(ఫిబ్రవరి19,1473మే24,1543)
🌀మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. శాస్త్రీయంగా సూర్యకేంద్ర సిధ్ధాంతాన్నినిరూపిస్తూ సిద్ధాంతీకరించాడు.
ప్రతిపాదనలు
-------------
🌀రోమ్ విశ్వవిద్యాలయంలో 29 ఏళ్ళ వయస్సులో 1502 లో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరాడు. విశ్వానికి కేంద్రం భూమి,సూర్యుడు, ఈ రెంటిలో ఏది? అనే అనుమానం పట్టుకుంది.
🌀 అరిస్టాటిల్, టోలెమీ కు భూ కేంద్రక సిద్ధాంతం బలపరిచారు.
🌀 పైథాగరస్ సూర్య కేంద్రక సిద్ధాంతమే సరి అయిందని నమ్మాడు.
🌀 ఏది నమ్మాలో,ఏది నమ్మకూడదో కోపర్నికస్ కు అర్థం కాలేదు. ఈ విషయం పై ఆలోచిస్తూ రాజీనామా చేసి ప్రోవెన్ బర్గ్ లో కానన్ అనే మతాధికారిగా చేరాడు.
🌀 పైద్యునిగా ఎంతో పతిష్ట నార్జించాడు. న్యాయమూర్తిగా రాణించాడు.క్లిష్ట సమయాలలో సలహాలనిచ్చి పోలెండ్ ఆర్థిక దుస్థితిని తొలగించాడు.పోప్ అభ్యర్థన మేరకు పంచాంగాన్ని సరి చేసి ఖగోళ శాస్త్రజ్ఞునిగా తిరుగులేదనిపించుకున్నాడు.తరువాత గణిత శాస్త్రజ్ఞులు లెక్కలు వేసి కోపర్నికస్ కట్టిన లెక్కలు ఖచ్చితమైనవని సంవత్సర కాలంలో 28 సెకన్లు మాత్రమె తేడా వస్తుందని చెప్పారు.క్రీ.శ 1520 లో అల్లెన్ స్టెయిన్ కాసిల్ కు గవర్నర్ గా కూడా పనిచేసి ట్యూటానిక్ వీరులను ఎదుర్కొన్నాడు.ఈ విధం గా ప్రజా సేవ, మత సేవ చేస్తున్నప్పటికీ శాస్త్ర సేవ మాత్రం మానలేదు.
సూర్య కేంద్రక సిద్ధాంతము
〰〰〰〰〰〰〰〰
🌀 సూర్యకేంద్ర సిద్ధాంతాల నమూనాలను, సిద్ధాంతాలను, ఇతని కంటే ఎన్నో వందల ఏండ్లకు మునుపే ఆర్యభట్టు, ఒమర్ ఖయ్యాం లు, ప్రతిపాదించారు, కాని, గ్రహాల కదలికలు ఆధారముగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించింది
🌀 ఇతనే.భూమి తన అక్షము పైనే తిరుగుతుందని అందువాల్లే రాత్రి పగలూ యేర్పడుతున్నాయని తెలిపాడు.
🌀 భూబ్రమణ,పరిభ్రమణాల వల్లే శీతోష్ణ స్థితులు, ఋతువులు మారుతున్నాయని గ్రహించాడు. ఈ విషయాలన్నీ వాస్తవాలే అయినా వాటిని బయట పెట్టడానికి కోపర్నికస్ కు ధైర్యం చాలలేదు.
🌀 ఎందువలననగా అప్పట్లో ఎవరూ ఇతన్ని నమ్మలేదు. మత గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలలో సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని వ్రాసి ఉంది.
🌀 "ఖగోళ శాస్త్రాన్నే తలక్రిందులుగా చేస్తున్న మూర్ఖుడు కోపర్నికస్" అని మార్టిన్ లూథర్ దూషించాడు కూడా.
🌀 అయినప్పటికీ కోపర్నికస్ అంతిమ దశలో తాను సేకరించిన,తెలుసుకున్న వివరాలన్నింటిని గ్రంధంగా అచ్చు వేయించి పోప్ గా ఉన్న మూడవ పాల్ కు అంకితం చేశాడు. ఇది జర్మనీ లో ఉన్న న్యూవెంబర్గ్ లో ప్రచురితమయినది. ఈ పుస్తకంలోని అంశాలు సంఘ విద్రోహాన్ని సూచిస్తాయేమోనన్న భయంతో ప్రచురన కర్తలు "దీనిని విజ్ఞాన గ్రంధంగా పరిగణించగూడదు" అని ముందుగానే చెప్పుకున్నాయి. కాని ఈ విషయం తెలియకుండానే 21 మే 1543 లో కోపర్నికస్ కన్ను మూశాడు.
నికోలాస్ కోపర్నికస్
May 24, 2016
Tags