Type Here to Get Search Results !

Vinays Info

నిజాం పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి

తెలంగాణలో ఆధునిక అభివృద్ధి పోకడలకు బీజం పడింది నిజాం పాలకుల కాలంలోనే. హైదరాబాద్, గోల్కొండ కేంద్రంగా సాగిన వీరి పాలనాకాలంలో అధునిక రవాణా సౌకర్యాలు, పాశ్చాత్య విద్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిజాంపాలకుల కాలంలో హైదరాబాద్ స్టేట్‌లో జరిగిన అభివృద్ధిపై.....

-హైదరాబాద్ రాజ్యాన్ని నిజాంలు 1724 నుంచి 1948 వరకు పరిపాలించారు.
-తెలంగాణ హైదరాబాద్ రాజ్యంలో సగానికిపైగా ఉంది.
-నిజాం కాలంలో అంటే 1853 నుంచి 1883 వరకు ప్రధానమంత్రిగా ఉన్న సాలార్‌జంగ్ -I కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

ఆధునీకరణ

సాలార్‌జంగ్ కంటే ముందే హైదరాబాద్ రాజ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని హైదరాబాద్ రాజ్య ఆర్థికమంత్రిగా ఉన్న సర్ అక్బర్ హైదరీ అన్నాడు.
-మొదటి సాలార్‌జంగ్ అసలు పేరు తురబ్ అలీఖాన్.
-ఇతను హైదరాబాద్ రాజ్య దివానుగా 1853 మే 31 నుంచి 1883 ఫిబ్రవరి 8 వరకు కొనసాగి ఎన్నో సంస్కరణలు చేశాడు.
-1855లో జీతంపై పనిచేసే తాలూక్‌దార్లను (కలెక్టర్లు) నియమించాడు.
-కాంట్రాక్ట్ తాలూక్‌దార్లను తొలగించాడు.
-ఎక్కువ వడ్డీరేటుపై తాకట్టు పెట్టిన భూములను విడిపించాడు.
-హోలిసిక్కాని ముద్రించే కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాడు.
-1865లో జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
-జిలాబందీ ప్రకారం రాజ్యాన్ని 14 జిల్లాలుగా విభజించాడు.
-ప్రతి జిల్లాపై అవల్ తాలూక్‌దార్ (జిల్లా కలెక్టర్)ను నియమించాడు.
-ఇతనికి సహాయంగా దోయం తాలూక్‌దార్ (సబ్ కలెక్టర్), సోయం తాలూక్‌దార్ (తహసీల్దార్)లను నియమించాడు.
-తాలూక్‌దార్ల పని విధానాన్ని పర్యవేక్షించడానికి మజ్లిస్-ఎ-మల్‌గుజారి అనే బోర్డును ఏర్పాటు చేశాడు.
-1868లో మొదటి సాలార్‌జంగ్ నలుగురు మంత్రులను నియమించాడు.
-ఈ మంత్రిమండలిని సాదర్-ఉల్ మహం అని అనేవారు.
-ఈ మంత్రిత్వ శాఖలో రెవెన్యూ శాఖ మంత్రి - ముఖరం ఉద్దౌలాన్యాయశాఖ మంత్రి - బషీర్ ఉద్దౌలా
పోలీస్ శాఖ మంత్రి - షంషేర్ జంగ్
విద్య, ఆరోగ్యమంత్రి - షహబ్‌జంగ్ బహదూర్‌లు ఉన్నారు.
-రెవెన్యూ సంస్కరణలు : రైతుల నుంచి పన్నులను వసూలు చేయడానికి జీతమిచ్చే ప్రాతిపదికన తాలూక్‌దార్లను నియమించాడు.
-విద్యా సంస్కరణలు : హైదరాబాద్ రాజ్యంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు.
-1855లో దారుల్-ఉల్-ఉలూమ్ అనే ఆంగ్ల పాఠశాలను స్థాపించాడు.
-1870లో సిటీ హైస్కూల్‌ను స్థాపించాడు.
-1870లో ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించాడు.
-1872లో చాదర్‌ఘాట్ హైస్కూల్‌ను స్థాపించాడు.
-1873లో నవాబుల పిల్లల కోసం మదర్సా-ఇ-ఆలియా
-1878లో రాజ కుటుంబ పిల్లల కోసం మదర్సా-ఇ-ఐజాను స్థాపించాడు.
-న్యాయ సంస్కరణలు : సాలార్‌జంగ్ కాలంలో న్యాయవ్యవస్థకు స్వేచ్ఛ కలదు.మున్సిఫ్ మీర్ ఆదిల్ అనే న్యాయమూర్తుల నియామకం చేశాడు.
-హైదరాబాద్‌లో సివిల్ కోర్టు బుజుంగ్‌ను ఏర్పాటు చేశాడు.
-ఫౌజ్‌దారీ అదాలత్ అనే క్రిమినల్ కోర్టును స్థాపించాడు.

పోలీస్ సంస్కరణలు

-మహకామ-ఇ-కొత్వాలి అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేశాడు.
-ఇతను నిజామత్ అనే పోలీస్ దళాన్ని ఏర్పాటుచేశాడు.
-మహతామిన్‌లనే పోలీస్ సూపరింటెండెంట్లను నియమించాడు.

నీటి పారుదల సౌకర్యాలు

-మీర్ మహబూబ్ అలీఖాన్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఎక్కువగా నీటి పారుదల సౌకర్యాలు ఉన్నాయి.
-ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ అలీ నవాబ్ జంగ్‌ను నీటి పారుదల ఇంజినీర్‌గా నియమించాడు.
-1908లో హైదరాబాద్ మూసీకి వరదలు వచ్చిన తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల మేరకు మూసీపై ఆనకట్టల నిర్మాణం చేశారు.
-మీర్ ఆలం ట్యాంక్ 1810లో మీర్‌ఆలం చేత నిర్మించబడింది.
-గండిపేట ఉస్మాన్ సాగర్ (1919), హిమాయత్ సాగర్ (1927)లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించాడు.
-నిజాం సాగర్ ప్రాజెక్టును 1923 అక్టోబర్ నుంచి 1930 వరకు నిర్మాణం జరిగి 1932 నాటికి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యింది. ఇది ఏడో నిజాం నిర్మించాడు.
-పాలేరు రిజర్వాయర్‌ను ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం గ్రామంలో నిర్మించారు. 1929లో నిర్మాణం పూర్తయ్యింది.
-వైరా ప్రాజెక్టు కూడా ఖమ్మం జిల్లాలో ఉంది. నిర్మాణం 1923లో పూర్తయ్యింది.
-సింగభూపాలం రిజర్వాయర్ ఇల్లెందు తాలూకాలో 1918లో ప్రారంభమైంది.
-రాయంపల్లి రిజర్వాయర్‌ను మెదక్ జిల్లాలో నిర్మించారు. 1924లో నిర్మాణం పూర్తయింది.

రైల్వే వ్యవస్థ

-సికింద్రాబాద్‌లోని బొల్లారం దక్షిణ భారతంలో బ్రిటిష్ సైన్యానికి కేంద్రం.
-ముంబై ప్రభుత్వం, హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్ కలిసి హైదరాబాద్ పట్టణాన్ని కలుపుతూ రైలు వ్యవస్థ నెలకొల్పాలని నిర్ణయించారు.
-భారత ప్రభుత్వం 1864 ఫిబ్రవరి 29న ముంబై నుంచి మద్రాస్ వెళ్లే రైలుమార్గం రాష్ట్రంలో గుల్బర్గా, రాయచూర్, గుత్తి ద్వారా మద్రాస్‌కు పోయే రైళ్లను గుల్బర్గా నుంచి హైదరాబాద్‌కు కలపాలని నిర్ణయించారు.
-నిజాం గ్యారంటీడ్ రైల్వే వ్యవస్థ 1883లో వచ్చిన తర్వాత వాడీ-సికింద్రాబాద్-రైల్వేలైన్‌ను వరంగల్ నుంచి బెజవాడ వరకు పొడిగించబడింది.
-హైదరాబాద్ రాజ్యంలో 1930 నాటికి రూ. 31 లక్షలతో 2933 మైళ్ల రోడ్ల నిర్మాణం కూడా జరిగింది.
-1940 నాటికి 5911 మైళ్ల పొడవైన రోడ్ల నిర్మాణం జరిగింది.
-1907లో నాంపల్లి రైల్వేస్టేషన్‌ను నిజాం నిర్మించాడు.
-ఇది పూర్వం హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు.
-ఈ స్టేషన్‌ను తడి ప్రాంతంలో కట్టడం వల్ల నాంపల్లి అనే పేరు వచ్చింది.
-ఉర్ధూ బాషలో నామ్ అంటే తడి అని, పల్లి అంటే ప్రాంతం అని అర్థం.
-ఈ స్టేషన్ నుంచి ప్రారంభంలో వస్తువులు రవాణా అయ్యేవి.
-ఈ స్టేషన్ నుంచి మొదటి ప్యాసింజర్ రైలు 1921లో ప్రారంభమైంది.

కాచిగూడ రైల్వేస్టేషన్

-ఈ రైల్వేస్టేషన్‌ను నిజాం 1916లో నిర్మించారు.
-1950 వరకు నిజాం రాజ్య గ్యారంటీడ్ రైల్వేస్టేషన్ హెడ్ క్వార్టర్‌గా ఉంది.
-ఈ స్టేషన్‌ను సెంట్రల్, సైడ్ డోములతో, మినరేట్స్ కలిగి ఉండి, గోథిక్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించబడింది.

విమానయాన వ్యవస్థ

-అన్ని స్వదేశీ సంస్థానాల్లోకెల్లా హైదరాబాద్ సంస్థానానికి సొంత విమానయాన వ్యవస్థ ఉంది. దీని హెడ్‌క్వార్టర్ బేగంపేట.
-ఈ వ్యవస్థ 1930 నుంచి నిజాం గ్యారంటీడ్ స్కీం కింద పనిచేసి తర్వాత, 1938 నుంచి రైల్వే బోర్డు ఆధీనంలోకి వచ్చింది.
-1869లో మొదటి సాలార్‌జంగ్ తపాలా శాఖను ఏర్పాటుచేశాడు.
-తపాలాశాఖ అధిపతిని నాజిమ్ లేదా పోస్ట్‌మాస్టర్ జనరల్ అని పిలిచేవారు.
-ఈ శాఖ ఒక అణ (6 పైసలు) స్టాంప్‌ను ముద్రించింది.
-ప్రథమ హైదరాబాద్ తపాలా శాఖాధిపతిగా షాసావర్‌జంగ్‌ను నిజాం నియమించాడు.
-హైదరాబాద్‌లో మొదటి టెలిఫోన్ సౌకర్యాన్ని 1885లో ప్రవేశపెట్టారు.
-సంస్థానాల్లో టెలిఫోన్ సౌకర్యం కోసం 1910 వరకు బ్రిటిష్ ఇండియా అనుమతి తప్పనిసరి.
-1923, 1945 మధ్యలో పది టెలిఫోన్ ఎక్సేంజీల నిర్మాణం జరిగింది.
-హైదరాబాద్ రాజ్యంలో పారిశ్రామీకరణ మూడు దశల్లో జరిగింది.
-మొదటి దశ- 1870-1918 వరకు
-రెండో దశ- 1919-1939 వరకు
-మూడో దశ- 1939-1948 వరకు
-మూడో దశలో ఎక్కువగా పారిశ్రామీకరణ జరిగింది.
-మొదటి దశలో వీవింగ్ మిల్స్ లిమిటెడ్ (1877), మహబూబ్‌షాహీ మిల్స్ (1884), ఔరంగాబాద్ మిల్స్ (1888) స్థాపించారు.
-రెండో దశలో.. 1917లో ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీని నిర్మించారు. 1918లో కామర్స్ ఇండస్ట్రీస్‌ను, 1930లో ఓయూ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
-మూడో దశ అంటే 7వ నిజాం కాలంలో ఎక్కువ పారిశ్రామీకరణ జరిగింది.
-1920లో కార్ఖానా జిందా తిలిస్మాత్‌ను మొహినుద్దీన్ ఫారూకీ హైదరాబాద్‌లో నిర్మించారు. దీని నుంచి జిందా తిలిస్మాత్, ఫారూకీ దంత్‌మంజన్ ఉత్పత్తి అవుతున్నాయి.
-1921లో ఖమ్మంజిల్లాలో సింగరేణి కాలరీస్‌ను ప్రారంభించారు.
-1925లో చార్మినార్ సిగరెట్ కంపెనీ, 1930లో వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీలను స్థాపించారు.
-1934లో వరంగల్‌లో అజమ్‌జాహీ మిల్స్‌ను స్థాపించారు. దీని నుంచి బట్టలు ఉత్పత్తి అవుతాయి.
-1937లో నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమను, 1942లో హైదరాబాద్‌లో ఆల్విన్ మెటల్ వర్క్స్‌ను, 1943లో సికింద్రాబాద్‌లోని కవాడీగూడలో ప్రాగాటూల్స్‌ను స్థాపించారు. దీనినుంచి యంత్రాల పనిముట్లు తయారవుతాయి.
-1945లో దక్కన్ విమానయాన సంస్థను బేగంపేట వద్ద స్థాపించారు. ఇది 1953లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో కలిసిపోయింది.
-1946లో ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ పేపర్ మిల్లును స్థాపించారు. దేశంలో ప్రారంభించిన మొదటి పరిశ్రమల్లో ఇది ఒకటి.
-1941లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ప్రభుత్వ బ్యాంక్ అయిన హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ప్రారంభమైంది. ప్రస్తుతం దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తున్నారు.
-నిజాం సొంతంగా రూ. 100 నోటు జారీచేసి, చెలామణిలోకి తెచ్చాడు.

VinayKumar Mukkani: ఇంగ్లిష్ మిషనరీ వారు 1834లో సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌ను స్థాపించారు.
-1859లో నిజాం ప్రభుత్వం పర్షియన్, స్థానిక భాషల్లో పాఠశాలలను నిర్మించాలని సూచించింది.
-1887లో నిజాం కళాశాలను స్థాపించారు. దీని మొదటి ప్రిన్సిపల్ డా. అఘోరనాథ ఛటోపాధ్యాయ
-ఉస్మానియా యూనివర్సిటీని 1400 ఎకరాల్లో నిర్మించడానికి 7వ నిజాం 1918, ఆగస్టు 28న ఒక రాజశాసనాన్ని జారీచేశాడు.
-వర్సిటీ నిర్మాణం నవాబ్ జైన్‌యార్‌జంగ్, సయ్యద్ అలీరాజా ఆధ్వర్యంలో జరిగింది.
VinayKumar Mukkani: -1934-1939 మధ్య కాలంలో ఆర్ట్స్ కళాశాల నిర్మాణం జరిగింది. దీనికి రూ. 36 లక్షలు ఖర్చయ్యింది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section