తెలంగాణ
👉అపెక్స్ కౌన్సిల్ సమావేశం
-కృష్ణా-గోదావరి నదీ జలాలపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య పంపిణీ కోసం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నాయకత్వంలో సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.
👉బతుకమ్మకు రూ. 15 కోట్లు
-సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదలచేసింది.
👉దార్లకు చాన్స్‌లర్ అవార్డు
-డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావుకు సెంట్రల్ వర్సిటీ చాన్స్‌లర్ అవార్డు సెప్టెంబర్ 25న లభించింది. ఆయన 14 పుస్తకాలు రచించారు.
👉మహిళలకు భద్రత కల్పిస్తున్న రాష్ర్టాలు
-సెప్టెంబర్ 21న యూఎస్‌ఏకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజి అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పనిచేసే చోట మహిళలకు భద్రత కల్పిస్తున్న రాష్ర్టాల జాబితాను ప్రకటించింది. అందులో సిక్కిం-1, తెలంగాణ-2, పుదుచ్చేరి-3, కర్ణాటక-4, హిమాచల్‌ప్రదేశ్-5, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉన్నాయి.
👉అధికారికంగా కొండా లక్ష్మణ్ జయంతి
-కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి అయిన సెప్టెంబర్ 27ను రాష్ట్ర ఉత్సవంగా అధికారికంగా నిర్వహించారు. ప్రతి జిల్లాకు రూ. 20 వేల చొప్పున విడుదల చేశారు. 101వ జయంతి ఉత్సవ కమిటీ నిర్వహణకు చైర్మన్‌గా జోగు రామన్న, వైస్ చైర్మన్‌గా శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు.
🔹జాతీయం
👉ఎన్‌ఎస్‌జీ డైరెక్టర్ జనరల్‌గా సుధీర్
-ఎన్‌ఎస్‌జీ డైరెక్టర్ జనరల్‌గా సుధీర్‌ప్రతాప్‌సింగ్ (రాజస్థాన్ కేడర్) సెప్టెంబర్ 23న నియమితులయ్యారు.
👉జీ-4 దేశాల ప్రతినిధుల సమావేశం
-జీ-4 దేశాల ప్రతినిధుల రెండో సమావేశం సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగింది. యూఎన్‌ఓ శాశ్వత సభ్యత్వం కోసం భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలతో జీ-4 దేశాల కూటమి ఏర్పడింది.
👉ప్రధాని భద్రతా అధికారిగా రాధాకృష్ణ
-ప్రధానమంత్రి భద్రతా అధికారిగా రాధాకృష్ణ సెప్టెంబర్ 22న నియమితులయ్యారు. ఆయనకంటే ముందు మలయకుమార్‌సిన్హా ఆ బాధ్యతలను నిర్వర్తించారు.
-దక్షిణమధ్య రైల్వే సంస్థను ప్రారంభించి అక్టోబర్ 2 నాటికి 50 ఏండ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించనున్నారు. ఈలోగోపై ఆరు నక్షతాల్లో ఆరు రైల్వే డివిజన్లను చూపిస్తాయి.
👉జీఎస్‌టీ తొలి వార్షిక సమావేశం
-జీఎస్‌టీ తొలి వార్షిక సమావేశం ఢిల్లీలో సెప్టెంబర్ 23న జరిగింది.
👉12 మందికి దీన్‌దయాళ్ కృషి పురస్కారాలు
-పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కృషి పురస్కారాలను 12 మందికి భారత వ్యవసాయ పరిశోధక సంస్థ అవార్డు లభించాయి. ఈ అవార్డు గ్రహీతల్లో ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌కు చెందిన మహిళా రైతు క్రిషన్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ అవార్డు కింద రూ. లక్ష నగదుగా ఇచ్చారు.
👉ఏబీసీ సర్క్యులేషన్ చైర్మన్‌గా వెంకట్
-అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా ఐ వెంకట్, డిప్యూటీ చైర్మన్‌గా దేవబ్రత ముఖర్జీ సెప్టెంబర్ 23న ఎన్నికయ్యారు.
🔹అంతర్జాతీయం
👉మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ ద్వితీయ రన్నరప్‌గా లోపాముద్ర
-మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ ద్వితీయ రన్నరప్‌గా భారత్ నుంచి లోపాముద్ర రావత్ నిలిచారు. ఈ కార్యక్రమాన్ని ఈక్వెడార్‌లోని గయాక్విల్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో ఫిలిప్పైన్స్ సుందరి జెస్లిన్ శాంటోస్ మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని దక్కించుకొన్నారు. జాతీయ ఉత్తమ దుస్తుల పోటీల్లో కూడా లోపాముద్ర బహుమతి గెలుచుకొన్నారు.
👉మాస్కోలో అంతర్జాతీయ హిందీ సమ్మేళనం
-రష్యాలోని మాస్కో నగరంలో 3వ అంతర్జాతీయ హిందీ సమ్మేళనం అక్టోబర్ 26, 27 తేదీల్లో జరగునుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరుకానున్నారు.
👉కోయ్‌సాగర్‌ను ఈదిన కశ్మీరి చౌదరి
-ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత కోయ్‌సాగర్ ట్యాంక్‌ను సెప్టెంబర్ 25న 7 గంటల 49 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించిన కశ్మీరి చౌదరిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వాహకులు సన్మానించారు.
🔹సైన్స్ అండ్ టెక్నాలజీ
👉పీఎస్‌ఎల్‌వీ సీ35 ప్రయోగం
-పీఎస్‌ఎల్‌వీ సీ-35 రాకెట్ సెప్టెంబర్ 26న నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో ఇస్రోకు చెందిన స్కాట్‌శాట్-1, అల్జీరియాకు చెందిన మూడు, కెనడా, అమెరికాకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉన్నాయి. వీటితో పాటు ముంబై ఐఐటీకి చెందిన ప్రథమ్, బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పీ శాట్ కూడా ఉపగ్రహాలు ఉన్నాయి.
👉రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు
-భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం సెప్టెంబర్ 23న కుదిరింది. 787 కోట్ల యూరోల (సుమారు రూ. 59 వేల కోట్లు) విలువైన భారీ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మొదటి రాఫెల్ 36 నెలల్లో అందుతుంది. 66 నెలల్లో అన్ని విమానాలు సరఫరా అవుతాయి.
👉మికా క్షిపణి పరీక్ష విజయవంతం
-సెప్టెంబర్ 23న గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల దీర్ఘశ్రేణి మికా క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఆకాశం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని ఛేదించే ఈ క్షిపణిని మిరేజ్-2000 యుద్ధవిమానం నుంచి పరీక్షించారు.
🔹క్రీడలు
👉పసిఫిక్ ఓపెన్ విజేత సానియా జంట
-టోరో పాన్ పసిఫిక్ ఓపెన్‌ను సానియా, బార్బోరా స్ట్రీకోవా (చెక్) జంట సెప్టెంబర్ 24న సొంతం చేసుకొంది. చెల్ లియాంగ్, జావోజువాన్ యాంగ్ (చైనా) జంటను ఓడించింది. స్ట్రికోవాతో కలిసి సానియా సాధించిన రెండో టైటిల్ ఇది.
👉బాక్సింగ్ సమాఖ్య చీఫ్‌గా అజయ్
-భారత బాక్సింగ్ సమాఖ్య చీఫ్‌గా స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్‌సింగ్ సెప్టెంబర్ 25న ఎన్నికయ్యారు. 49 ఓట్ల తేడాతో రోహిత్ జ్ఞానేంద్రజైన్ పై విజయం సాధించాడు.
👉బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్
-బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్, జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వెంకటేశ్ ప్రసాద్, బోర్డు కార్యదర్శిగా షిర్కే నియమితులయ్యారు
🔹వార్తల్లో వ్యక్తులు
👉21 వేల కోట్లతో పరిశోధనా కేంద్రం
-ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ బయోహాన్ అనే పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ శతాబ్దం ముగిసేసరికి ఏ వ్యాధి లేకుండా చేయాలనే లక్ష్యంతో దాదాపు రూ. 21 వేల కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. సుమారు రూ. 4 వేల కోట్ల ఆరంభ వ్యయంతో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ కేంద్రం ఏర్పాటవుతుంది.