హిమాలయాలు కనుమలు
*హిమాలయాలు భారత దేశానికి పెట్టని గోడ .అంతేనా అద్భుత దృశ్య కావ్యం ..ప్రకృతి తో పాటు ఆధ్యాత్మిక చింతన వెళ్లి విరిసే దేవ సౌందర్యం .జీవనదులకి పుట్టిల్లు .పరమ యోగుల నివాస స్తలం .అనాదిగా మధ్య ఆసియా నుంచి ,మంగోలియా ,చైనా ,జపాన్ వంటి దేశాలనుంచి భారతదేశం లోకి ఏకైక మార్గం ఇదే ......*
*హిమాలయాలలో ఇప్పటికీ చాలా ప్రాంతాలకి రహదారి మార్గాలు కొండల మధ్యనున్న కనుమలే !అందులో కొన్ని ముఖ్యమైన కనుమలు .*
*1.బనిహాల్ పాస్*
*జమ్మూ నుంచి కాశ్మీర్ లోయ ని కలిపే ఈ కనుమ పిర్పంజల్ శ్రేణి లో చాలా ముఖ్యమైన రవాణా మార్గం .*
*2.జోజిలా పాస్*
*శ్రీనగర్ –లెహ్ మధ్య నేషనల్ హైవే 1 D దీని మీదుగా పోతుంది .ఇది లడఖ్ లో ప్రవేశించడానికి ఏకైక పశ్చిమ మార్గం .*
*3.రోహతంగ్ పాస్*
*కులూ లోయని స్పితి లోయతో కలుపుతున్న ఈ పాస్ గుండా హిమాచల్ ప్రదేశ్ లో లెహ్-మనాలి హైవే పోతుంది*
*4.మోహన్ పాస్*
*శివాలిక్ కొండల్లో ఉన్న ఈ కనుమ సిక్కిం ని పూర్వ హిమాలయాలతో కలుపుతుంది*
*5.కోరా లా పాస్*
*నేపాల్ -.టిబెట్, K 2 -,ఎవరెస్ట్,సిక్కిం-టిబెట్ ల మధ్య తక్కువ ఎత్తులో ఉన్న ప్రధాన రహదారి ఇదే .*
*6.గ్యాంగ్ టాక్ పాస్*
*సిక్కిం నుంచి లాసా మధ్య ప్రధాన రహదారి .*
*7.మానా పాస్*
*ఇండియా –టిబెట్ మధ్య ప్రధాన రహదారి*
*8.కారకోరం కనుమ*
*ఇండియా –చైనా మధ్య చాలా పురాతన రవాణా మార్గం .మన దేశానికీ ఎంతో మంది విదేశీ యాత్రికులూ ,విదేశీ పాలకులూ ఈ మార్గం గుండానే వచ్చినట్లు సమాచారం*
*9.పీర్ పంజాల్ కనుమ* *దీనిగుండా ప్రస్తుతం quazigund-banihal రైల్వే లైన్ పోతోంది .ఈ కనుమ గుండా నిర్మించిన 7 మైళ్ళ పొడవైన రైల్వే టన్నెల్ భారతదేశం లో పొడవైన రైల్వే టన్నెల్ గా పేరు పొందింది .*
ఇంకా khyber,బోలన్ ,గోమల్ ,పెన్సి లా ,బారా లచ్చ ,శిప్కిలా ,nathoo la,దిహంగ్ ,పాల్ఘాట్ ,భోర్ ఘాట్ ఇలా ఇంకా కొన్ని కనుమలు హిమాలయాల్లో ప్రధాన రహదారి మార్గాలు .ఇదివరలో కాలి నడకకే ఉపయోగించే ఈ కనుమలు ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధి ఫలితం గా రోడ్లు ,రైలు మార్గాలు గా రూపు దిద్దుకున్నాయి .