కీళ్లు (జాయింట్స్)
రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలు అంటారు. రెండు ఎముకలను బంధించే కొల్లాజెన్ పోగులను లిగ్మెంట్ (స్నాయువు) అంటారు. ఎముకను కండరంతో బంధించే కొల్లాజెన్ పోగును టిండాన్ (స్నాయుబంధనం) అంటారు. కీళ్ల మధ్యలో సైనోవియల్ కుహరం ఉంటుంది. దీనిలో సైనోవియల్ ద్రవం ఉంటుంది. సైనోవియల్ ద్రవం కీళ్ల కదలికలో కందెనలా ఉపయోగపడుతుంది. ఎముకలు, దేహం కదలడానికి కీళ్లు తోడ్పడతాయి. కీళ్ల అధ్యయనాన్ని ఆర్థాలజీ అంటారు. శరీరంలోమొత్తం 230 కీళ్లుంటాయి. కీళ్ల, ఎముకల వైద్య నిపుణుడ్ని ఆర్థోఫెడిక్ డాక్టర్ అంటారు.
కీళ్లు - రకాలు
కీళ్లు రెండు రకాలు.
1) కదలని (స్థిరమైన) కీళ్లు
పుర్రెలో పైదవడ, కపాలానికి మధ్య ఉండే వి కదలని కీళ్లు
2) కదిలే కీళ్లు
పుర్రెలో కింది దవడ కదిలే కీలు.
ఇవి నాలుగు రకాలు. అవి..
బొంగరపు కీలు: ఇది మెడలో పుర్రె, వెన్నెముక కలిసే ప్రాంతంలో ఉంటుంది. మెడలో 7 ఎముకలు ఉంటాయి. బొంగరపు కీలు చేసే కోణం 180 డిగ్రీలు
నోట్: భరతనాట్యం చేసే వారిలో ఈ కీలు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
బంతిగిన్నె కీలు: ఇది భుజం-దండచేయి, తొడ-కటివలయం ప్రాంతంలో ఉంటుంది. ఈ కీలు చేసే కోణం 360 డిగ్రీలు
నోట్: చేతులు, కాళ్లను ఈ కీలు వృత్తాకారంగా (గుండ్రంగా) తిప్పుతుంది.
మడతబందు కీలు: ఇది మోచేయి, మోకాలు, కాలు, చేతి వేళ్లకు మధ్య ఉంటుంది. ఈ కీలు చేసే కోణం - 90 డిగ్రీలు.
నోట్: ఈ కీలు మోచేయి, మోకాలును ఒకేవైపు వంచుతుంది. తలుపులు, కిటికీలకు బంధించే నిర్మాణాలు మడతబందులు.
జారుడు కీలు: ఇది వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య పక్కటెముకలు, మణికట్టులో ఉంటుంది.
నోట్: తాళం వేసేటప్పుడు, తీసేటప్పుడు, ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాస సమయంలో అవసరమయ్యే కీలు జారుడు కీలు. నేలమీది ఉన్న వస్తువును వంగి తీసుకునేటప్పుడు (వెన్నుపూసలు) ఉపయోగపడేది జారుడు కీలు.
కీళ్లు
May 13, 2016
Tags