1. ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1) నాసిక్
2) మహు
3) ఢిల్లీ
4) గయా
View Answer
సమాధానం: 2
వివరణ: అంబేద్కర్ 125వ జయంతిని పురష్కరించుకొని గ్రామ స్వపరిపాలన కార్యక్రమం పథకాన్ని అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మహు గ్రామంలో ప్రారంభించారు.
2. ‘విషు’ పేరిట పంటల కాలం ప్రారంభపు ఉత్సతాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1) కేరళ
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) కర్నాటక
View Answer
సమాధానం: 1
వివరణ: విషు ఉత్సవం ఏప్రిల్ నెలలో వస్తుంది. తెలుగు వారు ఉగాది జరుపుకున్నట్లు కేరళీయులు కూడా ‘విషు’ను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
3. అమెరికా జాతీయ సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఏర్పాటుచేసిన కమీషన్‌లో సభ్యుడిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు?
1) బాబీ జిందాల్
2) లిసా స్తాలేకర్
3) అజయ్ బంగా
4) రూపేశ్ మెహ్రా
View Answer
సమాధానం: 3
వివరణ: మాస్టర్ కార్డ్ సీఈవో, భారత సంతతికి చెందిన అమెరికన్ అజయ్ బంగాను జాతీయ సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఏర్పాటుచేసిన కమీషన్‌లో సభ్యుడిగా నియమితులయ్యారు. 9 మంది సభ్యులతో కూడిన ఈ కమీషన్‌కు అజయ్ బంగాను దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంపిక చేశారు.
4. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (AIBA) నిర్వహించనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ప్రచార కర్తగా ఎవరు వ్యవహరించనున్నారు?
1) సచిన్ టెండూల్కర్
2) విజేందర్ సింగ్
3) అఖిల్ కుమార్
4) మేరీ కోమ్
View Answer
సమాధానం: 4
వివరణ: మేరీ కోమ్‌తో పాటు మరో ఏడుగురు క్రీడాకారుల్ని ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ప్రచారకర్తలుగా ఏఐబీఏ ఎంపిక చేసింది. ఈ టోర్నీ మే 19 నుంచి కజక్‌స్తాన్‌లో జరుగుతుంది.
5. శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న ఏ వ్యోమనౌక తారాంతర ధూళిని కనుగొంది?
1) కాసినీ
2) మెసెంజర్
3) న్యూహారిజన్స్
4) టుస్సాడ్
View Answer
సమాధానం: 1
వివరణ: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన కాసినీ వ్యోమనౌక 2004 నుంచి శని గ్రహాన్ని, దాని వలయాలను, చంద్రున్ని పరిశోధిస్తోంది.
6. దేశంలోని వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేయడానికి ప్రారంభించిన ‘ఈ-నామ్’ వెబ్ పోర్టల్‌ను రూపొందించిన సంస్థ ఏది?
1) భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య
2) నాగార్జున ఫెర్జిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్
3) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
4) సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ
View Answer
సమాధానం: 2
వివరణ: వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేసి అన్‌లైన్ ట్రేడింగ్‌కు వీలు కల్పించే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) పోర్టల్‌ను నాగార్జునా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు చెందిన ఇ-కిసాన్ విభాగం రూపొందించింది.
7. జీ20 ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది?
1) బ్రసెల్స్
2) న్యూయార్క్
3) వాషింగ్టన్
4) లండన్
View Answer
సమాధానం: 3
8. మహారాష్ట్రలోని ఏ శివాలయం గర్భగుడిలోకి స్త్రీలను అనుమతించారు?
1) శని సింగనాపూర్
2) భీమశంకరాలయం
3) త్రయంబకేశ్వరాలయం
4) గ్రిశ్నేశ్వరాలయం
View Answer
సమాధానం: 3
9. అమెరికాకు చెందిన ఇన్నోవేటివ్ అర్బన్ సొల్యూషన్స్ సంస్థ సర్వే ప్రకారం ‘ప్యూచర్ రెడీ సిటీస్’లో ఢిల్లీ స్థానం ఎంత?
1) 41
2) 42
3) 43
4) 44
View Answer
సమాధానం: 4
వివరణ: ప్యూచర్ రెడీ సిటీస్ సర్వేలో శాన్ జోస్ నగరానికి మొదటి స్థానం, శాన్ ఫ్రాన్సిస్కోకు రెండో స్థానం లభించాయి.
10. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు?
1) వికాస్ సింగ్
2) బిందేశ్వర్ పాఠక్
3) రిషీలాల్ గుప్తా
4) ఓంప్రకాశ్ బిస్వాస్
View Answer
సమాధానం: 2
వివరణ: ప్రముఖ సంఘ సేవకుడు బిందేశ్వర్ పాఠక్ స్మృత్యర్థం ఏప్రిల్ 14 బిందేశ్వర్ డేగా న్యూయార్క్ నగర మేయర్ బిల్‌డెల్ బాషియో ప్రకటించారు.
11. భారతదేశంలో హెల్త్‌కార్డ్‌లను జారీ చేయడానికి అపోలో హాస్పిటల్స్ ఎవరితో ఒప్పందం చేసుకుంది?
1) గూగుల్
2) విప్రో
3) ఇన్సోసిస్
4) మైక్రోసాఫ్ట్
View Answer
సమాధానం: 1
వివరణ: చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న అపోలో హాస్పిటల్స్ హెల్త్‌కార్డ్‌లను జారీ చేయడానికి, ఆరోగ్య సమాచారాన్ని అందించటానికి గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది.
12. మొజాంబిక్‌లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) జైశంకర్
2) శివ నారాయణ
3) ఇ.ఎస్.అహ్మదీ
4) రుద్ర గౌరవ్ శ్రేష్ఠ
View Answer
సమాధానం: 4
13. గుజరాత్ రాష్ట్ర మొదటి మహిళా డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు?
1) కాంచన్ చౌదరీ
2) గీతా జోహ్రి
3) ప్రీతి సుదాన్
4) ప్రీతమ్ సింగ్
View Answer
సమాధానం: 2
14. కొత్తగా తయారైన సూపర్ కంప్యూటర్ ‘పరమ్ కాంచన్‌జంగా’ను ఎక్కడ ప్రారంభించారు?
1) సిక్కిం
2) అరుణాచల్ ప్రదేశ్
3) హిమాచల్ ప్రదేశ్
4) మేఘాలయ
View Answer
సమాధానం: 1
వివరణ: సిక్కిం రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరమ్ కాంచన్‌జంగాను ప్రారంభించారు.
15. ‘షహీన్’ అనేది ఏ దేశాల ఉమ్మడి యుద్ధ విన్యాసం?
1) భారత్ - చైనా
2) చైనా - బంగ్లాదేశ్
3) భారత్ - బంగ్లాదేశ్
4) పాకిస్థాన్ - చైనా
View Answer
సమాధానం: 4
వివరణ: ఐదో యుద్ధ విన్యాసం ‘షహీన్ - 5’ను పాకిస్థాన్‌లో నిర్వహించారు.
16. బ్రిక్స్ నూతన అభివృద్ధి బ్యాంకు నుంచి భారతదేశంలో ఏ బ్యాంక్‌కు 250 మిలియన్ డాలర్ల రుణం లభించింది?
1) భారతీయ స్టేట్ బ్యాంక్
2) నాబార్డ్
3) ఐసీఐసీఐ
4) కెనరా బ్యాంక్
View Answer
సమాధానం: 4
వివరణ: పునరుత్పాదకత ఇంధన వనరుల రంగంలో వివిధ దేశాల్లో నాలుగు ప్రాజెక్టులకు అనుమతి లభించింది. ఇందులో భాగంగా భారతదేశంలోని కెనరా బ్యాంక్‌కు 250 మిలియన్ డాలర్ల రుణం లభించింది.
17. ప్రపంచంలోనే మొదటిసారిగా కరువు కారణంగా అత్యవసర పరిస్థితిని విధించిన దేశం ఏది?
1) ఎల్ సాల్వడార్
2) పెరూ
3) జింబాబ్వే
4) జాంబియా
View Answer
సమాధానం: 1
వివరణ: మధ్య అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్‌లో కరువు కారణంగా అత్యవసర పరిస్థితిని విధించారు. కరువు కారణంగా నీటి లభ్యత లేకపోవడటంతో ఈ పరిస్థితి వచ్చింది.
18. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు విద్యా సంబంధిత అంశాల్లో కలిసి పనిచేయడానికిఏ సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి?
1) ఐఐటీ - ఢిల్లీ
2) కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్
3) ఐఐఎస్‌సీ - బెంగళూరు
4) జాదవ్‌గఢ్ యూనివర్సిటీ
View Answer
సమాధానం: 2
వివరణ: భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ విద్య, మానవ వనరుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.
19. ఉక్రెయిన్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) యునికోవిచ్
2) యుశ్చెంకో
3) వోలోదిమిర్ గ్రోస్‌మన్
4) కృచ్చిన్
View Answer
సమాధానం: 3
20. జార్ఖండ్ ప్రభుత్వం ‘బీమ్‌రావ్ అంబేడ్కర్ ఆవాస్ యోజన’ను ఎవరి కోసం ప్రవేశ పెట్టింది?
1) వితంతువులు
2) దివ్యాంగులు
3) 60 సంవ త్సరాల పైబడిన వారు
4) మహిళలు
View Answer
సమాధానం: 1
వివరణ: ‘బీమ్‌రావ్ అంబేడ్కర్ ఆవాస్ యోజన’లో భాగంగా వితంతువులకు 11,000 ఇళ్లను నిర్మిస్తారు. దీనికి రూ. 80 కోట్లు కేటాయించారు. పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణానికి కొండ ప్రాంతాల్లో రూ. 75,000, మైదాన ప్రాంతాల్లో రూ. 70,000 కేటాయిస్తారు.
21. పనాగఢ్ ఎయిర్ బేస్ పేరును ఎవరి గౌరవార్థం మారుస్తున్నారు?
1) జనరల్ కరియప్ప
2) మార్షల్ అర్జన్ సింగ్
3) జనరల్ మానెక్ షా
4) మార్షల్ మాన్యవర్ సింగ్
View Answer
సమాధానం: 2
వివరణ: పశ్చిమ బెంగాల్‌లోని పనాగఢ్ ఎయిర్ బేస్ పేరును అర్జన్ సింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌గా మార్చారు.బతికుండగా ఒక వ్యక్తి పేరును ఎయిర్ బేస్‌కు పెట్టడం ఇదే తొలిసారి.
22. ప్రపంచంలోనే అతి చిన్న ఉష్ణ ఇంజన్‌ను ఏ యూనివర్సిటీ పరిశోధకులు సృష్టించారు?
1) మసాచుసెట్స్ యూనివర్సిటీ
2) కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
3) జోహన్నెస్ గూటెన్‌బర్గ్ యూనివర్సిటీ
4) యూనివర్సిటీ ఆఫ్ టొరంటో
View Answer
సమాధానం: 3
వివరణ: జపాన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలసి సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గ్రాఫీన్ సెన్సార్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఇళ్లలోని హానికరమైన వాయు కాలుష్యాన్ని తక్కువ విద్యుత్ వినియోగంతో గుర్తిస్తుంది.
23. ఇళ్లలో హానికరమైన వాయు కాలుష్యాన్ని గుర్తించే గ్రాఫీన్ సెన్సార్‌ను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1) సౌతాంప్టన్ యూనివర్సిటీ
2) కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
3) కాలిఫోర్నియా యూనివర్సిటీ
4) సాన్ డిగో స్టేట్ యూనివర్సిటీ
View Answer
సమాధానం: 1
వివరణ: జపాన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలసి సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గ్రాఫీన్ సెన్సార్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఇళ్లలోని హానికరమైన వాయు కాలుష్యాన్ని తక్కువ విద్యుత్ వినియోగంతో గుర్తిస్తుంది.
24. భారత శాంతియుతానికి గుర్తుగా ప్రపంచంలోనే అతిపెద్ద చరఖా (రాట్నం)ను ఎక్కడ ప్రతిష్టించనున్నారు?
1) అహ్మదాబాద్
2) ముంబై
3) కోల్‌కతా
4) ఢిల్లీ
View Answer
సమాధానం: 4
వివరణ: నాలుగు టన్నుల బరువున్న ఈ రాట్నాన్ని అహ్మదాబాద్‌లోని ‘ఖాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC)’ తయారుచేసింది. దీని కోసం మేలిరకం టేకు కలపను వాడారు. ఇది సుమారు 50 ఏళ్ల వరకు చెక్కుచెదరని అంచనా.
25. కిందివారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సన్నిహితుడు, డ్రైవర్ ఎవరు?
1) కల్నల్ వికారుద్దీన్
2) కల్నల్ నిజాముద్దీన్
3) కల్నల్ జై సింహ్
4) కల్నల్ గురుప్రీత్ సింగ్
View Answer
సమాధానం: 2
వివరణ: కల్నల్ నిజాముద్దీన్ 1900వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ఇంకా బ్రతికే ఉన్నారు. ఈ మధ్యనే భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతా తీసుకున్న సందర్భంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి.
26. ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు రాజస్థాన్‌లో జరిపిన యుద్ధ విన్యాసాల పేరేమిటి?
1) శత్రుజీత్
2) కొంకణ్
3) మలబార్
4) సంబ్రమాశ్చర్య
View Answer
సమాధానం: 1
వివరణ: దాదాపు 30,000 మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని ఎడారులలో ఈ విన్యాసాలు జరిగాయి.
27. ఎస్సీ, ఎస్టీలపై సామూహిక అత్యాచారం, హత్య, రసాయన దాడులు జరిగితే బాధితులకు ఎంత మొత్తాన్ని కనీస పరిహారంగా ఇస్తారు?
1) రూ. 7.5 లక్షలు
2) రూ. 8.5 లక్షలు
3) రూ. 9.5 లక్షలు
4) రూ. 10 లక్షలు
View Answer
సమాధానం: 2
వివరణ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం, 1995లో సవరణలు చేసి పరిహారాన్ని రూ. 8.5 లక్షలకు పెంచారు.
28. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. ఏ విశ్వవిద్యాలయంతో ఆవిష్కరణలు, నాయకత్వంలో శిక్షణకు ఒప్పందం కుదుర్చుకుంది?
1) హార్వర్డ్ యూనివర్సిటీ
2) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
3) సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ
4) మసాచుసెట్స్ యూనివర్సిటీ
View Answer
సమాధానం: 3
29. భారతదేశంలో అతి పేద జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా
2) తెలంగాణ
3) జమ్మూకశ్మీర్
4) రాజస్థాన్
View Answer
సమాధానం: 1
వివరణ: ఒడిశాలోని నవరంగ్‌పూర్ అతి పేద జిల్లా. ఇక్కడ రూ. 8.87 కోట్లతో ప్రభుత్వ మోడల్ కళాశాలను నిర్మించబోతున్నారు.
30. దీర్ఘకాలిక వీసాతో భారత్‌లో నివసిస్తున్న ఏ దేశ హిందువులకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి?
1) బంగ్లాదేశ్
2) ఆఫ్ఘానిస్తాన్
3) శ్రీలంక
4) పాకిస్థాన్
View Answer
సమాధానం: 4
వివరణ: పాకిస్థాన్‌కు చెందిన హిందువులు భారతదేశంలో దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్నట్లయితే వారు ఆస్తి కొనుగోళ్లు చేయొచ్చు. బ్యాంకు ఖాతా, పాన్ అకౌంట్, ఆధార్ కార్డు పొందవచ్చు.
31. మలేషియాలో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ విజేత ఎవరు?
1) భారత్
2) ఆస్ట్రేలియా
3) పాకిస్థాన్
4) మలేషియా
View Answer
సమాధానం: 2
వివరణ: ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 4 - 0 తేడాతో భారత్‌పై గెలిచి సుల్తాన్ అజ్లాన్ షా కప్‌ను సొంతం చేసుకుంది.
32. ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఏప్రిల్ 15
2) ఏప్రిల్ 16
3) ఏప్రిల్ 17
4) ఏప్రిల్ 18
View Answer
సమాధానం: 3
33. గంగా నదీ ప్రక్షాళన, పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం ‘సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ అండ్ స్టడీస్ (CGRBMS)’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ఢిల్లీ
2) అలహాబాద్
3) పట్నా
4) కాన్పూర్
View Answer
సమాధానం: 1
వివరణ: కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ సహకారంతో సీజీఆర్‌బీఎంఎస్‌ను ఢిల్లీలో ఏర్పాటుచేసింది. గంగా రివర్ బేసిన్ నిర్వహణకు పదేళ్లు సహకారం అందించేలా ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
34. భారతదేశ తొలి బ్యాటరీ ఆధారిత విద్యుచ్ఛక్తి నిల్వ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) హరియాణా
4) తమిళనాడు
View Answer
సమాధానం: 3
వివరణ: అమెరికాకు చెందిన ఏఈఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పానాసోనిక్ కంపెనీ ఉమ్మడి భాగస్వామ్యంతో 10MW విద్యుచ్ఛక్తిని నిల్వ ఉంచే ప్రాజెక్టును హర్యానాలోని ఝజ్జర్‌లో ప్రారంభించారు.
35. బొంబాయి, థానే మధ్య తొలి రైలు ఎప్పుడు ప్రయాణించింది?
1) 1853, ఏప్రిల్ 16
2) 1843, ఏప్రిల్ 16
3) 1893, ఏప్రిల్ 16
4) 1858 , ఏప్రిల్ 4
View Answer
సమాధానం: 1
36. భారత్‌కి చెందిన ఏ ఐటీ సంస్థపై అమెరికా కోర్టు రూ. 6110 కోట్ల జరిమాన విధించింది?
1) ఇన్పోసిన్
2) విప్రో
3) టెక్ మహీంద్రా
4) టీసీఎస్
View Answer
సమాధానం: 4
వివరణ: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపై అమెరికా ఫెడరల్ కోర్డు రూ. 6110 కోట్ల జరిమానాను విధించింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఎపిక్ సిస్టమ్స్’ తాలూకు సాఫ్ట్‌వేర్ తస్కరణ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
37. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర దక్షిణాసియా వ్యవహారాల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వెంకట రెడ్డి
2) రామ్మోహన్ రెడ్డి
3) పింకీ రెడ్డి
4) సర్వేశ్వర రెడ్డి
View Answer
సమాధానం: 2
వివరణ: రామ్మోహన్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వారు.
38. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఏప్రిల్ 16
2) ఏప్రిల్ 17
3) ఏప్రిల్ 18
4) ఏప్రిల్ 19
View Answer
సమాధానం: 3
39. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణ కమిటీకి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ప్రొఫెసర్ క్రిస్టోఫర్ బెన్నిగర్
2) డా. ఇర్విన్ విరాయ్
3) కేశవ్ శర్మ
4) కేజీ రవీంద్రన్
View Answer
సమాధానం: 1
40. ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్ ఎవరు?
1) దీపికా రాణి
2) దీపా కర్మాకర్
3) సువర్ణ కుమారి
4) సంజు గార్గ్
View Answer
సమాధానం: 2
వివరణ: 22 ఏళ్ల త్రిపుర అమ్మాయి దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్, ఆర్టిస్టిక్ విభాగంలో అర్హత సాధించారు.
41. దేశంలోని గిరిజన ప్రాంతాలకు చెందిన మహిళా సర్పంచుల జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
1) విజయవాడ
2) హైదరాబాద్
3) రాంచీ
4) లక్నో
View Answer
సమాధానం: 1
వివరణ: ‘గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ పేరుతో కే ంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 నుంచి 24 వరకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మహిళా సర్పంచుల జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు 10 రాష్ట్రాల నుంచి ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన 1100 మంది మహిళా సర్పంచులు హాజరయ్యారు.
42. ‘శ్రీ మాతా వైష్ణోదేవీ నారాయణ సూపర్‌స్పెసాలిటీ ఆసుపత్రి’ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) జార్ఖండ్
2) హిమాచల్ ప్రదేశ్
3) జమ్మూకశ్మీర్
4) సిక్కిం
View Answer
సమాధానం: 3
వివరణ: జమ్మూకశ్మీర్‌లోని రియేసి జిల్లా కక్రియాల్ గ్రామంలో 230 పడకల ఆసుపత్రిని ప్రధాన మంత్రి ప్రారంభించారు.
43. ‘బేటీ బచావ్ బేటీ పడావ్’ కార్యక్రమాన్ని రెండో విడతలో భాగంగా ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు?
1) 67
2) 63
3) 65
4) 61
View Answer
సమాధానం: 4
వివరణ: ‘బేటీ బచావ్ బేటీ పడావ్’ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మొదట 100 జిల్లాలో ప్రారంభించారు. రెండో విడతలో మేనకా గాంధీ మరో 61 జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు.
44. సాంప్రదాయబద్ధ, హోమియోపతి వైద్యంలో పరస్పర సహకారానికి భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
1) నేపాల్
2) మారిషస్
3) శ్రీలంక
4) పాకిస్థాన్
View Answer
సమాధానం: 2
45. బోరుబావులను 200 అడుగులకు మించి తవ్వకుండా నిషేధం విధించిన రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) తెలంగాణ
3) కర్నాటక
4) తమిళనాడు
View Answer
సమాధానం: 1
వివరణ: తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని బోరుబావులను 200 అడుగులకు మించి తవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
46. ‘లారెస్ స్పోర్ట్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ - 2016’ అవార్డును ఏ క్రీడాకారుడు గెలుచుకున్నాడు?
1) లియోనెల్ మెస్సీ
2) క్రిస్టియానో రొనాల్డో
3) నొవాక్ జొకోవిచ్
4) లెవిస్ హామిల్టన్
View Answer
సమాధానం: 3
వివరణ: లారెస్ స్పోర్ట్‌ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సెరెనా విలియమ్స్‌కు లభించింది.
47. పత్రికా స్వేచ్ఛ సూచీ - 2016లో భారత స్థానం ఎంత?
1) 135
2) 133
3) 137
4) 139
View Answer
సమాధానం: 2
వివరణ: రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ విడుదల చేసిన పత్రికా స్వేచ్ఛ సూచీలో మొత్తం 180 దేశాలకు గాను భారత్‌కు 133వ స్థానం లభించింది. ఫిన్‌లాండ్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. నెదర్లాండ్ రెండు, నార్వే మూడో స్థానాల్లో నిలిచాయి.
48. ప్రజా సేవ - జర్నలిజం విభాగంలో 100వ పులిట్జర్ బహుమతిని అందుకున్న సంస్థ ఏది?
1) టైమ్స్ ఆఫ్ ఇండియా
2) అసోసియేటెడ్ ప్రెస్
3) న్యూయార్క్ టైమ్స్
4) ది గార్డియన్
View Answer
సమాధానం: 2
49. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)గా ఎవరు నియమితులయ్యారు?
1) శ్రీనివాసన్
2) అనురాగ్ ఠాకూర్
3) రాహుల్ జోహ్రి
4) సునీల్ గవాస్కర్
View Answer
సమాధానం: 3
వివరణ: లోధా కమిటీ సిపార్సులకు అనుగుణంగా రాహుల్ జోహ్రి ఎంపికయ్యారు.
50. అమృత్ పథకంలో భాగంగా రూ. 800 కోట్ల వ్యయంతో ఏ సరస్సు (చెరువు)నుశుద్ధి చేయనున్నారు?
1) బెల్లాండూర్
2) హుస్సేన్ సాగర్
3) కొల్లేరు
4) చిలకా
View Answer
సమాధానం: 1
వివరణ: బెంగళూరులో ఉన్న బెల్లాండూర్ సరస్సును శుద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.