Type Here to Get Search Results !

Vinays Info

అసీమా చటర్జీ (రసాయనశాస్త్రవేత్త) జయంతి సందర్భంగా...

🌸🌸🌸〰〰〰〰〰〰〰〰
అసీమా చటర్జీ 🔬(రసాయనశాస్త్రవేత్త)
జయంతి సందర్భంగా...✍vinays info
〰〰〰〰〰〰〰〰🌸🌸🌸
👉 ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు.

👉ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు మరియు  మలేరియా  మరియు ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి.

👉ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధ మైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు.

జీవిత విశేషాలు:
〰〰〰〰〰
👉అసీమా చటర్జీ 23 సెప్టెంబర్ 1917 తేదీన బెంగాల్లోజన్మించారు. ఆమె తండ్రి పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ. కలకత్తా యూనివర్సిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొంది (1944), అమెరికా వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ విస్కన్‌సిస్ లో పరిశోధనలు (1947-48) నిర్వహించారు.

👉పుట్టిన దగ్గరినుండి జీవితాంతం  కలకత్తా  లోనే గడిపారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి 1936లో రసాయనశాస్త్రంలో పట్టా పొందారు. 1938 లో ఆమె "ఆర్గానిక్ కెమిస్ట్రీ"లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఈమె కలకతతా విశ్వవిద్యాలయంలో డాక్టరల్ వర్క్ పూర్తిచేశారు.

👉ఈమె సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రంలో వృక్ష ఉత్పత్తుల గూర్చి పరిశోధనలు చేశారు. ఈమె ప్రఫుల్ల చంద్ర రే మరియు ప్రొఫెసర్ ఎస్.ఎన్.బోస్ గారి అధ్వర్యంలో పరిశోధనలు చేశారు.

👉ఈమె 1940 లో కలకత్తా యూనివర్సిటీ యొక్క "లేడీ బ్రబోర్నె కాలేజి"లో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు.

👉1944 లో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు .

పరిశోధనలు:
〰〰〰〰
🐇ఈమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు.

👉కలకత్తా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా, ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పలు పదవులు నిర్వహించారు.

👉రాజ్యసభ సభ్యురాలుగా (1982 - 90) ఉన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు.

👉ప్రొఫెసర్ ఆసిమా గారు భారతీయ ఔషధ మొక్కల నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్‌పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు..

👉Saral Madhyamain Rasayana (3 సంపుటములు), Bharater Banushadi మొదలైన గ్రంథ రచనలు చేశారు. 240 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు.

👉"జర్న ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీ"కి సంపాదకులుగా ఉన్నారు. అమెరికా లోని సిగ్మా XI సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు.

పురస్కారాలు:
〰〰〰〰
👉కలకత్తా యూనివర్సిటీ వారి నాగార్జున ప్రైజ్ మరియు గోల్డ్ మెడల్ (1940)

👉ప్రేమ్‌చంద్ రాయల్ స్కాలర్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ.

👉యూనివర్సిటీ కలకత్తా నుండి సైన్స్ లో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ

👉1948 - 49 : వాటుముల్ ఫెలోషిప్(అమెరికా)

🐇1962-1982 మధ్య ఆమె ఖైరా ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాకు చెందిన అత్యంత గౌరవ పదవి.

👉1960: న్యూఢిల్లీ లోని ఇండియన్ నేషనల్ అకాడమీ యొక్క ఫెలోగా ఎంపిక .

👉1961 : శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (రసాయన శాస్త్రం), ఈ అవార్డును పొందిన మొదటి మహిళ.

👉1975 : పద్మభూషణ్ అవార్డు. ఈ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త.

👉1981 : భువన్ మోహన్ దాస్ గోల్డ్ మెడల్

👉1985 : సర్ సి.వి.రామన్ అవార్డు

👉1989 : సర్ అసుతోష్ ముఖర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్.

👉1954 : శిశిర్ కుమార్ మిశ్రా పురస్కారం.

👉1982 - 1990 : రాజ్యసభ సభ్యులు.

👉ఈమె 2006లో మరణించారు.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section