Type Here to Get Search Results !

Vinays Info

పొడుపు కథలు: 2

పొడుపు కథలు: 2

* దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల

* పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం

* పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి

* పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి

* ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి

* ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.

* పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ

* తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు

* పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.

* ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు

* ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం

* ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు

* ఇల్లుకాని ఇల్లు
జ. బొమ్మరిల్లు

* ఇంటికి అందం
జ. గడప

* ఇంటింటికీ ఒక నల్లోడు
జ. మసిగుడ్డు

* ఇంటికి అంత ముండ కావాలి
జ. భీగము

* ఇల్లంతాఎలుక బొక్కలు..
జ. జల్లెడ

* ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది
జ. చీపురుకట్ట

* ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు
జ. పొగ

* ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ
జ. అప్పడం

* ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం
జ. ముక్కు

* ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు
జ. కల్లు కుండలు

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section