అలీ నవాజ్ జంగ్
భవన నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభకు తార్కాణాలు
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలు.
-ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం (1933-34).
- ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్.
- ఫతేమైదాన్‌లో మహబూబియా గ్రాండ్ స్టాండ్.
- పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉస్మానియా జూబ్లీహాలు.
- అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం.
- మక్కా మసీదు దగ్గర సదర్ నిజామియా షఫాఖానా.
- మహబూబియా బాలికల పాఠశాల.
- నాందేడ్ సివిల్ హాస్పిటల్.
- సైన్యం కోసం రెండవ లాన్సర్స్ బిల్డింగ్స్, కేవలరీ ట్రెయినింగ్ స్కావవూడన్, చాంద్రాయణ గుట్ట, మల్లేపల్లి లైన్స్.
- నిజాంసాగర్, నిజాం చక్కెర కర్మాగారం.
సాగునీటి రంగంలో, నిర్మాణ రంగంలో ఆయన ప్రతిభావంతుడన్న దానికి తిరుగులేని నిదర్శనాలు పైన చూశాం. ఆయన ముందు చూపు కలిగిన ఓ ఆర్థికవేత్త, గొప్ప పరిపాలనాదక్షుడు కూడా. నిజామాబాద్ జిల్లా ముఖచిత్రాన్ని మార్చివేసిన రెండు ప్రధాన నిర్మాణాలకు అలీ నవాజ్‌జంగ్ దార్శనికతే కారణం. అవి మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు, బోధన్‌లో నిర్మించిన నిజాం చక్కెర కర్మాగారం. 2,75,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించడానికి మంజీరాపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు 1933 నాటికే పూర్తయ్యింది. మొత్తం హైదరాబాద్ రాజ్యంలోనే నిజామాబాద్ జిల్లా ఈ ప్రాజెక్టు కారణంగా సంపద్వంతమైన జిల్లాగా మారింది. మొత్తం దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా రూపొందించిన నిజాం చక్కెర కర్మాగారం ఆనాటికే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్యాక్టరీ. దీనికి అవసరమయ్యే చెరుకును పండించడానికి నిజాం కాలువల కింద వందల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. చంద్రబాబు నాయుడు అమలు పరిచిన ప్రైవేటీకరణ విధానాలతో నిజాం చక్కెర కర్మాగారం
నవబ్ అలీ నవాజ్ జంగ్ రూపకల్పన చేసిన/నిర్మించిన ప్రాజెక్టులు
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (హైదరాబాద్)
- పోచారం ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా)
- వైరా ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు (ఖమ్మం జిల్లా)
- ఢిండీ ప్రాజెక్టు, రాయనిపల్లి, సింగభూపాలం, తుంగభధ్ర కొయిల్ సాగర్ (మహబూబ్‌నగర్ జిల్లా)
- కడెం ప్రాజెక్టు (ఆదిలాబాద్ జిల్లా)
- మూసీ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- చంద్రసాగర్ ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- రాజోలిబండ ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
-పోచంపాడు ప్రాజెక్టు (నిజామాబాద్ జిల్లా)
- నందికొండ ప్రాజెక్టు (నల్లగొండ జిలా)
- పెండ్లిపాకు ప్రాజెక్టు (నల్లగొండ జిల్లా)
- సరళాసాగర్ ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
- పూర్ణా ప్రాజెక్టు (మహారాష్ట్ర)
- భీమా ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)
-దేవనూరు ప్రాజెక్టు (మెదక్ జిల్లా)
- పెన్‌గంగ ప్రాజెక్టు (మహారాష్ట్ర)
- ఇచ్చంపల్లి ప్రాజెక్టు (కరీంనగర్ జిల్లా)
-లోయర్ మానేరు ప్రాజెక్టు (కరీంనగర్ జిల్లా)
అలీ నవాజ్ జంగ్
May 14, 2016
Tags