Type Here to Get Search Results !

Vinays Info

టిఆర్టీ ఆన్ లైన్ అప్లికేషన్ కు ఇవాళే ఆఖరు తేదీ

Top Post Ad

TRT పై ఇవాళే ఆఖరుతేది
అయోమయంలో అభ్యర్థులు
ఇంకా క్లారిటీ ఇవ్వని TSPSC

TRT దరఖాస్తుల పొడిగింపుపై TSPSC ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.  గడువుతేది ఇవాళ్టితో అయిపోతోంది.  అయితే హైకోర్టు నుంచి ఇంకా తమకు కాపీ రాలేదంటున్నారు TSPSC అధికారులు.  TRT దరఖాస్తుల తేదీ పొడిగింపుపై TSPSC అధికారులతో ఫోన్ లో మాట్లాడారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. హైకోర్టు నుంచి తమకు ఎలాంటి ఆర్డర్ కాపీ రాలేదని  కడియంకు వివరించారు  TSPSC అధికారులు. ఎలాగూ గడువు పెంచుతారని ఇప్పటికీ ఇంకా చాలామంది అభ్యర్థులు అప్లయ్ చేయలేదు. 31 జిల్లాలను కాకుండా 10 జిల్లాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని తీర్పు చెప్పింది హైకోర్టు.  అందుకోసం గడువును డిసెంబర్ 15 వరకూ పెంచాలని కూడా కోర్టు ఆదేశించింది.  అయితే తమకు ఇంతవరకూ ఎలాంటి సమాచారం కోర్టు నుంచి రాలేదని tspsc అధికారులు చెబుతుండటంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.

Below Post Ad