👉బోండా జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని విశాఖపట్టణం జిల్లాలోని అరకు ప్రాంతంలోని కొండలలో, దట్టమైన అడవుల్లోను పక్కనే ఉన్న ఒడిస్సా రాష్ట్రములోని మల్కానిగిరి జిల్లాలోని దట్టమైన అడవుల్లోనూ ఉంటారు. వీరిని బోండో, పోరోజు అని కూడా అంటారు. వీళ్ళు మాట్లాడే బాషా కూడా చాలా వింతగా ఉంటుంది. దీనిని రెమో అని అంటారు.
👉వీరు నాగరిక ప్రజలతో కలవడానికి ఇష్టపడరు, అందుకె ఎప్పుడోగాని అడవి దాటి బయటకు రారు.
👉వారం వారం జరిగే సంతలకు వీరు ఎక్కువగా బయటికి వస్తారు.ఈ సంతను హతా అని అంటారు.
👉వీరు నివశించే ప్రాంతలలోకి కొత్త వారిని రానివ్వరు వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారు.
👉వీరి ఆహారం ఎక్కువగా వేట మీద ఆధారపడి ఉంటుంది.
👉వీళ్ళు పోడు వ్యవసాయం చేస్తారు