అమ్మ మనకు దైవమురా - Amma Manaku Daivamura

VINAYS INFO
VINAYS INFO

అమ్మ మనకు దైవమురా!

అమ్మ ప్రేమ రూపమురా!

అమ్మవంటి దేవత ఈ

అవనిలోన లేదురా!


     తన రక్తము పోసి మనను

     కనిపెంచునురా!

     తీపికథలు చెప్పిబువ్వ

     తినిపించునురా!


అమ్మపిలుపులో ఎంతో

కమ్మదనం ఉందిరా!

అమ్మ పలుకు మాటల్లో

అమృతమే చిందురా!


     జోలపాట పాడి

     ఉయ్యాల లూపురా!

     లాలిపాట పాడి

     నిదుర బుచ్చురా!


 ‘‘బాల గేయాలు - వేముగంటి నరసింహాచార్యులు

You may like these posts

Post a Comment