కాకతీయ రాజులు - బిరుదులు
-మొదటి బేతరాజు: కాకతిపురాధినాథ, హరిగజకేసరి, చోడకా్ష్మపాల, గరుడ బేతరాజు
-మొదటి ప్రోలరాజు: కాకతీ వల్లభ, సమధిగత పంచ మహాశబ్ద
-రెండో బేతరాజు: త్రిభువనమల్ల, మహామండలేశ్వర, విక్రమచక్ర, చలమర్తిగండ, రమమహేశ్వర
-దుర్గరాజు: త్రిభువనమల్ల, చలమర్తిగండ
-రెండో ప్రోలరాజు: మహామండల్వేశర, లంకేశ్వర, నిశ్మంక ప్రధాన ప్రబంధన, ప్రోల నిర్దహాన
-రుద్రమదేవి: రాయగజకేసరి, రుద్రమహారాజు, పట్లో ధృతి.
కాకతీయుల సంప్రదాయ పన్నులు
-దరిశనము- రాజును దర్శించినప్పుడు ఇచ్చే కానుకలు
-ఉపకృతి- రాజుకాని ఇతర అధికారులు మేలు చేసినప్పుడు ప్రతిఫలంగా చెల్లించే పన్ను
-అప్పనము- అకారణంగా ఇచ్చేది
సాగు చేసిన భూమి రకాలు
-వేలి పొలం- వర్షం ఆధారంగా పండేది. ఈ భూమిపై వేసే పన్నును పుట్టి హండి అనేవారు.
-తోట భూమి- వర్షం ఆధారంగా ఫల వృక్షాలు. తోటలపై పంగం, నీరు విధి అనే పన్నులు వసూలు చేసేవారు.