🎆VINAYS INFO🎆
రాస్ బిహారి బోసు :
〰〰〰〰〰〰🌻
(25మే1886–21జనవరి1945)
🌀భారత దేశంలోని స్వాతంత్ర్యోద్యమకారుడు. ఈయన భారత దేశంలోని "గదర్ ఉద్యమం" లో ఒక నాయకుడు. ఆతర్వాత భారత నేషనల్ ఆర్మీలో కూడా సభ్యునిగా ఉన్నారు.
🌀స్వాతంత్రోద్యమంలో అత్యంత ధైర్య సాహసాలతో పాల్గొన్న దేశభక్తుల్లో రాస్ బిహారీ బోస్ కూడా ఒకరు. జీవిత కాలంలో ఎంతోధైర్యసాహసాలతో ఆయన ఎన్నో ప్రమాదాలనుండి తప్పించుకుని ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టాడు.
🌀బోస్ బెంగాల్ రాజ్యంలోని సుబల్‌దహ గ్రామం, బర్దవాన్ జిల్లాలో జన్మించారు. ఆయన చాంద్ నగర్ లో విద్యాభాసం చెశారు. అచట ఆయన తండ్రి వినోదెబెహారి బోస్ నివాసముండేవారు. ఆ తర్వాత ఆయన ఫ్రాన్స్ మరియు జర్మనీ లలో మెడికల్ మరియు ఇంజనీరింగ్ లలో డిగ్రీలు పూర్తిచేశారు. ఆయన విద్యాభ్యాసం ఫ్రెంచ్ వలస ప్రాంతంలో, ఆంగ్లేయుల పాలనలోనూ జరగ డంతో రెండు సంస్కృతులు పరిచయమా య్యా యి. చిన్ననాడే ఆయన చదివిన విప్లవ సాహిత్యం ఆయన మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది.
విప్లవ కార్యక్రమాలు
〰〰〰〰〰〰
🌀ఆయన విప్లవ కార్యక్రమాల పట్ల బాల్యం నుండే శ్రద్ధ కనబరచినప్పటికీ ఆయన బెంగాల్ నుండి "ఆలిపోర్ బాంబ్ కేసు (1908)" ను త్యజించడానికి బెంగాల్ విడిచిపెట్టాడు. ఆయన డెహ్రాడూన్ లో ఫారెస్టు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో హెడ్ క్లర్క్ గా పనిచేశాడు.
🌀అచట ఆనాటి ప్రముఖ విప్లవనేత జతిన్ బెనర్జి నాయక త్వంలో రాస్ బిహారి బోస్ పనిచేయసాగాడు.
🌀గదర్‌పార్టీతో సంబంధాలు పెట్టుకుని వైశ్రాయ్ లార్ట్ హార్టింగ్‌పై దాడికి ప్రణాళికలు రచించాడు.
🌀23 డిసెంబర్ 1912నాడు ఢిల్లిలో ఊరేగింపుగా వస్తున్న ఆ వైశ్రాయ్‌పై విప్లవకారులు చాందిని చౌక్‌వద్ద పథకం ప్రకారం బాంబు దాడి చేశారు. దానిలో వైశ్రాయ్ ప్రాణాలతో తప్పించుకోగా కొందరు మరణించడం, గాయపడడం జరిగింది.
🌀ఆ దాడి భవిష్యత్తులో భారతదేశంలో కొనసాగే విప్లవోద్య మాలకు గొప్ప ప్రేరణగా చరిత్రలో నిలిచి పోయింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోయి విప్లవ కారుల వేట సాగించింది. మాస్టర్ అమీర్ చంద్ అవద్‌బిహారి, బాలముకుంద్‌ను పట్టుకుని ఉరితీసింది. మహిళా వేషంలో వచ్చి బాంబు విసిరిన వసంత్ విశ్వాస్‌ను పట్టుకుని అంబాలా జైల్లో ఉరి తీసారు. రాస్‌బిహారి పట్టుబడకుండా తప్పించుకు న్నాడు.
🌀బెనారస్‌ను ఒక కేంద్రంగా పెట్టుకుని విప్లవ కార్యకలాపాలను కొనసాగించాడు. లార్ట్ హార్టింగ్‌తాను వ్రాసిన "మై ఇండియన్ యియర్స్" అనే గ్రంధంలొ ఈ ఉదంతం మొత్తాన్ని వివరించాడు.
🌀21ఫిబ్రవరి 1915నాడు భారతీయ సిపాయిలు ఆంగ్ల సైనికులపై దాడిచేయాలని, ట్రెజరిని దోపిడి చేసి, ఖైదీలను విడిపించడం లక్ష్యంగా సిద్ధమయ్యారు. అయితే, కిర్‌పాల్‌సింగ్ అనే గూఢచారి ఈ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. విప్లవకారులపై దాడులు, అరెస్టులు ప్రారంభ మ య్యాయి. రాస్‌బిహారి బోస్ పట్టుబడకుండా మారువేషంలో తప్పించుకున్నాడు.
🌀భారతదేశంలో విప్లవకారులపై నానాటికీ నిర్బంధం పెరిగిపోతుందడడంతో తాను జపాన్‌కు వెళ్ళిపోవాలని రాస్ బిహారి బోస్ నిర్ణయించుకున్నాడు. 12 మే1915నాడు రాజా పిఎన్‌టి ఠాగూర్ అనే మారుపేరుతో జపాన్‌కు ప్రయాణమయ్యాడు. మారువేషాలు వేయడంలో ఆయన దిట్ట అవడంతో ఎవరూ గుర్తించలేక పోయారు.22మే 1915 కల్లా సింగపూర్‌కు చేరు కుని అక్కనుండి జపాన్ చేరాడు. విదేశీగడ్డమీద ప్రవాసజీవితంలో కూడా బ్రిటిష్ పోలీసులు ఆయనను వెంటాడడం మానలేదు.
ఇండియన్ నేషనల్ అర్మీ
〰〰〰〰〰〰〰〰
🌀జపాన్ లో వివిధ విప్లవ వర్గాల వద్ద ఆశ్రయం పొందాడు. 1915-1918 మధ్య కాలంలో ఆయన ఆయన నివాసం మరియు గుర్తింపులను అనేక సార్లు మార్చుకున్నాడు. ఆ కాలంలో జపాన్ ప్రభుత్వంతో కలసి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన కోసం వేట ప్రారంభించినందున 17 సార్లు ఆయన ఇల్లు మార్చాల్సి వచ్చింది.
🌀ఆయన "సోమా ఐజో" మరియు "సోమా కోట్సుకో" ల కుమార్తె ను వివాహమాడాడు. ఆయన 1923 లో జపాన్ పౌరసత్వాన్ని పొందాడు.
🌀తరువాత ప్రవాసజీవితాన్ని విడిచిపెట్టి జపాన్ భాషను నేర్చుకుని జర్నలిస్టుగా, రచయితగా భారతదేశ వాస్తవాలను ప్రచారం చేయడంలో కృషి చేసాడు. ఎన్నో పుస్తకాలను రచించాడు.
🌀ఆయన జపాన్ లో భారతీయ తరహా కూరను ప్రవేశ పెట్టాడు. ఆ కూర జపాన్ లోని సాధారణ కూర కంటే ఎంతో ఖరీదైనది. ఆ కూర జపాన్లో ప్రసిద్ధి పొంది రాస్ బిహారీ పేరు "బోస్ ఆఫ్ నకమురయ" ప్రసిద్ధి పొందింది. ఈ కూర ప్రస్తుతం జపాన్ రెస్టారెంట్లలో అతి ప్రసిద్ధి పొందిన వంటకం.
తరువాత రాష్ బిహారీ బోస్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థాపించాడు
〰〰🙏🏻🙏🏻🙏🏻〰〰