[10/05 7:56 pm] MPC Shivananda Swamy: సీఎం కేసీఆర్ జాతీయ జండాను తొలిసారిగా ఎక్కడ ఎగురవేశారు?
- గోలకొండ కోటపై, ఆగస్టు 15న
తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు ఎన్ని కి.మీ.లు?
- 1586.09 కి.మీ. (6 జాతీయ రహదారులు)
తెలంగాణ లక్ష్మీబాయి అని ఎవరికి పేరు?
- సంగెం లక్ష్మీబాయి
హైదరాబాద్ ప్రకాశం అంటే ఎవరు?
- స్వామి రామానంద తీర్థ
1952-56 వరకు హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్?
- కాశీనాథరావ్ వైద్య
ఇండియన్ తోరోదత్ అని ఎవరిని అంటారు?
- సరోజినీ నాయుడు
తెలంగాణ పటేల్ అంటే ఎవరు?
- బొమ్మకంటి సత్యనారాయణ రావు
హైదరాబాద్ సింహం?
- పండిత నరేంద్రజీ
ఇండియన్ మార్టిన్ లూథర్, ఇడియన్ ఐన్‌స్టీన్ ఎవరు?
- ఆచార్య నాగార్జునుడు
దాశరథి కృష్ణమాచార్యుని రచనలు?
- అగ్నిధార, రుద్రవీణ, మహాబోధి, కవితా పుష్పకం, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం
ఉమర్ ఖయ్యూం రచించిన తెలంగాణ కవి?
- బూర్గుల రామకృష్ణారావు
1921లో జరిగిన ఆంధ్రజనసంఘం సమావేశంలో తొలిసారిగా తెలుగులో మాట్లాడిన వ్యక్తి?
- అల్లంపల్లి వెంకట రామారావు
హైదరాబాద్ భారతదేశం అనే గుండెపై పుట్టిన రాచపుండు అన్నదెవరు?
- సర్దార్ పటేల్
పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు సభ్యులు ఎవరు?
- కేవీ రంగారెడ్డి, జేవీ రంగారావు, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి
తెలంగాణలో ఒగ్గు కథా చక్రవర్తి అని ఎవరిని అంటారు?
- మిద్దె రాములు
[10/05 7:59 pm] MPC Shivananda Swamy: హైదరాబాద్‌లోని ఫతే మైదాన్ నుంచి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్‌ని కూడా మిగలనివ్వను అని శపథం చేసింది ఎవరు?
- సర్దార్ పటేల్
నిజాం రాజ్యంలో నిర్మించిన తొలి ప్రాజెక్ట్?
- నిజాం సాగర్ ప్రాజెక్ట్ (మంజీరా నదిపై)
తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ ఎవరు?
- చిన్నారెడ్డి
తెలంగాణ కోసం కేశవరావ్ జాదవ్ నాయకత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పాటయ్యింది?
- 1997, అక్టోబర్ 28న
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎప్పుడు నిర్మించారు? ఫలక్‌నుమా అంటే అర్థం?
- 1884, మార్చి 3న నిర్మించారు. ఫలక్‌నుమా అంటే ఆకాశానికి ప్రతిబింబం అని అర్థం
నిజాం రాజు అధికార నివాసం?
- చౌమొహల్లా ప్యాలెస్
మా హైదరాబాద్ గ్రంథ రచయిత?
- శ్రీధర్ ధర్మాసనం
కులం అణచివేత మీద కంచె ఐలయ్య రాసిన పుస్తకం?
- STATE AND REPRESSIVE CULTURE
నక్సలైట్లు దేశభక్తులు అని అన్నదెవరు?
- మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు
తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించిన తెలంగాణ కవి?
- దాశరథి రంగాచార్య
దగాపడ్డ తెలంగాణ రాసిందెవరు?
- గాదె ఇన్నయ్య
గద్దర్ అసలు పేరు? ఆయన ఎక్కడ జన్మించారు?
- విఠల్‌రావు, 1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు ఎవరు?
- అల్లం నారాయణ
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్?
- కట్టా శేఖర్‌రెడ్డి (నల్లగొండ జిల్లా)
తెలంగాణ డిమాండ్ డే ఎప్పుడు?
-1969, మే 1 (తెలంగాణ ప్రజాసమితి ప్రకటించింది)
తెలంగాణ సిద్ధాంత కర్త?
- ప్రొ. జయశంకర్
[10/05 8:01 pm] MPC Shivananda Swamy: 1968లో తొలి దశ ఉద్యమంలో తెలంగాణలో ఫ్లాగ్‌డేని ఎప్పుడు నిర్వహించారు?
- జూలై 12న
పింగళి జగన్‌మోహన్‌రెడ్డి కమిషన్‌ని దేనిగురించి నియమించారు?
- 1952లో ముల్కీ ఉద్యమం-పోలీసుల కాల్పుల గురించి
అక్కన్న మాదన్నల ఆలయం ఎక్కడ ఉంది?
- శాలిబండ, హైదరాబాద్
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా పాట రాసి పాడింది ఎవరు?
- గద్దర్, 1997లో
2008లో 610 జీవో అమలు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఎవరు?
- ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తెలంగాణ కళాసమితి స్థాపకురాలు ఎవరు?
- బెల్లి లలిత
తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు 2007లో ఏర్పడిన సంస్థ?
- తెలంగాణ జాగృతి
తెలంగాణ ప్రభుత్వ తొలి కార్యదర్శి?
- రాజీవ్ శర్మ
రాళ్లవాగు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?
- కరీంనగర్ జిల్లాలో
రావి నారాయణరెడ్డి ఆడిటోరియం ఎక్కడ ఉంది?
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అయిన తెలంగాణకు చెందిన మొదటి వ్యక్తి?
- పీవీ నరసింహారావు
1968లో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆరుట్ల కమలాదేవి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అయితే ఆమెకు ఉన్న మరోపేరు?
- అభినవ రుద్రమ
[10/05 8:03 pm] MPC Shivananda Swamy: భాగ్యోదయం గ్రంథం రాసిన భాగ్యరెడ్డివర్మ కుమారుడు?
- ఎంబీ గౌతమ్
ఆది హిందూ ఉద్యమ పితామహుడు ఎవరు?
- భాగ్యరెడ్డి వర్మ
అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిందెవరు?
- అరిగె రామస్వామి (దళిత ఉద్యమనేత)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైన తేదీ?
- 1947, సెప్టెంబర్ 11
కాకతీయులను శూద్రులుగా పేర్కొన్న శాసనం?
- వర్ధమానపుర శాసనం
తెలంగాణ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది?
- 2014, ఫిబ్రవరి 20న
నిజామాబాద్ జైలు గోడలపై విప్లవ గీతాలు రాసిన తెలంగాణ కవి?
- దాశరథి కృష్ణమాచార్య
అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ?
- కాకతీయ వర్సిటీ
కాళోజీ పూర్తి పేరు?
- రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ నారాయణరావు
గేట్ వే టు తెలంగాణ అని ఏ పట్టణాన్ని పిలుస్తారు?
- కోదాడ
ఐక్యరాజ్య సమితిలోని (2015, సెప్టెంబర్) జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం వచ్చిన తెలంగాణ విద్యార్థులు?
- మాలావత్ పూర్ణ (నిజామాబాద్ జిల్లా), సాదిక్ పాషా (ఖమ్మం)
తెలంగాణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి
బతుకమ్మా బతుకు రచయిత?
- శ్రీగిరిజామనోహరబాబు
పుట్టుక నీది, చావు నీది... బతుకంతా దేశానిది అన్నదెవరు?
- కాళోజీ
[10/05 8:04 pm] MPC Shivananda Swamy: సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని స్థాపించిందెవరు?
- ప్రొ. కేశవరావు జాదవ్ (1969లో)
తెలంగాణలో తొలి విశ్వవిద్యాలయం?
- ఉస్మానియా యూనివర్సిటీ
నాజీ నైజాం గ్రంథ రచయిత ఎవరు?
-అయ్యపు వెంకటరమణ
తెలంగాణలో నృత్య సంబంధ కళా రూపాల్లో ఒకటి?
- థింసా
1860లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా (ఆదిలాబాద్ జిల్లాలో) పోరాటం చేసిన గోండుల నాయకుడు?
- రాంజీ గోండు
పీవీ నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణమైన ఉద్యమం?
- జై ఆంధ్ర ఉద్యమం
హైదరాబాద్ సంస్థానంలో అల్తాఫ్ బల్దా అంటే ఏ జిల్లా?
- రంగారెడ్డి
రాష్ట్ర తొలి వైద్య ఆరోగ్య శాఖామంత్రి?
- టీ రాజయ్య
ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల విజ్ఞాన సర్వస్వం రాసిన చరిత్రకారుడు?
- బీఎన్ శాస్త్రి
ఏ తీరుగ నను దయచూసెదవో ఇన వంశోత్తమ రామా అన్న తెలంగాణ వాగ్గేయ కారుడు?
- భక్త రామదాసు
పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ నృత్యకారుడు?
- నటరాజ రామకృష్ణ
నిజాం కాలంలో టంకశాలగా పేరొందిన వజీరాబాద్‌ను ప్రస్తుతం ఏమని వ్యవహరిస్తున్నారు?
- వాడపల్లి
ముల్కీ నిబంధనల అమలు గురించి ఐదు సూత్రాల పథకాన్ని తీసుకొచ్చిన ప్రధాని?
- ఇందిరాగాంధీ
విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అందించిన మొదటి గ్రంథం?
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన అబ్రహం లింకన్
*వినయ్ కుమార్ ముక్కని*