గంగా నది
గంగా నది బేసిన్ యొక్క పటము
జన్మస్థానము గంగోత్రి హిమానీనదము
సంగమ స్థానం బంగాళాఖాతము
పరివాహక ప్రాంతాలు భారతదేశము, బంగ్లాదేశ్
పొడవు 2,510 కి.మీ.
జన్మస్థల ఎత్తు 7,756 మీ
సగటు ప్రవాహము 14,270 m³/s
బేసిన్ వైశాల్యం 907,000 చ.కి.మీ.
గంగానది (హిందీ భాష: गंगा ; ఆంగ్లం: Ganges River) భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోను ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశం ఆర్ధిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.
గంగా నది మొత్తం పొడవు షుమారు 2,510 కి.మీ.(1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉన్నది