తెలంగాణ - అడవులు
-FOREST అనే ఆంగ్ల పదం ‘FORES’ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది.
-‘FORES’ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం.
-ప్రపంచ అటవీ దినోత్సవం - మార్చి 21
-1952 జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం మొత్తం దేశ భూభాగంలో 33.3 శాతం అడవులు కలిగి ఉండాలి. కానీ దేశ భూభాగంలో 20.5 శాతం మాత్రమే అడవులున్నాయి.
-2011ను UNO అటవీ సంవత్సరంగా ప్రకటించింది.
-రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం అడవులుగల జిల్లా ఖమ్మం, తర్వాత స్థానం ఆదిలాబాద్ జిల్లాది. అడవులు లేని జిల్లా హైదరాబాద్.
-నల్లగొండ జిల్లాలో 6.03 శాతంతో అతి తక్కువ అడవులున్నాయి.
-ప్రస్తుత ధరల ప్రకారం 2014-15లో రాష్ట్ర GSDPలో అటవీ సంపద, కలప రంగం 0.9 శాతం వాటాను కలిగి ఉండగా, వ్యవసాయ రంగం 5.02 శాతం వాటాను కలిగి ఉంది.
-రాష్ట్రంలో సామాజిక అడవులతో కలిపి అటవీ విస్తీర్ణం 29,242 చ.కి.మీ.
-అటవీ విస్తీర్ణంలో రాష్ట్రం 12వ ర్యాంకులో ఉంది.
అడవులు - రకాలు
1. ఆర్థ్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు
-ఈ అరణ్యాలు 125-200 సెం.మీ వర్షపాతంగల ప్రాంతాల్లో పెరుగుతాయి.
-ఈ అడవుల్లో పెరిగే ముఖ్యమైన చెట్లు వేగి, మద్ది, జిట్టగి మొదలైనవి. అనేక రకాల కలప కూడా లభ్యమవుతుంది.
-ఈ అడవులు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో విస్తరించి ఉన్నాయి.
2. అనార్థ్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు
-ఈ అడవులు 75-100 సెం.మీ వర్షపాతంగల ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి.
-ఈ అడవుల్లో ముఖ్యమైన చెట్లు వెలగ, వేప, దిరిశెన, బూరుగు, వెదురు మొదలైనవి. కలప కూడా లభ్యమవుతుంది.
-ఈ అడవులు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.
అడవులు
-వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.
-ఈ అడవులు నల్లగొండ, రంగాడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
-ఈ అడవుల్లో తుమ్మ, రేగు చెట్లు పెరుగుతాయి.
-ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్ 2013 ప్రకారం తెలంగాణలో అడవుల శాతం
అత్యధికం
జిల్లా చ.కి.మీ
ఖమ్మం 42.13 శాతం
ఆదిలాబాద్ 37.48 శాతం
వరంగల్ 23.66 శాతం
అత్యల్పం
నల్లగొండ 1.08 శాతం
మెదక్ 5.98 శాతం
రంగాడ్డి 5.02 శాతం
-రాష్ట్రంలో సామాజిక అటవీ విస్తీర్ణ శాతం - 30 శాతం
-రిజర్వ్‌డ్ అటవీ విస్తీర్ణం - 21,024 చ.కి.మీ.
-రక్షిత అటవీ విస్తీర్ణం - 7,468 చ.కి.మీ.
-అత్యధిక అటవీ విస్తీర్ణంగల జిల్లాలు - 4 (1. ఖమ్మం 2. ఆదిలాబాద్ 3. వరంగల్ 4. మహబూబ్‌నగర్)
-అత్యల్ప అటవీ విస్తీర్ణంగల జిల్లాలు - 4 (1.హైదరాబాద్ 2. రంగాడ్డి 3. నల్లగొండ 4. మెదక్)
-ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగంలో అటవీ వాటా - 5.02 శాతం.
సంరక్షణ కేంద్రాలు
జిల్లా - సంరక్షణ కేంద్రాలు
-ఆదిలాబాద్ - లంజమడుగు మొసళ్ల సంరక్షణ కేంద్రం, కవ్వాల్ వన్యవూపాణి సంరక్షణ కేంద్రం
-ఖమ్మం - కిన్నెరసాని మొసళ్ల సంరక్షణ కేంద్రం
-వరంగల్ - ఏటూరు నాగారం వన్యవూపాణి సంరక్షణ కేంద్రం
-హైదరాబాద్ - మహావీర్ హరిణ వనస్థలి
-నల్లగొండ - నాగార్జున సాగర్ మొసళ్ల సంరక్షణ కేంద్రం
-మహబూబ్‌నగర్ - పిల్లలమర్రి
-మెదక్ - మంజీరా మొసళ్ల సంరక్షణ కేంద్రం
-నిజామాబాద్ జిల్లాలో దొరికే రూసా గడ్డి నుంచి సుగంధ తైలాన్ని తీస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తెలంగాణ అడవుల్లో అడ్డాకులు, బంక, తేనె, చింతపండు, ఉసిరి, కుంకుడు లభ్యమవుతున్నాయి.
-రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ గుండా ఖమ్మం జిల్లా వరకు గోదావరి నది ఒడ్డు వెంట దట్టమైన అడవులున్నాయి.
-సవరించిన 2002 రాష్ట్ర విధానం ‘విజన్ 2020’ ప్రకారం అటవీ శాఖ ప్రస్తుతం ఉన్న అడవుల సంరక్షణ, అభివృద్ధి, ఉత్పాదకత, ఆర్థిక విలువ పెంపుదల కోసం పలు రకాల అభివృద్ధి కార్యక్షికమాలను అమలు చేస్తోంది.
-రాష్ట్రంలో 2,939కి పైగా మొక్క జాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు, 28 సరీసృపాలు, 21 ఉభయచర జాతులు వీటితోపాటు పెద్ద సంఖ్యలో అకశేరుకాలు ఉన్నాయి.
-అటవీ అభివృద్ధి ఏజెన్సీలు మూడంచెల వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి.
1. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి ఏజెన్సీ (స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ - SFDA)
2. డివిజన్ స్థాయిలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఫాస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ - FDA)
3. గ్రామ స్థాయిలో వన సంరక్షణ సమితి (VSS)
రాష్ట్రంలో అటవీ సంబంధిత సంస్థలు
సంస్థ ప్రదేశం
1. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి (రంగాడ్డి)
2. అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం దూలపల్ల్లి (రంగాడ్డి)
3. ఫారెస్ట్ రిసెర్చ్ డివిజన్హైదరాబాద్, వరంగల్
4. స్టేట్ ఫారెస్ట్ రిసెర్చ్
అండ్ డెవలప్‌మెంట్ సర్కిల్ హైదరాబాద్
5. ప్రాంతీయ అటవీ
పరిశోధనా కేంద్రం ములుగు (మెదక్)
నదులు - నీటిపారుదల ప్రాజెక్టులు
-మహాసమువూదాల గురించి అధ్యయనం చేయటాన్ని ‘ఓషియాలజి’ అంటారు.
-నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం - పోటమాలజి
-నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం - హైడ్రాలజి
-రాష్ట్ర భూ భాగం మొత్తం వాయవ్యాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలి ఉండటంతో.. రాష్ట్రంలో ప్రవహించే నదులన్నీ వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, భీమ, మంజీర, ప్రాణహిత తప్ప రాష్ట్రంలో ప్రవహించే మిగతా నదులన్నీ తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.