ఆవాస నిబద్ధతా సూచీ

VINAYS INFO
VINAYS INFO


దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌ రాజధాని క్విటోనగరంలో 2016 అక్టోబరు 17 నుంచి 20వ వరకు ఐక్యరాజ్యసమితి సారథ్యంలో హాబిటాట్‌-3 అనే పేరుతోప్రపంచ పట్టణీకరణ సదస్సు జరగనున్న నేపథ్యంలోగ్లోబల్‌ అర్బన్‌ ఫ్యూచర్స్‌ ప్రాజెక్ట్‌ పేరుతో ఓ నివేదికను విడుదల చేశారు. పట్టణీకరణ లక్ష్యాల్లో భారత్‌ ఆశించిన సత్ఫలితాలు సాధించలేకపోయింది. ఈ విషయంలో ఒక్కో దేశం ఎక్కడున్నది తెలుసుకోవడానికి వీలుగా ఆవాస నిబద్ధతా సూచీ (హాబిటాట్‌ కమిట్‌మెంట్‌ ఇండెక్స్‌)రూపొందించారు. ఈ సూచీ ప్రకారం పాకిస్థాన్‌, నేపాల్‌ స్కోరు రెండేసి పాయింట్ల చొప్పున పెరిగింది. భారతదేశం మాత్రం 0.41 పాయింట్లు నష్టపోయింది. దక్షిణాసియా దేశాల సగటు కంటే భారత్‌ వెనుకంజలో ఉండిపోయింది. ఈ సూచీ తయారీకి పలు  అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అందరికీ గూడు, సుస్థిర ఆవాసాలు , స్త్రీ, పురుష సమానత్వం, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలను ఈ సూచీ తయారీకి ప్రామాణికాలుగా తీసుకున్నారు.

గృహ వసతి, సుస్థిర పట్టణాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి నిర్వహించే సదస్సును హాబిటాట్‌-3 అని వ్యవహరిస్తున్నారు. దేశహాబిటాట్‌-1 కెనడాలోని వాంకూవర్‌లో 1976లో జరిగింది1996లో టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంలో రెండో సదస్సు హాబిటాట్‌-2ను నిర్వహించారు

You may like these posts

Post a Comment