👉వేర్వేరు కక్ష్యలలోకి ఉపగ్రహాల చేరవేత..
👉ఉదయం 9.12 గంటలకు ప్రయోగం
👉శ్రీహరికోట(సూళ్లూరుపేట), చెన్నై, సెప్టెంబరు 25: అంతరిక్ష ప్రయోగాలలో మరో కొత్త అధ్యయనానికి తెరలేపేందుకు ఇస్రో సిద్ధమైంది.
👉ఒకే రాకెట్‌తో వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను చేరవేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు (సోమవారం) ఉదయం 9:12 నిమిషాలకు రోదసీలోకి దూసుకుపోనున్న పీఎ్‌సఎల్‌వీ-సీ35 రాకెట్ ఎనిమిది ఉపగ్రహాల(675 కిలోల పేలోడ్)ను రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టనుంది.
👉నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన అంతరిక్ష కేంద్రం(షార్)లో ఈ ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాకెట్ ప్రయోగానికి శనివారం ప్రారంభించిన కౌంట్‌డౌన్ సజావుగా సాగుతోందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు.
రోదసిలో 2.15 గంటల ప్రయాణం..
ఇప్పటి వరకు ఇస్రో ఉపగ్రహ వాహకనౌకలు ఓ 25 నిమిషాల్లోపు నిర్ణీత కక్ష్యలోకి చేరి ఉపగ్రహాలను వదిలిపెట్టేవి. అయితే పీఎ్‌సఎల్‌వీ-సీ35 రాకెట్ మాత్రం ఏకంగా 2:15 గంటల పాటు ప్రయాణించి ఉపగ్రహాలను కక్ష్యలలోకి ప్రవేశపెడుతుంది.
పయనం ఇలా..
ప్రయాణం ప్రారంభించిన 16.55 నిమిషాలకు భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యలోకి చేరుకోనుంది. ఈ దశలో నాల్గవ దశ ఇంజనను ఆపేసి స్కాట్‌శాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. మిగిలిన 7 ఉపగ్రహాలతో రాకెట్ కొద్దికొద్దిగా కిందకు దిగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయోగానంతరం 1.22 గంటలకు ఒకసారి, 2.11 గంటలకు మరోసారి నాల్గవ దశ ఇంజన్‌ను ఆన్‌చేసి ఆఫ్ చేయనున్నారు. దీంతో ఆ సమయానికి రాకెట్ భూమికి 689 కిలోమీటర్ల ఎత్తులో ధ్రువకక్ష్య(పోలార్ ఆర్బిట్)కు చేరుతుంది. ఈ దశలో అడాప్టర్ ఇంజన్‌తో విడిపోయి ఉపగ్రహాలను రోదసీలోకి నెడుతుంది. అలా ప్రయోగానంతరం 2.13 నిమిషాలకు ఏడు ఉపగ్రహాలు ధ్రువ కక్ష్య (పోలార్ ఆర్బిట్)కు చేరుకుంటాయి.
ఆ ఉపగ్రహాలు ఇవే..
స్వదేశీ ఉపగ్రహాలు..
స్కాట్‌శాట్ (371 కిలోలు),
ప్రథం (బాంబే ఐఐటీ- 10 కిలోలు),
పీఐశాట్ (బెంగళూరు పీఈఎస్ వర్సిటీ- 5.25 కిలోలు)
విదేశీ ఉపగ్రహాలు..
అల్జీరియాకు చెందిన
ఏఎల్‌శాట్-1ఎన్ (7 కిలోలు), ఏఎల్‌శాట్-1బి (103 కిలోలు),
ఏఎల్‌శాట్-2బి (117 కిలోలు)
ఎన్‌ఎల్‌ఎస్-19 కెనడా(8కిలోలు),
పాతఫైండర్ (44 కిలోలు) అమెరికా
మొత్తం పేలోడ్: 675 కిలోలు
షార్‌కు చేరుకున్న ఇస్రో చైర్మన్
ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన ఏఎస్ కిరణ్‌కుమార్ ఆదివారం మధ్యాహ్నం షార్‌కు చేరుకున్నారు. ప్రథమ ప్రయోగ వేదిక వద్ద జరుగుతున్న కౌంట్‌డౌన కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ప్రయోగ సన్నాహాలను పరిశీలించారు. ప్రయోగ ఏర్పాట్లపై శాస్త్రవేత్తలతో చర్చించారు. అంతకుముందు చెన్నై విమానాశ్రయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్‌లోగా పీఎ్‌సఎల్‌వీ మార్గ్-3 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. తాజాగా ఉపగ్రహాల ద్వారా వాతావరణ మార్పులను నిశితంగా అధ్యయనం చేయవచ్చన్నారు. పీఎ్‌సఎల్‌వీ మార్గ్-2 ఉపగ్రహం సముద్రయానం, విమానయానం తదితర అంశాల్లో బాగా ఉపయోగపడుతోందని తెలిపారు.