రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం -2018 బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం గ్రామ పంచాయితీల సంఖ్య 12,741. ఇందులో కొత్త గ్రామ పంచాయతీలు 4,380 కాగా 1326 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఎస్టీలు ఉన్నారు. షెడ్యూల్డ్ గ్రామ పంచాయితీలు 1,311 ఉన్నాయి. 12,741 గ్రామ పంచాయితీల్లో 1,13,270ల వార్డులు ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 721 గ్రామ పంచాయితీలు ఉండగా అత్యల్పంగా మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.