రాజా రామ్మోహన్ రాయ్ ( బెంగాలీ: রাজা রামমোহন রায় ) (మే 22, 1772 – సెప్టెంబరు 27, 1833) బ్రహ్మ సమాజ్, భారతదేశము లో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు.
👉ఆతని విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగముల లోనే కాకుండా హిందూ మతము పైన కూడా కనపడుతున్నది.
👉ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు.
👉వితంతు పునర్వివాహానికి కూడా మద్దతు పలికినాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.
👉ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
👉1828 లో ఇంగ్లాండు కు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్ తో కలసి బ్రహ్మసమాజ్ ను ప్రారంభించెను.
👉 బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్ లో సాంఘిక , వివేచనాత్మక సంస్కరణ లకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము లో ఒక ముఖ్యుడిగా భావింపబడెను.
బాల్యము విద్యాభ్యాసము
👉ఇంగ్లాండు దేశంలో బ్రిస్టల్ లో రామ్మోహన్ రాయ్ శిలావిగ్రహం
రాయ్ రాథానగర్, బెంగాల్ లో 1772 లో జన్మించెను. కుటుంబములో మతపరమైన వైవిధ్యము కలదు. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతమునకు చెందినది. రామ్మోహన్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను పదిహేనో యేడు వరకు అభ్యసించెను.
👉యుక్తవయస్సు లో కుటుంబ ఆచారముల తో సంతృప్తి పొందక, యాత్రలు సాగించడము మొదలు పెట్టెను. ఆ తరువాత కుటుంబ ప్యవహారములు చూసుకోవడానికి తిరిగి వచ్చి, కలకత్తా లో వడ్డీ వ్యాపారిగా మారెను. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ లో పని చేసెను.
👉వీర్ థొ పాత్తు ప్రస్థుథం ఫీత్జీ లొ చదివె చరన్ కూద పని చెసారు
సంఘ సంస్కరణలు
👉భారత సంఘ సంస్కరణల చరిత్ర లోనే రామ్మోహన్ రాయ్ పేరు, సతీసహగమనము ను రూపుమాపడము తో ముడిపడి చిరస్థాయి గా నిలిచిపోతుంది.
👉రామ్మోహన్ రాయ్, హిందూ పూజారుల అధికారమును ధిక్కరించి, అ కాలములో సాధారణమైన బహు భార్యత్వము నేరమని జనులకు నచ్చ చెప్పెను.జయెంద్ర ఒక్క సంగ సంస్కర్థ.
విలువలు
👉తాను సంకల్పించిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వము నే ప్రధానము గా తీసుకొనెను.
👉 జనులకు తన ఉద్దేశ్యము సమాజము లో ఉన్న మంచి సాంప్రదాయములను నిర్మూలించడము కాదని, కేవలము వాటిపై సంవత్సరముల పాటు నిరాదరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడము అని చూపించుటకు కష్టపడెను. ఉపనిషత్తులను గౌరవించి, సూత్రములను చదివెను. విగ్రహారాధనను ఖండించెను. ఆఖండానందమును పొందుటకు, ఆధాత్మిక చింతన, భగవంతుని ధ్యానము ఉన్నత మార్గములని, ఇవి చెయ్యలేనివారికి బలులు ఇవ్వడము మార్గమని ప్రతిపాదించెను.
👉వితంతు పునర్వివాహము, మహిళలకు ఆస్తిహక్కు లను సమర్థించెను. బహుభార్యాత్వమును ఖండించెను.
👉అందరికీ విద్య, ముఖ్యముగా మహిళలకు విద్యను సమర్థించెను.
👉అచార సంబంధమైన సంస్కృత విద్య కంటే ఇంగ్లీషు విద్య మంచిదని భావించి, సంస్కృత పాఠశాల లకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించెను.
👉1822 లో ఇంగ్లీషు పాఠశాలను ప్రారంభించెను.
👉తాను కనుగొన్న సామాజిక, మతపరమైన దురాచారములను నిర్మూలించడానికి బ్రహ్మ సమాజమును ప్రారంభించెను.
👉బ్రహ్మ సమాజము వివిధ మతముల లో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతముగా ఎదిగెను
తరువాత జీవితము
👉లండన్ బెడ్‌ఫోర్డ్ స్క్వేర్‌లో నీలి ఫలకం
1831 లో మొఘల్ సామ్రాజ్య రాయబారిగా ఇంగ్లండు కు వెళ్లెను.
👉 ఫ్రాన్స్ ను కూడా దర్శించెను. స్టేపెల్ టన్, బ్రిస్టల్ లో 1833 లో మెదడువాపు వ్యాధి తో మరణించెను.