👍గణాంకాల్లో తెలంగాణ
రాష్ట్ర సంక్షిప్త సమాచారం👍👇
రాష్ట్రంలో వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యం ఉంటున్నది. తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పారిశ్రామిక, సేవా తదితర రంగాలపై లోతైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రచురితమైన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేల్లోని అంశాలపై ఉద్యోగార్థులకు సమగ్ర అవగాహ ఉండాలి. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం వివిధ అంశాలకు సంబంధించిన తెలంగాణ సంక్షిప్త సమాచారo
-తెలంగాణ విస్తీర్ణం - 1,12,077 చ.కి.మీ
-విస్తీర్ణపరంగా దేశంలో 12వ పెద్ద రాష్ట్రం.
-దేశంలో రాష్ట్ర విస్తీర్ణం - 3.40 శాతం
-పెద్ద జిల్లా - మహబూబ్‌నగర్
-చిన్న జిల్లా - హైదరాబాద్
-తెలంగాణ జనాభా - 3,50,03,674
-పురుషులు - 1,76,11,633
-మహిళలు - 1,73,92,041
-జనాభాపరంగా దేశంలో తెలంగాణది 12 స్థానం.
-దేశ జనాభాలో రాష్ట్ర జనాభా - 2.89 శాతం
-అత్యధిక జనాభాగల జిల్లా - రంగారెడ్డి (52,96,741)
-అత్యల్ప జనాభాగల జిల్లా - నిజామాబాద్ (25,51,335)
-2001-11 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల - 13.58 శాతం
-2001-11 మధ్య జాతీయస్థాయిలో జనాభా పెరుగుదల - 17.7 శాతం
-1991 - 2001 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల - 18.77 శాతం
గ్రామీణ జనాభా
-తెలంగాణలో గ్రామీణ జనాభా - 2,13,95,009
-గ్రామీణ జనాభా శాతం- 61.12 శాతం
-అత్యధిక గ్రామీణ జనాభాగల జిల్లా - మహబూబ్‌నగర్
-అత్యల్ప గ్రామీణ జనాభాగల జిల్లా - హైదరాబాద్
పట్టణ జనాభా
-రాష్ట్రంలో పట్టణ జనాభా - 1,36,08,665
-రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం - 38.88
-2001-11 మధ్య పట్టణ జనాభా పెరుగుదల - 38.12 శాతం
-1991-2001 మధ్య పట్టణ జనాభా పెరుగుదల - 25.13 శాతం
-అత్యధిక పట్టణ జనాభాగల జిల్లా - హైదరాబాద్
-అత్యల్ప పట్టణ జనాభాగల జిల్లా - నిజామాబాద్
రాష్ట్రంలో జిల్లాలు - 10
-మొత్తం పట్టణాలు - 158
-రెవెన్యూ డివిజన్లు - 42
-మున్సిపల్ కార్పొరేషన్లు - 6
-మున్సిపాలిటీలు - 37
-నగర పంచాయతీలు - 25
-జిల్లా పరిషత్‌లు - 9
-మండల ప్రజా పరిషత్‌లు - 438
-అత్యధిక మండలాలుగల జిల్లా - మహబూబ్‌నగర్ (64)
-అత్యల్ప మండలాలుగల జిల్లా - హైదరాబాద్ (16)
-గ్రామ పంచాయతీలు - 8,687
-అత్యధిక గ్రామ పంచాయతీలుగల జిల్లా - మహబూబ్‌నగర్ (1331)
-అత్యల్ప గ్రామ పంచాయతీలుగల జిల్లా - ఖమ్మం (671)
-రెవెన్యూ మండలాలు - 459
-రెవెన్యూ గ్రామాలు - 10,434
-ఎంపీటీసీలు - 6,456
-జడ్పీటీసీలు - 438
--ఎమ్మెల్యేలు - 119+1
-119 మంది ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. ఒకరిని గవర్నర్ నియమిస్తారు.
-అత్యధిక ఎమ్మెల్యే స్థానాలుగల జిల్లా - హైదరాబాద్ (15)
-అతి తక్కువ ఎమ్మెల్యే స్థానాలుగల జిల్లా - నిజామాబాద్ (9)
-ఎమ్మెల్సీలు - 40
-ఎంపీలు - 17
-అత్యధిక ఎంపీ స్థానాలుగల జిల్లా - హైదరాబాద్ (3)
అక్షరాస్యత
-మొత్తం అక్షరాస్యులు - 2,60,96,778 (66.54 శాతం)
-పురుషుల్లో అక్షరాస్యత - 75.04 శాతం
-స్త్రీలల్లో అక్షరాస్యత - 57.99 శాతం
-పట్టణాల్లో అక్షరాస్యత - 81.09 శాతం
-గ్రామాల్లో అక్షరాస్యత - 57.30 శాతం
-అత్యధిక అక్షరాస్యతగల జిల్లా - హైదరాబాద్ (83.25 శాతం)
-అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా - మహబూబ్‌నగర్ (55.04 శాతం)
-స్త్రీ, పురుష నిష్పత్తి - 1000:988
-అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి - నిజామాబాద్ (1040). ప్రతి 1000 మంది పురుషులకు 1040 మంది స్త్రీలు.
-అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి - హైదరాబాద్ (954). ప్రతి 1000 మంది పురుషులకు 954 మంది స్త్రీలు.
జనసాంద్రత
-రాష్ట్ర జనసాంద్రత 312. అంటే ప్రతి చదరపు కిలోమీటర్‌కు 312 మంది జనం ఉన్నారు.
-అత్యధిక జనసాంద్రతగల జిల్లా - హైదరాబాద్ (ఒక చదరపు కిలోమీటర్‌కు 18,172 మంది)
-అత్యల్ప జనసాంద్రతగల జిల్లా - ఆదిలాబాద్ (ఒక చదరపు కిలోమీటర్‌కు 170 మంది)
ఎస్సీలు
-రాష్ట్రంలో 54,08,800 మంది ఎస్సీ జనాభా ఉంది.
-ఎస్సీ పురుషులు - 26,93,127
-ఎస్సీ మహిళలు - 27,15,673
-రాష్ట్ర జనాభాలో ఎస్సీలు - 15.45 శాతం
-అత్యధికంగా ఎస్సీలుగల జిల్లా - కరీంనగర్-7,09,757 (18.80 శాతం)
-అత్యల్పంగా ఎస్సీలుగల జిల్లా - హైదరాబాద్-2,47,927 (6.29 శాతం)
-ఎస్సీల్లో అక్షరాస్యులు - 28,53,371 (58.9 శాతం)
-ఎస్సీల్లో లింగ నిష్పత్తి - 1000:1008
-ఎస్సీల్లో అత్యధిక అక్షరాస్యతగల జిల్లా - హైదరాబాద్ (77.72 శాతం)
-ఎస్సీల్లో అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా - మహబూబ్‌నగర్
ఎస్టీలు
-రాష్ట్రంలో ఎస్టీ జనాభా 31,77,940
-ఎస్టీ పురుషులు - 16,07,656
-ఎస్టీ మహిళలు - 15,70,284
-రాష్ట్ర జనాభాలో ఎస్టీల శాతం - 9.08
-ఎస్టీల్లో స్త్రీ, పురుష నిష్పత్తి - 1000:977
-అత్యధిక ఎస్టీ జనాభాగల జిల్లా - ఖమ్మం-6,56,577 (25.18 శాతం)
-అత్యల్ప ఎస్టీ జనాభాగల జిల్లా - హైదరాబాద్-48,937 (1.24 శాతం)
-ఎస్టీల్లో అక్షరాస్యులు - 14,12,617 (49.51 శాతం)
-ఎస్టీల్లో అత్యధిక అక్షరాస్యతగల జిల్లా - హైదరాబాద్ (69.34 శాతం)
-ఎస్టీల్లో అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా - మహబూబ్‌నగర్
(42.29 శాతం)
-పట్టణాల్లో ఎస్సీలు - 13,36,557 (24.71 శాతం)
-పట్టణాల్లో ఎస్టీలు - 3,47,901 (10.95 శాతం)
వికలాంగులు
-రాష్ట్రంలో మొత్తం వికలాంగులు - 10,46,822
-రాష్ట్ర జనాభాలో వికలాంగుల శాతం - 2.97
-పురుషులు - 5,65,413
-మహిళలు - 4,81,409
-అత్యధిక వికలాంగులుగల జిల్లా - హైదరాబాద్ (1,77,909)
-అత్యల్ప వికలాంగులుగల జిల్లా - నిజామాబాద్ (65,943)
సమగ్ర కుటుంబ సర్వే
-సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 17 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.
-సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తేదీ - 2014, ఆగస్టు 19
-సగటు కుటుంబం - 3.56 మంది
-అత్యధిక కుటుంబాలుగల జిల్లా - రంగారెడ్డి (16.56 లక్షలు)
-అత్యల్ప కుటుంబాలుగల జిల్లా - నిజామాబాద్ (6.97 లక్షలు)
-మొత్తం ఆవాసాలు - 1,00,78,599
-ఇల్లు లేని కుటుంబాలు - 83,969
-ఇల్లు లేని కుటుంబాలు ఎక్కువగాగల జిల్లా - రంగారెడ్డి (20,107)
-ఇల్లు లేని కుటుంబాలు తక్కువగాగల జిల్లా - ఖమ్మం (3,822)
-హిందూ, ముస్లిం మతాల్లో మహిళల కంటే పురుషులు అధికం.
-క్రిస్టియన్లలో మహిళలు అధికం.
-ముస్లింలు అత్యధికంగా హైదరాబాద్‌లో, అత్యల్పంగా ఖమ్మంలో ఉన్నారు.
-క్రైస్తవులు అత్యధికంగా హైదరాబాద్‌లో, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో ఉన్నారు.
-సిక్కులు అత్యధికంగా హైదరాబాద్‌లో, అత్యల్పంగా ఖమ్మంలో ఉన్నారు.
-బౌద్దులు అధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్.
శ్రామికులు
-ప్రధాన శ్రామికులు - 1,37,19,871 (39.19 శాతం)
-ఉపాంత శ్రామికులు - 26,22,063 (7.49 శాతం)
-రైతులు - 29,94,215 (21.82 శాతం)
-వ్యవసాయ కూలీలు - 45,89,751 (33.45 శాతం)
రహదారులు (2013-14)
-మొత్తం రోడ్లు - 90,800 కి.మీ.
-అత్యధిక రహదారులుగల జిల్లా - మహబూబ్‌నగర్ (13,924.18 కి.మీ.)
-అత్యల్ప రహదారులుగల జిల్లా - హైదరాబాద్ (216 కి.మీ.)
పంచాయతీరాజ్ రోడ్లు
-మొత్తం పంచాయతీరాజ్ రోడ్లు - 70,201 కి.మీ.
-అత్యధిక పంచాయతీరాజ్ రోడ్లుగల జిల్లా - మహబూబ్‌నగర్ (10,380.81)
-అత్యల్ప పంచాయతీరాజ్ రోడ్లుగల జిల్లా - రంగారెడ్డి (4363.69 కి.మీ.)
రోడ్లు భవనాల శాఖ రోడ్లు
-రోడ్లు భవనాల శాఖ మొత్తం రోడ్లు - 24,244.64 కి.మీ.
-రోడ్లు భవనాల శాఖ రోడ్లు అధికంగాగల జిల్లా - మహబూబ్‌నగర్ (110.46 కి.మీ.)
-అత్యల్ప పంచాయతీరాజ్ రోడ్లుగల జిల్లా - హైదరాబాద్ (174.68 కి.మీ)
జాతీయ రహదారులు
-రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు - 2,592 కి.మీ.
-అత్యధిక జాతీయ రహదారులుగల జిల్లా - మహబూబ్‌నగర్ (433.33 కి.మీ.)
-అత్యల్ప జాతీయ రహదారులుగల జిల్లా - హైదరాబాద్ (41.32 కి.మీ.)
అడవులు (2014-15)
-రాష్ట్రంలో మొత్తం అడవుల విస్తీర్ణం - 27,292 చ.కి.మీ.
-రిజర్వ్‌డ్ అడవులు - 19,696 చ.కి.మీ.
-రక్షిత అడవులు - 6,953 చ.కి.మీ.
-మిగతా అడవులు - 624.30 చ.కి.మీ.
-అడవులు అత్యధికంగాగల జిల్లా - ఆదిలాబాద్ (7,232 చ.కి.మీ.)
-అడవులు అత్యల్పంగాగల జిల్లా - రంగారెడ్డి, హైదరాబాద్ (731 చ.కి.మీ.)
విద్యుత్ వినియోగం
-మొత్తం విద్యుత్ కనెక్షన్లు - 2.61 కోట్లు
-వినియోగం - 72,518 మిలియన్ యూనిట్లు
తలసరి విద్యుత్ వినియోగం
-అత్యధికం - మెదక్ (గంటకు 1439 కిలోవాట్లు)
-అత్యల్పం - ఖమ్మం (గంటకు 554 కిలోవాట్లు)
పాఠశాలలు
-రాష్ట్రంలో మొత్తం పాఠశాలలు - 43,293
-మొత్తం ఉపాధ్యాయులు - 2,34,879
1-5 తరగతులు
-పాఠశాలలు - 25,331
-ఉపాధ్యాయులు - 84,084
-విద్యార్థులు - 32,46,785
6-10 తరగతులు
-పాఠశాలలు - 9,937
-ఉపాధ్యాయులు - 94,524
-విద్యార్థులు - 28,16,473
తెలంగాణలో భూ వినియోగం
-మొత్తం భూమి - 112.07 లక్షల హెక్టార్లు
-సాగు భూమి - 43.8 లక్షల హెక్టార్లు (39 శాతం)
-అటవీ ప్రాంతం - 25.4 లక్షల హెక్టార్లు (22.7 శాతం)
-ప్రస్తుత బీడు భూమి - 14 లక్షల హెక్టార్లు (12.5 శాతం)
-వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి - 8.8 లక్షల హెక్టార్లు (7.9 శాతం)
-ఇతర బీడు భూములు - 8.1 లక్షల హెక్టార్లు (7.2 శాతం)
-వ్యవసాయ యోగ్యంకాని భూమి - 6.1 లక్షల హెక్టార్లు (5.4 శాతం)
-పచ్చిక బయళ్లతో కూడిన భూమి - 3 లక్షల హెక్టార్లు (2.75 శాతం)
-వృథాగా ఉన్న సాగుభూమి - 1.8 లక్షల హెక్టార్లు (1.6 శాతం)
-చెట్లు చేమలతో ఉన్న భూమి - 1.1 లక్షల హెక్టార్లు (1 శాతం)
వృద్ధి రేటు
-2015-16 ముందస్తు అంచనాల ప్రకారం జాతీయ వృద్ధిరేటు 7.57, తెలంగాణ వృద్ధిరేటు 9.24.
-2014-15 మొదటిసారి సవరించిన అంచనాల ప్రకారం
-జాతీయ వృద్ధిరేటు 8.82
-తెలంగాణ వృద్ధిరేటు 9.24
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ప్రామాణిక ధరల్లో) (కోట్లలో)
-2014-15 (FRE-మొదటిసారి సవరించిన అంచనాలు) 5,22,001 (వృద్ధిరేటు 13.4 శాతం)
-2015-16 (AE-ముందస్తు అంచనాలు) 5,83,117 (వృద్ధిరేటు 11.7 శాతం)
వర్తమాన ధరల్లో (2011-12) కోట్లలో
-2014-15 (FRE) 4,29,001 (వృద్ధిరేటు 8.8 శాతం)
-భారతదేశంలో తెలంగాణ ఆర్థిక వాటా 4.1 శాతం (2015-16)
-జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో అనుబంధ రంగాల వాటా (స్థిరత్వ ధరల్లో)
ఆర్థిక సర్వే 2015-16
-వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం 13 శాతం
-గనులు, యంత్రాలు 4 శాతం
-తయారీ రంగం 15 శాతం
-విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా 2 శాతం
-నిర
్మాణ రంగం 6 శాతం
-వ్యాపారం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు 13 శాతం
-రవాణా, గిడ్డంగులు, కమ్యూనికేషన్లు 8 శాతం
-ఆర్థిక సేవలు 7 శాతం
-స్థిరాస్తి రంగం, ఆవాసాలు, నైపుణ్యత సేవలు 20 శాతం
-ప్రభుత్వ పరిపాలన 4 శాతం
-ఇతర సేవలు 8 శాతం
-జీవీఏలో వివిధ రంగాల వాటా (స్థిరత్వ ధరల్లో) 2015-16
-వ్యవసాయ రంగం, అనుబంధ రంగం 17 శాతం
-పారిశ్రామిక రంగం 22.5 శాతం
-సేవారంగం 60.5 శాతం
2013-14 ప్రకారం రంగాలవారీగా ఉద్యోగాలు
వ్యవసాయం, అనుబంధం 55.6 శాతం
పారిశ్రామిక రంగం 17.8 శాతం
సేవల రంగం 26.6 శాతం
సగటు నిరుద్యోగిత
-తెలంగాణలో 2.7 శాతం
-గ్రామాల్లో 1.1 శాతం
-పట్టణాల్లో 6.6 శాతం
మానవ వనరులు
-గ్రామీణప్రాంతంలో మానవ వనరులు 75.7 శాతం
-పట్టణ ప్రాంతంలో మానవ వనరులు 51.8 శాతం
-అత్యధిక మానవ వనరులు గల జిల్లా కరీంనగర్
వివిధ రంగాల్లో ఉద్యోగులు (2013-14)
రంగం గ్రామీణ పట్టణ మొత్తం
సేవారంగం 12.9 62.3 26.6
పారిశ్రామిక 12.9 30.8 17.8
వ్యవసాయ, అనుబంధం 74.2 6.9 55.6
సేవారంగం వాటాలు (ప్రస్తుత ధరల్లో)
-వ్యాపారం, మరమ్మతలు, హోటళ్లు, రెస్టారెంటులు 18.9 శాతం
-రవాణా, నిల్వ, సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు 13.9 శాతం
-ఆర్థిక సేవలు 9.6 శాతం
-రియల్ ఎస్టేట్, వృత్తి సేవలు 18.6 శాతం
-ప్రజా పాలన 19.9 శాతం
-ఇతర సేవలు 17.1 శాతం
-దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 3,65,304
-అత్యధికం మహబూబ్‌నగర్ (55,080)
-అత్యల్పం హైదరాబాద్ (20,304)
-దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు 7,22,151
-అత్యధికం రంగారెడ్డి (1,09,700)
-అత్యల్పం ఆదిలాబాద్ (50,604)
పరిశ్రమలు
-మొత్తం పరిశ్రమలు 10,279
-మొత్తం ఉద్యోగులు 7,07,738
-నెట్ వ్యాల్యూ యాడెడ్ (కోట్లలో) 28,728
-గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ (కోట్లలో) 10,559
-విషయం అత్యధికం అత్యల్పం
-పరిశ్రమలు రంగారెడ్డి నిజామాబాద్
-ఉద్యోగులు రంగారెడ్డి ఖమ్మం
-గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (కోట్లలో) రంగారెడ్డి ఖమ్మం
-గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (కోట్లలో) రంగారెడ్డి నిజామాబాద్
మానవాభివృద్ధి సూచిక
-వర్థమానకాలంలో స్థూల జాతీయోత్పత్తికి ప్రత్యామ్నాయంగా మానవాభివృద్ధి సూచికను ఆధారంగా చేసుకొని ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని అంచనావేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సగటు జీవితకాలం, శిశు మరణాలు, పేదరికం లాంటి జీవన ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకొని మానవాభివృద్ధి సూచీని రూపొందిస్తున్నాయి.
-ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (UNITED NATIONS DEVELOPMENT PROGRAMME- UNDP) తయారు చేసిన మొదటి మానవాభివృద్ధి రిపోర్ట్‌ను మహబూబ్-ఉల్-హక్ (పాకిస్థాన్) నాయకత్వంలో 1990లో రూపొందించారు. దేశంలో తొలిసారిగా HDIని రూపొందించిన రాష్ట్రం మధ్యప్రదేశ్.
-రాష్ట్ర తొలి మానవాభివృద్ధి సూచికను ఆర్థిక, సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్) రూపొందించింది.
-జిల్లాలు మానవాభివృద్ధి సూచికలో అభివృద్ధి (2004-11)
దవాఖానలు
-అలోపతి 206
-ప్రభుత్వ అలోపతి వైద్యులు 4,713
-అత్యధిక అలోపతి దవాఖానలు గల జిల్లా హైదరాబాద్ 36
-అత్యల్ప అలోపతి దవాఖానలు గల జిల్లా కరీంనగర్ 14
-మొత్తం పడకలు 20,450
సంప్రదాయ వైద్యం
-మొత్తం దవాఖానలు 11
-ఆయుర్వేదం 4
-యునానీ 3
-హోమియో 3
-ప్రకృతి వైద్యం 1
-దవాఖానల్లో మొత్తం పడకలు 717
ఆరేండ్లలోపు పిల్లలు
-రాష్ట్రంలో ఆరేండ్లలోపు పిల్లల సంఖ్య - 38,99,166
-బాలురు - 20,17,935
-బాలికలు - 18,81,231
-బాల, బాలికలు అత్యధికంగాగల జిల్లా - రంగారెడ్డి
-బాల, బాలికలు అత్యల్పంగా జిల్లా - ఖమ్మం
-బాల, బాలికల నిష్పత్తి - 1000:932
-బాల, బాలికల నిష్పత్తి అధికంగాగల జిల్లా - ఖమ్మం
-బాల, బాలికల నిష్పత్తి అత్యల్పంగాగల జిల్లా - హైదరాబాద్
-రాష్ట్ర జనాభాలో అరేండ్లలోపు పిల్లల శాతం - 11.14 శాతం
-దేశంలోని పిల్లల జనాభాలో రాష్ట్ర పిల్లల జనాభా శాతం - 2.37 శాతం 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇