Type Here to Get Search Results !

Vinays Info

Gk bits

గ్రూప్స్ ప్రత్యేకం
జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత అనే గీతానికి అనుకరణలో జనగణమన తెలగాణకు జయహే వీరుల విజయ పతాకా అన్న గీతం రాసింది ఎవరు? - నెకోరా
- 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో భాగంగా ఖమ్మంలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్షతో (1969 జనవరి 8) పాటుగా.. పాల్వంచలో జనవరి 10 నుంచి 23 వరకు KTPSలో ఉద్యోగాల కోసం పోటు కృష్ణమూర్తిని నిరాహారదీక్షలో కూర్చోబెట్టారు.
- ఖమ్మంలో రవీంద్రనాథ్ దీక్షను భగ్నం చేయాలనుకున్న నాటి హోంమంత్రి జలగం వెంగళరావుపై విద్యార్థి సం ఘం నాయకుడు గట్టు మోహన్‌రావు నాయకత్వంలో బాంబు విసిరారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి బాంబు కేసు ఇదే.
- 1969 మార్చి 28న జామియా మిలియా ఇస్లామియా రైల్వే స్టేషన్‌ను విద్యార్థులు తగులబెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఇద్దరు విద్యార్థులను మంటల్లోకి తోశారు. ఆ ఇద్దరూ ఉస్మానియా ఆస్పత్రిలో మృతిచెందా రు. తొలి అమరుడు ఖమ్మం జిల్లా గార్లకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రకాశ్ జైన్ కాగా, రెండో విద్యార్థి సర్వారెడ్డి.
- 1969 జనవరి 17న ఖమ్మంలో ఆంధ్రా ఉద్యోగులుండే ప్రాంతంలో బాంబులు విసరగా పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఖమ్మం జిల్లా బిడ్డలు K రాంచందర్, MD దస్తగిరి మరణించారు.
- తరతరాల స్వప్నాల సుందరఫలం, స్వైర భారత భూమి చూపడెనోలేదో, విషం గుప్పించి నొప్పించినాడు, మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని రాసినది - దాశరథి కృష్ణమాచార్య
- 1952లో ముల్కీ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ స్పందించిన తొలి వ్యక్తి జి.రామాచారి. ఆయన గుల్బర్గా జిల్లాకు చెందినవాడు.
- తెలంగాణ రైతు సంఘం ప్రథమ మహాసభ 1954 సెప్టెంబర్‌లో హన్మకొండలో జరిగింది. ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి అధ్యక్షులు. ఆరుట్ల రామచంద్రారెడ్డి కార్యదర్శి.
- తెలంగాణ కవి కాళోజీ 1980లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓటమి చెందారు.
- హైదరాబాద్ రాష్ట్రంలో 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్-1 వరకు అంటే 73 రోజులపాటు మిలిటరీ పరిపాలన సాగింది.
- 1951 జనాభా లెక్కల ప్రకారం నైజాం రాజ్యంలో తెలు గు మాట్లాడేవారు 90 లక్షలు, మారాఠీ మాట్లాడేవారు 45 లక్షలు, కన్నడం మాట్లాడేవారు 20 లక్షలు, ఉర్దూ మాట్లాడేవారు 12 లక్షలు ఉన్నారు.
ఇనాంలలో రకాలు
1. గడిమాన్యం - కోట రక్షణకు ఇచ్చేది
2. కుదిరి మాన్యం - గుర్రం రక్షణకు ఇచ్చేది (కన్నడంలో కుదిరి అంటే గుర్రం)
3. రండ మాన్యం - యుద్ధాల్లో సైనికులుగానీ, రాజ్యానికి చెందిన ఇతర పౌరులుగానీ చనిపోతే వారి భార్యలకు ఇచ్చే ఇనాం
4. వజీఫా ఇనాం - ప్రభుత్వ ఉద్యోగి బతికి ఉన్నంత కాలం అతని జీవనం కోసం ఇచ్చే భృతి
5. నాయి మాన్యం - వేట కుక్కలను తెచ్చి ఇచ్చినందుకు, వాటి పోషణకు ఇచ్చే ఇనాం
6. రక్త మాన్యం - దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారి వారసులకు ఇచ్చే మాన్యం
7. మాష్ నందారిన్ - రాజు క్షేమం కోసం దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో సేవచేసిన వారికి ఇచ్చే ఇనాం
8. రాజంత - పురంలో అనేక రకాల సేవలు చేసేవారికి ఇచ్చే ఇనాం
- వతందారి ఇనాం : ప్రభుత్వ కార్యనిర్వహణ కోసం జీతానికి బదులుగా ఇచ్చే మాన్యాన్ని వతందారీ ఇనాం అనేవారు.
- హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని (ఆర్ట్స్ కాలేజీ -1918) చందాబాయి మహల్లేఖ అనే జమీందారిణి జాగీరులో స్థాపించారు. ఆమె గొప్ప నర్తకి. సంగీతవేత్త తాన్‌సేన్ ముని మనవడు కుశాల్ ఖాన్ అనూప్ వద్ద శిష్యరికం చేశారు.
- అందెశ్రీ తెలంగాణ జాతీయ గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనంను ప్రప్రథమంగా 200 3, నవంబర్ 11న ఆదిలాబాద్‌లో తెలంగాణ రచయితల వేదికపై పాడారు.
- నా తెలంగాణ కోటి రతనాల వీణ కవితల సంకలనం తెలంగాణ సాంస్కృతిక మండలి, హైదరాబాద్ - డా. గంటా జలంధర్‌రెడ్డి సంపాదకులుగా విడుదలైంది.
- హైదరాబాద్‌లో మెహదీపట్నం అనే పేరు నవాబు మెహదీ నవాజ్ జంగ్ పేరుమీద వచ్చింది. ఆయన 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రధాని అయిన కిషన్ ప్రసాద్ మిత్రుడు. ప్రధాని కిషన్ ప్రసాద్ అక్బర్ ఆస్థాన విదూషకుడు రాజా తోడర్‌మల్ వారసుడు. దివాన్ చందూలాల్ తర్వాతవాడు. పర్షాద్ ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడు.
తెలంగాణలో ప్రముఖ వ్యక్తులు
-బొల్లిముంత శివరామకృష్ణ: ఈయన మృత్యుంజయులు పేరుతో నవల రాశారు. ఇది తెలంగాణ ప్రజల జీవితాల్ని, వారి పోరాట ప్రారంభ దశను చిత్రించిన మొదటి నవల.
- ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు వరంగల్‌లో అరస్టై నిజామాబాద్ జైలుకు తరలించినప్పుడు.. ఖిల్లా జైలు గోడపై నా తెలంగాణ కోటి రతనాల వీణ అని బొగ్గుతో రాశారు.
- 6వ నిజాం కాలంలో హైదరాబాద్‌లో పబ్లిక్ గార్డెన్ (బాగ్-ఏ-ఆం), నిజాం కాలేజీ - 1987, చంచల్‌గూడ జైలు, నాంపల్లి రైల్వే స్టేషన్, ఫలక్‌నుమా ప్యాలెస్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లను నిర్మించారు.
8 టంకశాల అశోక్: 1950, జూన్ 12న వరంగల్ జిల్లా మండికొండలో జన్మించారు. ఆంధ్ర జనత, ఆంధ్రప్రభ, నవ్యాంధ్ర, ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం, జనధర్మ, వార్త తదితర పత్రికల్లో పనిచేశారు.తాపీ ధర్మారావు అవార్డు అందుకున్నారు.
- జూలూరి గౌరీశంకర్:1963, జనవరి 4న నల్లగొండ జిల్లాలో జన్మించారు. సీనియర్ పాత్రికేయులు, కవి, రచయిత, లెక్చరర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు. సామాజిక ఉద్యమకారుడు. అనేక పత్రికల్లో పనిచేశారు. వీరి సంపాదకీయంలో పొక్కిలి కవితలు (2002) అచ్చాయ్యాయి.
- మామిడి భోజిరెడ్డి: తెలంగాణ గ్రంథాలయోద్యమంలో పనిచేశారు. 1919లో మహబూబ్‌నగర్ జిల్లా శంషాబాద్‌లో జన్మించారు.
- ప్రొ. జీ రాంరెడ్డి: దూరవిద్యను ప్రవేశపెట్టి లక్షలాది మందికి దిక్సూచి అయ్యారు. 1929, డిసెంబర్ 4న కరీంనగర్ జిల్లా మైలారంలో జన్మించారు. AP సార్వత్రిక విశ్వవిద్యాలయ స్థాపనకు కారకులయ్యారు. ఈ విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా ఆయనే పనిచేశారు. 1985లో స్థాపించిన ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి కూడా వీసీగా పనిచేశారు. 1995, ఫిబ్రవరి 2న మరణించారు.
- గవ్వా అమృతరెడ్డి (1900-1950): నల్లగొండ జిల్లా పిల్లలమర్రి గ్రామంలో జన్మించారు. ఈయన అమృత గీతములు రచించారు. ఈయనకు ఆనాటి సాహితీవేత్తలైన సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హన్మంతరావు, కోదాటి నారాయణరావులతో సాంగత్యం ఉంది. ఈయన సంస్కృతాంధ్రాంగ్ల ఉర్దూ భాషావేత్త.
- మసూమా బేగం:దేశంలో తొలి మహిళా మంత్రి. స్వాతంత్య్ర సమరయోధురాలు. 1902, అక్టోబర్ 7న హైదరాబాద్‌లో జన్మించారు. 1990లో మరణించారు. 1960లో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో పనిచేసి తొలి ముస్లిం మహిళా మంత్రిగా పేరు తెచ్చుకున్నారు?
- నేరెళ్ల వేణుమాధవ్: ప్రతి తెలంగాణ వ్యక్తి గర్వించదగ్గ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిమిక్రీ కళాకారుడు. ధ్వన్యనుకరణ సామ్రాట్. వరంగల్‌లో 1932లో జన్మించారు. నెహ్రూ, గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, పృథ్వీరాజ్ కపూ ర్, జాకీర్ హుస్సేన్ వంటివారిని అనుకరించగల రు. ఆంగ్ల సినిమాల్లోని మొదటి ప్రపంచయుద్ధ ఘట్టాలను, రైలు ప్రమాదం, విమాన చోధన, ప్రకృతి వైపరీత్యాలను కళ్లకు కట్టినట్లు అనుకరిస్తారు. ఈయన పుట్టినరోజైన డిసెంబర్ 28ని మిమిక్రీ డే గా జరుపుకుంటున్నారు.
-హైదరాబాద్ నిజాం కళాశాలలో 2013, సెప్టెంబర్ 29న సకల జనభేరి నిర్వహించారు.
- గులాంకీ జిందగీ సే మౌత్ అచ్చాహై (బానిస బతుకు కంటే చావు మేలు) అని KV అన్నారు.
- తెలంగాణ ప్రజ సింహం వంటిది. అది నిద్రిస్తూనే ఉంటుంది. లేచిందా పంజాతో కొడుతుంది అన్నది ఎవరు? - దాశరథి కృష్ణమాచార్య
- ఇబ్రహీం కుతుబ్‌షా 1592లో గోల్కొండ నుంచి
రాజధానిని ఎక్కడికి మార్చాడు? - హైదరాబాద్‌కు
- తెలంగాణలో మూసీ నదికి ఆ పేరు ఏ వ్యక్తి పేరుతో వచ్చింది? - ముచికుంద మహర్షి
- ఆది హిందూ భవన్‌ను ఎక్కడ స్థాపించారు?
- హైదరాబాద్
- BN. శ్రీ కృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పడింది?
- 2010, ఫిబ్రవరి 3న
- సలాం హైదరాబాద్ నవలా రచయిత ఎవరు?
- పరవస్తు లోకేశ్వర్
- జల్ - జంగల్ - జమీన్ నినాదం ఎవరిది?
- కొమురం భీమ్
- ఆదిలాబాద్ గోండ్‌లపై అధ్యయనం చేయడానికి నిజాం రాజు పిలిపించిన జర్మన్ మానవ శాస్త్రవేత్త ఎవరు?
- హైమన్ డార్ఫ్
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో మునగాల జమీందార్ ఎవరు? - నాయని వెంకట రంగారావు బహద్దూర్ (1875-1958)
- తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బేతవోలు జమీందార్ ఎవరు? - తడకమళ్ల రామచంద్రరావు
-తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో 1969లో తెలంగాణ పటాన్ని ఆవిష్కరించింది ఎవరు?
- T. పురుషోత్తమరావు
-గూండాయిజం వ్యతిరేక దినం ఎప్పుడు జరిగింది?
- 1969, జూన్ 3న
- కొలిమంటుకున్నది అనే విప్లవ నవలా రచయిత ఎవరు? - అల్లం రాజయ్య
హైదరాబాద్ విశేషాలు కొన్ని..
- సికింద్రాబాద్‌లోని సర్దార్ పటేల్ రోడ్డును ఒకప్పు డు ఇంగ్లిష్‌వారు అలెగ్జాండర్ రోడ్‌గా పిలిచేవారు. మూడో అసఫ్‌జా అయిన సికిందర్‌జా పేరుతో నిర్మించారు. సికిందర్ జా పాలనాకాలం 1803 - 1829.
-రవీంద్రభారతి 1961 మే 11న రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఇది 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
- 1860లో వాడి నుంచి హైదరాబాద్‌కు రైల్వే లైన్ నిర్మించారు. హైదరాబాద్‌లో ఇదే మొదటి రైల్వే లైన్.
- 1992లో హైదరాబాద్‌లో 65 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామాన్ని నెలకొల్పారు.
- 1925లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ప్రారంభమైంది.
నిజాం కాలంలో పాలనాపరమైన పదజాలం
జాగీర్లు
-చేతు జాగీరు - గ్రామంలోని 1/4వ వంతు ఆదాయం ప్రభుత్వానికి చేరే జాగీరు
- అల్తిమ్గా జాగీరు - వంశపారంపర్యంగా అధికారం అనుభవించే హక్కుగల జాగీరు
- ఇనాం - ప్రభుత్వ కార్యనిర్వహణకు జీతం బదులుగా ఇచ్చే మాన్యం - వతందారీ ఇనాం
- జాగీర్దారు మరణిస్తే వంశపారంపర్యంగా జాగీరు పొందిన వ్యక్తి ప్రభుత్వానికి కొంత నజరానా ఇచ్చి బహలు (రెన్యూవల్) పొందే వారసత్వపు హక్కును విరాసత్ అంటారు.
- జాతి జాగీరు - జాగీర్దారీ విధానంలో మరో పద్ధతి
- తన్ఖా జాగీరు - జాగీరులోని ఉద్యోగులకు జీతం సరిపోనప్పుడు ఇచ్చే భృతి
- ఇనాం అంటే దానపూర్వకంగా ఇచ్చేది
- జాగీర్ మష్రూతాత్ఖిద్మత్ - అవసరమైన, నిర్ణీతమైన పనిచేస్తూ ఉంటేనే జాగీరును అనుభవించాలి
- జాగీర్ మదదమాష్ - మత సంస్థలను సంరక్షించే వారికి ఇచ్చే జాగీర్
- మఖ్తాలు - సంస్థాన గ్రామాల్లోని భూమిలో కొంత భాగాన్ని పొందేవారు. వీరిని మఖ్తేదార్ అంటారు. మఖ్తాలు రెండు రకాలు. 1. పన్‌మఖ్తా - మఖ్తేదార్ కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2. మాఫీమఖ్తా - పన్ను చెల్లించాల్సిన అవసరం లేని మఖ్తా జాగీరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section