్ లో మరణించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section