Type Here to Get Search Results !

Vinays Info

Current Affairs 31.July.2017

Top Post Ad

రాష్ట్రీయం 1) బోనం- తెలంగాణ ప్రాణం పేరుతో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బోనాలు కార్యక్రమానికి గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది. ఇందులో ఎంతమంది మహిళలు పాల్గొన్నారు ? జ: 2500 మంది 2) 3వ విడత హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం ఏ దళాలను ఏర్పాటు చేసింది ? జ: హరిత దళం (గ్రీన్ బ్రిగేడ్లు) 3) బృహత్ ప్రణాళికల కోసం రాష్ట్రంలోని ఎన్ని పట్టణాలకు GIS మ్యాపింగ్ పూర్తి చేశారు ? జ: 37 పట్టణాలు జాతీయం 4) డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ( Digital Evolution Index ) జ: భారత్ 5) పారామిలటరీ బలగాల్లో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక చేయూత కోసం మూడు నెలల్లో రూ.10.18 కోట్లు విరాళాలు వచ్చాయి. ఈ నిధి పేరేంటి ? జ: భారత్ కే వీర్ 6) 50 యేళ్ళ నాడు కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన శకలాలు ఫ్రాన్స్ లో బయటపడుతున్నాయి. 1966 జనవరి 24న కూలిన ఈ విమానంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తి ఎవరు ? జ: భారత అణు పితామహుడు హోమీబాబా 7) నిరక్షరాస్యులైన వయోజనులకు కనీసం విద్యను అందించేందుకు దేశంలో నడుస్తున్న కార్యక్రమం పేరేంటి ? జ: సాక్షర భారత్ 8) ఏ కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ? జ: వరకట్న వేధింపుల కేసు 9) డీజెల్ వినియోగం తగ్గించుకోవడానికి బొగ్గుతో దేన్ని ఉత్పత్తి చేయాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచించింది ? జ: మిథనాల్ 10) ఈ ఏడాది చివరికల్లా 48 MI-17 చాపర్ల కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోనుంది ? జ: రష్యాతో 11) 1986 నాటి భోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం మరోసారి వార్తల్లోకి వస్తోంది. భోఫోర్స్ సంస్థ ఏ దేశానికి చెందినది ? జ: స్వీడన్ 12) CANDI పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ ని కెనరా బ్యాంక్ ఏ సిటీలో ఏర్పాటు చేసింది ? జ: బెంగళూరు 13) ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ మెట్రో సిస్టమ్ కలిగిన మెట్రో స్టేషన్ ఏది ? జ: ఢిల్లీ మెట్రో 14) జపాన్ దేశం నుంచి ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అవార్డుకు ఎంపికైన కేంద్ర మాజీ మంత్రి ఎవరు ? జ: అశ్వినీ కుమార్ 15) అప్నీ గాడీ – అప్నీ రోజ్ గార్ పేరుతో 100 ఉబెర్ మోటో బైక్స్ స్కీమ్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ? జ: పంజాబ్ 16) మృగవని నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ? జ: తెలంగాణ 17) BWF ప్రపంచ ర్యాంకింగ్ ల్లో పీవీ సిందు ర్యాంక్ ఎంత ? జ: 5 వ 18) లాగోస్ ఓపెన్ బ్యాండ్మింటన్ టోర్నీలో సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న భారతీయ ప్లేయర్ ఎవరు ? జ: చిట్టబోయిన రాహుల్ 19) ఆసియాన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ కేటగిరీలో కాంస్యపతకం గెలుచుకున్న లవ్ ప్రీత్ సింగ్ ఎన్ని కేజీల విభాగంలో పోటీ పడ్డారు ? జ: 105 కేజీలు అంతర్జాతీయం 20) రామన్ మెగసెసే అవార్డు పొందిన జపాన్ చరిత్రకారుడు ఎవరు ? జ: యోషియాకీ ఇషిజవా 21) రామన్ మెగసెసే అవార్డులను ఏ దేశ మాజీ ప్రధాని పేరు ప్రదానం చేస్తారు ? జ: పిలిప్పీన్స్ 22) 7వ సార్క్ దేశాల Artists camp and Exhibition of Paintings లో పాల్గొనని దేశం ఏది ? జ: ఆఫ్ఘనిస్తాన్ 23) 2017 గ్లోబల్ టైగర్ డే ను ఎప్పుడు నిర్వహించారు ? జ: జులై 29 24) మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినంను ఎప్పుడు పాటిస్తారు ? జ: జులై 30 25) సిమోర్ఘ్ అనే శాటిలైట్ మోసుకెళ్ళే రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది ? జ: ఇరాన్ 26) 2017 ఏసియాన్ ఫుట్ బాల్ కాన్ఫడరేషన్ అండర్ 19 ఛాంపియన్షిప్ ను నిర్వహిస్తున్న దేశం ఏది ? జ: ఇండోనేషియా

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.