Type Here to Get Search Results !

Vinays Info

కరెంట్ ఎఫైర్స్


1. ప్రతిష్టాత్మక గోబల్ టీచర్ ప్రైజ్ 2016 ను ఎవరు గెలుచుకున్నారు..? హసన్ ఆల్ హ్రోబ్
2. ఫిబ్రవరి 11, 2016న ఏ కోర్టు ఫార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శాసనసభ్యులపై అనర్హత వేటు వేయు అధికారం రాజ్యాంగం ప్రకారం సభాపతికి మాత్రమే ఉందని, గవర్నర్ తీసుకోలేరు అని వ్యాఖ్యానించింది..? సుప్రీంకోర్ట్
3. ప్రపంచంలో ట్విట్టర్ అకౌంట్ ను పొందిన తొలి చారిత్రక కట్టడం? తాజ్ మహల్
4. ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ గా నియమితులైన భారత్ కు చెందిన వ్యక్తి? సుందర్ రాజన్ పిచ్చై
5. ప్రపంచంలోనే భారీ రేడియో టెలిస్కోప్ నే ఏ దేశంలో ఏర్పాటు చేస్తున్నారు? చైనా
6. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ నివేదిక ప్రకారం నల్ల ధనం తరలింపు లో అగ్రస్థానం లో నిలిచిన దేశం? చైనా
7. ఐటీ ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలు చెల్లిస్తున్న జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం? స్విజ్జర్లాండ్
8. 2015 సెప్టెంబర్ 23న భారత్, అమెరికా ఏ అంశంపై అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఇంధనభద్రత, పర్యావరణమార్పులు, కాలుష్య రహిత ఇంధనం
9. నేపాల్ 38 వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి ఎప్పుడు ఎన్నికయ్యారు? 2015 అక్టోబర్ 11
10. జర్మనీ చెందిన ట్రాన్స్ పరెన్సీ ఇటర్నేషనల్ సంస్థ 2015 కు సంబంధించి విడుదల చేసిన ప్రపంచ దేశాల అవినీతి సూచిలో మొదటి స్థానంలో డెన్మార్క్ నిలవగా , భారత్ స్థానం? 76
11. WEF లింగసమానత్వ సూచీ – 2015 లో అగ్రస్థానంలో నిలిచిన దేశం? ఐస్ లాండ్
12. 2015 నవంబర్ 20న ఆసియా అభివృద్ధి బ్యాంకు కార్యనిర్వాహక సంచాలకురాలిగా నియమితులైనవారు? స్వాతి దండుకర్
13. దక్షిణ ఇజ్రాయిల్ లోని కిర్యాత్ గట్ అనే టౌన్ షిప్ లో మన దేశానికి చెందిన ఎవరి విగ్రహాన్ని జనవరి 4, 2016 న ఆవిష్కరించారు?. మహాత్మాగాంధీ
14. జనవరి 18, 2016 న ఆర్ధిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దేశం ఏది? ప్రాన్స్
15. 2015 డిసెంబర్ 2న డిస్ ప్లే వేరియంట్ డెబిట్ కార్డును విడుదల చేసిన బ్యాంకు ఏది? యాక్సిస్ బ్యాంక్
16. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సరిగా లేని దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ స్థానం ఎంత.? 12వ స్థానం
17. కేవలం రైతుల కోసమే ప్రధాన మంత్రి 26 మే 2015 కొత్త ఛానల్‌ను ప్రారంభించారు. దాని పేరు..? డిడి కిసాన్
18. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి హోషంగాబాద్‌లో కరెన్సీ నోట్లలో వాడే పేపర్ తయారీ రెండో కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే హోషంగాబాద్ ఎక్కడ ఉంది..? . మధ్యప్రదేశ్
19. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ రాష్ట్ర స్థాయి అవార్డుల్లో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైంది..? చందుర్తి, కరీంనగర్
20. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రజా రవాణా వాహనాల్లో తప్పనిసరిగా జిపిఎస్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది...? ఢిల్లీ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section