ఆర్.కే. నారాయణ్ గా సుప్రసిద్ధుడైనా రాసిపురం కృష్ణస్వామీ అయ్యర్ నారాయణస్వామి (అక్టోబర్ 10, 1906 - మే 13, 2001) ఒక భారతీయ రచయిత. ఆయన భారత దేశములోని ఒక కాల్పనిక పట్టణములో ఉన్న మనుషులు, వాళ్ల వ్యవహారాల గురించి ధారావాహిక నవలలు వ్రాసాడు. ఆంగ్ల భాషలో భారత సాహిత్యరంగం యొక్క ప్రారంభ దశకు చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో అయన ఒకడు. ముల్క్ రాజ్ ఆనంద్ మరియు రాజా రావు మిగిలిన ఇద్దరు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియ చేసిన వ్యక్తిగా ఆయినకు పేరు ఉంది. భారత దేశానికి చెందిన ఆంగ్ల భాష నవల రచయితలలో అతి గొప్పవారిలో ఒకరిగా అయిన భావించబడుతున్నాడు.
తన గురువు మరియు మిత్రుడైన గ్రహం గ్రీన్ సహాయంతో నారాయణ్ వెలుగులోకి వచ్చారు. ఆయన వ్రాసిన మొదటి నాలుగు పుస్తాకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలను ఒప్పించడంలో గ్రహం గ్రీన్ ముఖ్య పాత్ర పోషించారు. వీటిలో స్వామి అండ్ ఫ్రెండ్స్, ది బాచేలర్ అఫ్ ఆర్ట్స్,ది ఇంగ్లీష్ టీచర్ అనే మూడు సగం-స్వీయచరిత్ర పుస్తకాలు ఉన్నాయి. 1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మరియు సాహిత్య అకాడెమీ పురస్కారం గెలిచిన ది గైడ్ నారాయణ్ వ్రాసిన ఇతర నవలలలో కొన్ని. ది గైడ్ నవల హిందీ, ఆంగ్ల భాషలలో, బ్రాడ్వేలో చిత్రముగా తీయబడింది.
నారాయణ్ వ్రాసిన కథలలో అనేకము మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణములో జరుతాయి. మొదటి సారిగా ఈ పట్టణము స్వామి అండ్ ఫ్రెండ్స్ నవలలో పరిచయం చేయబడింది. ఆయన కథలు సామాజిక సంబంధాలని ఎత్తి చూపి, రోజూవారి జరిగే యదార్ధ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తాయి. నిజమనిపించే ఒక కల్పిత పట్టాణాన్ని సృష్టించి, దాని ద్వారా రోజువారి సామాన్య జీవితములోని హాస్యమునూ, సాదాసీదాతనాన్నీ బయటకు చూపి, తన రచనలో దయ, మానవత్వం చూపిన విల్లియం ఫాక్నేర్తో ఆయినని పోలుస్తారు. నారాయణ్ చిరుకథలు వ్రాసే శైలిని గయ్ డే ముపస్సంట్ శైలితో పోల్చడుతుంది. వీరిద్దరకి కథాంశాలని తీసేయకుండా కథని తగ్గించే సామర్థ్యం ఉంది. అయితే వచనము మరియు పద ప్రయోగాలలో చాలా సాదాగా ఉండేవారని నారాయణ్ మీద విమర్శలు ఉన్నాయి.
అరవై ఏళ్ళకు పైబడిన రచయిత వృత్తిలో నారాయణ్ కు అనేక పురస్కారాలు మరియు గౌరవాలు అందాయి. రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ నుండి AC బెన్సన్ మెడల్ మరియు భారత దేశపు రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ని నారాయణ్ అందుకున్నారు. ఆయన భారత శాసనసభ యొక్క పై సభ అయిన రాజ్యసభకు ప్రతిపాదించబడ్డారు.
జీవితం
ప్రారంభ సంవత్సరాలుసవరించు
అర్.కే. నారాయణ్ మెడ్రాస్ (ప్రస్తుతం చెన్నై అని పిలబడుతున్నది), మెడ్రాస్ ప్రెసిడెన్సి, బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. అయిన తండ్రి ఒక పాఠశాలలో ప్రధానపోధ్యాయుడు. నారాయణ్ తన విద్యాజీవితములో కొంత కాలం తండ్రి పాఠశాలలో గడిపారు. ఉద్యోగ రీత్యా అయిన తండ్రి తరచు బదిలీ అవుతూ ఉండడంతో, నారాయణ్ తన బాల్యములో కొంత భాగాన్ని అమ్మమ్మ పార్వతి రక్షణలో పెరిగారు.ఈ సమయములో, ఒక నెమలి మరియు అల్లరిదైన ఒక కోతి ఆయినకు ఆప్తమిత్రులుగాను నెస్తగాళ్లుగాను ఉండేవి.
అయిన అమ్మమ్మ ఆయినకి కుంజప్ప అని ముద్దుపేరు ఇచ్చారు. అయిన కుటుంబీకుల మధ్య ఈ పేరు నిలబడి పోయింది.ఆమె నారాయణ్ కు గణితం, పురాణాలు, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు సంస్కృతం నేర్పించారు.అయిన తమ్ముడు అర్.కే. లక్ష్మణ్ ప్రకారం, కుటుంబీకులు అందరు సహజంగా ఆంగ్లంలోనే సంభాషించేవారు. నారాయణ్ మరియు అయిన తోబుట్టువులు ఏదైనా వ్యాకరణ తప్పులు చేస్తే, కుటుంబీకులు సహించే వారు కాదు.అమ్మమ్మతో ఉన్నప్పుడు, నారాయణ్ వరుసుగా అనేక పాఠశాలలో చదివారు. వాటిలో కొన్ని పురసవాకం లోని లుతేరన్ మిషన్ స్కూల్, సి.ఆర్.సి. హై స్కూల్ మరియు క్రిస్టియన్ కాలేజీ హై స్కూల్.నారాయణ్ ఒక పుస్తాకాల పురుగు. ఆరంభ దశలో అయిన డికెన్స్, వోడ్ హౌస్, ఆర్థర్ కోనన్ డోయల్, థామస్ హర్డి వ్రాసిన పుస్తాకాలని చదివేవారు.వయస్సు పెన్నెండు ఉన్నప్పుడు, నారాయణ్ ఒక స్వాతంత్ర పోరాట సభలో పాల్గొన్నారు. దాని కొరకు అయిన మావయ్య చే మందలించబడ్డారు; వారి కుటుంబం రాజకీయానికి అతీతంగా ఉండి, అన్ని ప్రభుత్వాలు చెడ్డవి అని భావించేది.
నారాయణన్ తండ్రి మహారాజ యొక్క కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉన్నత పాఠశాలకు బదలీ కావటంతో ఆయన కుటుంబసమేతంగా మైసూరుకు మారారు. పాఠశాల అందున్న మంచి పుస్తకాలు కలిగిన గ్రంథాలయం మరియు తన తండ్రిగారి యొక్క గ్రంథాలయం అందుబాటులో ఉండటంతో, పుస్తకాలు చదవటంలో ఆయనకు ఆసక్తి ఏర్పడి,స్వయంగా తానే వ్రాయటం కూడా అలవాటు చేసుకున్నారు. ఉన్నత పాఠశాల ముగించినాక, నారాయణన్ విశ్వవిద్యాలయమునకు ప్రవేశ పరీక్ష వ్రాసి సఫలీకృతుడు కాలేక, ఇంటిలోనే చదువుకుంటూ, వ్రాసుకుంటూ ఒక సంవత్సరం గడిపి, పిమ్మట 1926 సంవత్సరములో పరీక్షలో సఫలీక్రుతుడయినాక మైసూరు మహారాజ కళాశాలలో చేరారు. బేచలర్ పట్టా పొందడానికి నారాయణ్ నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. ఇది మామూలుకంటే ఒక సంవత్సరము ఎక్కువ. మాస్టర్ డిగ్రీ (M.A.) చదవడం వల్ల సాహిత్యంలో ఉన్న అయిన ఆసక్తి తగ్గిపోతుందని ఒక మిత్రుడు చెప్పడంతో, కొంత కాలం అయిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసారు; అయితే, ప్రధాన ఉపాధ్యాయుడు ఆయినని వ్యాయమ ఉపాధ్యాయుడు స్థానములో పని చేయడమని చెప్పినప్పుడు, అయిన ఆ ఉద్యోగాన్ని మానేశారు తనకు తగిన వృత్తి రచయిత వృత్తి అని ఈ అనుభవం వల్ల నేర్చుకొని, అయిన ఇంట్లోనే ఉండి నవలలు వ్రాయడం ప్రారంబించారు.మొట్ట మొదటిగా ప్రచురించబడిన అయిన రాత, డెవెలప్మెంట్ అఫ్ మారిటైం లాస్ అఫ్ 17థ్-సెంచురీ ఇంగ్లాండ్ అనే పుస్తకము యొక్క గ్రంథ పరిచయం.తదుపరి, అయిన ఆంగ్ల భాష వార్తాపత్రికలు, సంచికలకు స్థానిక కథలు అప్పుడప్పుడు వ్రాయడం ప్రారంబించారు. రాయడం ద్వారా సంపాదన ఎక్కువ రానప్పడికి, (మొదటి సంవత్సరం అయిన సంపాదన తొమ్మిది రూపాయిలు మరియు పన్నెండు అణాలు), ఆయినకి ఒక స్థిరమైన జీవితం ఏర్పడింది. ఆయినకు అవసరాలు బాగా తక్కువగా ఉండేవి. అసాధరణమైన వృత్తిని అయిన ఎన్నుకున్నందుకు అయిన కుటుంబము, మిత్రులు ఆయినకు సహకరించి గౌరవించారు.1930లో నారాయణ్ తన మొదటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ ని వ్రాసారు. అయితే, అయిన మావయ్య దానిని ఎగతాళి చేసారు. అనేక ప్రచురణకర్తలు ఆ నవలని తిరస్కరించారు. ఈ పుస్తకములోనే నారాయణ్, దేశము యొక్క సామాజిక వాతావరణాన్ని చూపించే మాల్గుడి అనే ఒక పట్టణాన్ని సృష్టించారు; ఇది కలోనియల్ పాలన యొక్క పరిమితులని విస్మరించింది. అదే సమయములో బ్రిటిష్ వారి సమయములో మరియు స్వాతంత్రం తరువాత ఏర్పడిన అనేక సామాజిక-రాజకీయ మార్పులని బట్టి ఈ పట్టణం కూడా మారుతూ వచ్చింది.
మలుపు తిరుగుట
1933లో కోయంబతూర్లో తన సోదరి ఇంట్లో విశ్రాంతి తీస్కుంటున్న కాలములో, నారాయణ్ ప్రక్కనే నివసిస్తున్న ఒక 15 వయస్సుగల అమ్మాయిని కలిశి ఆమెతో ప్రేమలో పడ్డారు. అనేక జ్యోతిష మరియు ఆర్థిక పరమైన అడ్డంకులు ఏర్పడినా, నారాయణ్ ఆ అమ్మాయి తండ్రి యొక్క ఆమోదం పొంది, ఆమెని వివాహం చేసుకున్నారు. వివాహం పిమ్మట, నారాయణ్ ది జుస్టిస్ అనే ఒక మదరాస్ పత్రికకు విలేకరి అయారు. అది బ్రామిన్-కాని వారి ప్రయోజనాలు మీద శ్రద్ధ చూపిస్తున్న ఒక పత్రిక. వారి పక్షాన ఒక బ్రాహిన్ అయ్యర్ ఉండడం ప్రచురణకర్తలకు ఉత్సాహం కలిగించింది. ఈ ఉద్యోగం ద్వారా అయిన అనేక రకమైన జనాలు, సమస్యలతో పరిచయం ఏర్పడింది.అంతకు మునుపు, నారాయణ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ నవల యొక్క వ్రాతప్రతిని ఆక్స్ ఫోర్డ్ లోని ఒక మితుడుకు పంపించి ఉన్నారు. ఆ మిత్రుడు ఆ ప్రతిని గ్రహం గ్రీన్కు చూపించారు. గ్రీన్ ఆ పుస్తకముని తన ప్రచురణకర్తకు సిఫార్సు చేస్తే, ఆ పుస్తకము చివరిగా 1935లో ప్రచురించబడింది.ఆంగ్లం మాట్లాడే ప్రేక్షకలకు సులువుగా ఉండే విధముగా పేరుని క్లుప్తం చేసుకోమని నారాయణ్ కు గ్రీన్ సలహా ఇచ్చారు.ఆ పుస్తకము అర్ధ-స్వయచరిత్ర లాగ ఉండి, అయిన బాల్యమునుండి అనేక సంఘటనలు ఆధారంగా వ్రాయబడింది. పుస్తకము గురించి మంచి విమర్శలు వచ్చినప్పటికీ, అమ్మకాలు మాత్రం తక్కువగానే ఉంది. నారాయణ్ యొక్క మరుసటి నవల ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ (1937), కొంత వరకు అయిన కళాశాల అనుభవం స్ఫూర్తితో వ్రాయబడింది.ఒక తిరగబడే బాలుడు ఒక సర్దుకోకలిగిన ఎదిగిన వ్యక్తిగాగా మార్పు చెందే పరిస్థితిని గురించి ఈ పుస్తకము వివరిస్తుంది;ఈ నవల కూడా గ్రీన్ సిఫార్సు మేరకు మరొక ప్రచురణకర్త చే ప్రచురించబడింది. అయిన వ్రాసిన మూడో నవల ది డార్క్ రూం (1938),లో గృహ, సంసార అపశ్రుతులు గురించి, వివాహ సంబంధంలో మగవాడిని హింసకుడు గాను స్త్రీని బాధితురాలుగాను చిత్రీకరించబడింది. 1937లో నారాయణ్ తండ్రి చనిపోయారు. తరువాత ఆదాయం లేకపోయే సరికి, నారాయణ్ మైసూర్ ప్రభుత్వం నుండి ఒక కమిషన్ ని ఒప్పుకోవలసి వచ్చింది.
తన మొదటి మూడు పుస్తకాలలో, సమాజములో ఆమోదించబడిన కొన్ని ఆచారాలకు సంబంధించిన సమస్యల గురించి నారాయణ్ వ్రాసారు. మొదటి పుస్తకములో, నారాయణ్ విద్యార్థుల దురవస్థ గురించి, తరగతి గదులలో కొట్టడం గురించి, వాటి వల్ల పిల్లలలకు అనుబవించే అవమానాల గురించి వ్రాసారు. రెండవ పుస్తకములో, హిందూ వివాహాలలో, జాతకాలు చూడడం గురించి, దాని వల్ల పెళ్ళికూతురు, పెళ్ళికోడుకలకు ఏర్పడే మాన్సీక క్షోబ గురించి నారాయణ్ వ్రాసారు. మూడవ పుస్తకములో, భర్త యొక్క చేష్టలు, మనోభావాలతో భార్య పడే కష్టాల గురించి నారాయణ్ వ్రాసారు.
1939లో టైఫాయిడ్ వల్ల రాజం చనిపోయింది. ఆమె మరణం నారాయణ్ ని లోతుగా బాధించడంతో, చాల కాలం అయిన దుఃఖంలో ఉన్నారు; మూడేళ్ళే నిండిన హేమలత అనే తమ కూతురు గురించి ఆయినకు చింతగా ఉండేది. ఈ మరణం అయిన జీవితములో గణనీయమైన మార్పు తెచ్చింది. ఇదే అయిన మరుసటి నవల అయిన ది ఇంగ్లీష్ టీచర్కు స్ఫూర్తిగా నిలిచింది.ఈ పుస్తకము, అయిన మొదటి రెండు పుస్తకాల లాగే స్వయచరిత్ర లాగ ఉంది. మరియు, అనుకోకుండానే, స్వామి అండ్ ఫ్రెండ్స్, ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ తరువాత ఈ పుస్తకము మూడు పుస్తకాల సేకరణని పూర్తి చేసింది.తర్వాతి బేటీలలో ది ఇంగ్లీష్ టీచర్ దాదాపు పూర్తిగా ఒక స్వయచారిత్ర అని అంగీకరించారు. అయితే, పాత్రలకు వేరే పేర్లు పెట్టబడ్డాయి మరియు మాల్గుడి యొక్క పరిసరాలు మార్చబడ్డాయి; నవలలో వివరించబడిన భావాలు రాజం మరణ సమయములో తన యొక్క భావాలే అని కూడా ఆయినా వివరించారు.
కొంత మేరకు విజయం సాదించడంతో నారాయణ్ 1940లో ఇండియన్ తాట్ అనే ఒక పత్రిక ప్రారంబించారు. కార్ సేల్స్ మాన్ అయిన తన మావయ్య సహాయంతో, మద్రాస్ నగరములో మాత్రం ఒక వేయికు పైగా చందాదరులని నారాయణ్ సంపాదించకలిగారు. అయితే, నారాయణ్ దీనిని నడపలేకపోవడంతో, ఈ ప్రయత్నం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక సంవత్సరము లోపలే ఈ పత్రిక మూతపడింది. మాల్గుడి డేస్ అనే అయిన మొదటి చిరుకథల సేకరణ నవంబర్ 1942లో ప్రచురించబడింది. తరువాత, 1945లో ది ఇంగ్లీష్ టీచర్ ప్రచురించబడింది. ఈ మధ్యలో యుద్ధం కారణంగా ఇంగ్లాండ్తో సంబంధాలు తెగిపోవడంతో, నారాయణ్ తన సొంత ప్రచురణ సంస్థని ప్రారంబించారు. దీనికి మళ్ళి ఇండియన్ తాట్ పుబ్లికేషన్స్ అనే పేరు పెట్టారు; ఈ ప్రచురణ సంస్థ విజయవంతమై, ఈ నాటికి అయిన మనవరాలు చే నడపబడుతూ ఉంది.శీగ్రంలోనే, న్యు యార్క్ నుండి మాస్కో వరకు పాటకులు పెరిగే సరికి, నారాయణ్ నవలలు బాగా అమ్మడం మొదలయింది. 1948లో అయిన మైసూర్ శివార్లలో సొంత ఇల్లు కట్టడం ప్రారంబించారు ; ఆ ఇల్లు 1953లో పూర్తీ అయింది.