Type Here to Get Search Results !

Vinays Info

ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ - Alfred Nobel - VINAYS INFO

ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెలల్  (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు.

🔹ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు.

🔹ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు.

🔹కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.

👉జీవితం

🔹ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872) మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం.
🔹ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833లో జన్మించాడు.
🔹ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు.

🔹ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.

👉నోబెల్‌ పురస్కారం

🔹నేడు భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది.

🔹ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ గౌరవార్ధం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది.

🔹ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section