నేడే..జాతీయ నులిపురుగుల దినోత్సవం
🔸పిల్లలు ఉదయాన్నే లేస్తారు... బడికి వెళ్లేందుకు తయారయ్యే క్రమంలో అకస్మాత్తుగా అమ్మా.. కడుఫులో నొప్పి అంటూ.. కూలబడిపోతారు. సాధారణంగా ప్రతి ఇంట్లో ఇలాంటి సంఘటనలు సహజం.
🔸కడుపునొప్పికి ప్రధాన కారణం నులిపురుగులు అని మీకు తెలుసా..?
🔸నులిపురుగులు కడుపులో ఉండడంతో పిల్లలు తినే ఆహారంలోని పోషకాలను అవి గ్రహించి రక్తహీనతను కలుగజేస్తాయి. దీంతో పిల్లల్లో చురుకుదనం తగ్గిపోయి బలహీనంగా తయారవుతారు.
నులి పురుగులు గురించి..
*🔸కడుపులో, పేగుల్లో పడే నులి పురుగులు (పరాన్న జీవుల్లో) సాధారణంగా 300 పైగా వేర్వేరు రకాలకు చెందినవిఉంటాయి. మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడటానికి సాధ్యమయ్యే అత్యంత చిన్న జీవులు మొదలుకొని ఒక్కోసారి 35 సెం.మీ. పొడవుండే జీవులు ఇందులో ఉంటాయి. కడుపులో పేగు (గ్యాస్ట్రో ఇంటస్టినల్‌ట్రాక్స్)ల్లో పడే ఈ పరాన్న జీవులు అనేక వర్గాలకు చెందినవై ఉంటాయి.ఏకకణ జీవులైన ప్రోటోజోవా, పొడవాటి పాముల్లా కనిపించే హెల్మెంథిస్ వర్గాలకు చెందినవి ఎక్కువ.ఇలా కడుపులో నులిపురుగులు ఏర్పడటానికి కారణం అధికంగా స్వీట్స్ తినడం వల్ల జరగవచ్చు. ఇది నివారించడా నికి డీ వామ్ మెడికేషన్ చేయాలి. అయితే ఇది అంత సులభమైన పని కాదు. నులిపురుగుల్లో ప్రాణాంతకమైన టేప్ వర్మ్ కూడా మెదడు మరియు మొత్తం కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.*
🔸ప్రభుత్వం ప్రతిఏటా ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుతుంది.
🔸దేశంలో చేపట్టిన డీవార్మింగ్ ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకం అని, ఈ కార్యక్రమం ద్వారా 27 కోట్ల మంది చిన్నారులను టార్గెట్ చేసినట్లు , నులిపురుగుల నిర్మూలన కోసం పిల్లలకు అల్బెన్‌డాజోల్ మాత్రలను భారీగా సరఫరా చేస్తున్నట్లు దీని ద్వార చిన్నారుల్లో నులి పురుగుల సమస్యను నివారించవచ్చు అని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
*🔸ఇందులో భాగంగా 1-19సం వత్సరాల వారందరికీ ఆల్బెండజోల్-400 గ్రాముల మాత్రలను ప్రతి పాఠశాల, కళాశాల, ఆరోగ్య కేంద్రాలలో పంపిణీ చేస్తారు. బడి బయట పిల్లలకు ఆరోగ్య కేంద్రాల ఆశవర్కర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి మాత్రలు అందిస్తారు.*
🔸అల్పాహారం లేదా భోజనం చేసినవారికే ఈ ఆల్బెండజోల్ మాత్రలను ఇవ్వాలని, ఖాళీ కడుపుతో ఉన్నవారికి ఎట్టి పరిస్థితిల్లో ఇవ్వరాదని సూచించారు. 2సంవత్సరాల లోపు పిల్లలకు సగం టాబ్లెట్ ను,2సం" పైబడిన వారికీ ఫుల్ టాబ్లెట్ ను వేయాలి.
*🍥నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..*
🔻బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయరాదు.
🔻మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను శభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
🔻చేతిగోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకొని మట్టి చేరకుండా చూసుకోవాలి.
🔻ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని తాగాలి.
🔻ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచాలి.
🔻ఆకుకూరలను, కాయగూరలను నీటితో శుభ్రంగా కడిగి వండుకోవాలి.
🔻బయట తిరిగేటప్పుడు పాదరక్షలు ధరించాలి.
🔸రక్తహీనతకు మూలకారణం నులిపురుగులు. వీటీ నివారణ మందులను పిల్లలకు తప్పక వేయించాలి. వీటీ ద్వారా పిల్లలలో రక్తహీనత తగ్గి,చురుకుగా ఉంటారు. తద్వారా చదువు లో కూడ ఏకాగ్రత పెరుగుతుంది. వీటీ వల్ల ఎలాంటి సైడ్‌ఎఫేక్ట్స్ ఉండవు.