👉విషయమును అర్థవంతముగాను, సంపూర్ణము గాను స్పష్టముగాను భావప్రకటనమును కలిగించెడి పదముల సముదాయమును వాక్యము అందురు. వాక్యములో మూడు ప్రధానమైన భాగములు ఉండును.
👉హిందూమతం లోని ఆధ్యాత్మిక , ఉపనిషత్తుల సారము నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి.
భాగాలు
👉కర్త : ఒక పనిని చేయువారు.
కర్మ: ఆ పని యొక్క ఫలితములను అనుభవించునది.
👉క్రియ: పనిని తెలియజేయు పదము.
రకాలుసవరించు
👉సంపూర్ణ వాక్యము: సమాపక క్రియలో పూర్తి అగునట్టి వాక్యమును సంపూర్ణ వాక్యము లేదా సామాన్య వాక్యము అందురు. ఉదా: కల్యాణమండపములో వివాహము జరుగుతున్నది.
👉అసంపూర్ణ వాక్యము: అసమాపక క్రియలలో వాడిన వాక్యమును అసంపూర్ణ వాక్యము అందురు. ఉదా: నేను దేవాలయమునకు వెళ్ళి,
అవాంతర వాక్యము: ఒక సంపూర్ణము కాని వాక్యమును, ప్రసంగమున మధ్యలో వచ్చెడి వాక్యమును అవాంతర వాక్యము అందురు. ఉదా: తగిన ఇంధనము లేనిచో విమానము ఎగురలేదు.
👉సంశ్లిష్ట వాక్యము: సంపూర్ణ వాక్యములను, అవాంతర వాక్యములను కలిగియుండి పూర్తి అర్ధము నిచ్చు వాక్యమును సంశ్లిష్ట వాక్యము అందురు. ఉదా: నీవు సక్రమముగా పోటీకి వచ్చి ప్రశ్నలకు శ్రద్ధగా సమాధానములు వ్రాయగలవు.
👉కర్తరి వాక్యం : కర్మణి వాక్యం: కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు కర్మణి వాక్యాలు. ఉదా: రాముడు రాక్షసులను సంహరించాడు - కర్తరి వాక్యం; రామునిచే రాక్షసులు సంహరింపబడిరి.
కర్మణి వాక్యం. కర్మణి ప్రయోగం అనేది తెలుగు భాషలో సహజంగా లేదు. ఇది ఇతర భాషల నుండి తెలుగు లోనికి వచ్చినది. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మణి వాక్యంలో కర్తకు తృతీయా విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది.
👉ప్రశ్నార్థక వాక్యాలు: సమాధానాన్ని ఆశించి అడిగేది ప్రశ్న. అలాంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఉదా: రాణి పాఠాలు చదువుచున్నదా ? ఏమిటి, ఎందుకు, ఎలాగ, ఎవరు, ఎక్కడ, ఏది మొదలైనవి ప్రశ్నలకు మూలాలైన ప్రశ్నార్థక పదాలు..
👉ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నదున్నట్లు చెప్పటం ప్రత్యక్ష కథనం. వేరేవాళ్లు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది పరోక్ష కథనం. ఉవు రెండూ అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి చివరికి "అని" అనేదాన్ని వాడతాం. దీనికి అనుకారకం అని పేరు.
👉ఇతరులు చెప్పిన దాన్ని, లేక తాను చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం ప్రత్యక్షానుకృతి. ఉదా: నేను నీతో "నేను రాను" అని చెప్పాను
👉అనుకరించిన దానిలోని విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం పరోక్షానుకృతి. ఉదా: నేను నీతో రానని చెప్పాను.