Type Here to Get Search Results !

Vinays Info

జీకే

Top Post Ad

ఆది మానవుని ఆనవాలు
-వరంగల్ జిల్లా చేర్యాల మండలం వీరన్నపేటలో ఏనెరాళ్లపై ఆది మానవుల చిత్రాలతోపాటు ఎద్దుల బొమ్మలను చరిత్ర పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి ఫిబ్రవరి 26న గుర్తించారు. సమీపంలోని మిథునమ్మ చెరువు వద్ద ఆది మానవుల కాలం (నవీనయుగం) నాటి రాతి పనిముట్లు కూడా లభ్యమయ్యాయి.
రాష్ట్ర ఫైర్ సర్వీస్ లోగో ఆవిష్కరణ
-తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ లోగోను హోం మంత్రి నాయని నర్సింహరెడ్డి ఫిబ్రవరి 27న ఆవిష్కరించారు. ఆ శాఖ టోల్ఫ్రీ నెంబర్ 101 ప్రచార సామాగ్రిని కూడా విడుదల చేశారు. ఇక నుంచి డిపార్ట్మెంట్ లోగోను ఆర్మ్ బ్యాడ్జీగా సిబ్బంది ధరించనున్నారు.
గ్లాస్ ఫ్రీ ఎలక్ట్రానిక్స్
-ఎపిక బ్రాండ్ పేరుతో గ్లాస్ ఫ్రీ మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి పరిశ్రమను రాష్ట్రంలో నెలకొల్పేందుకు దుబాయ్కి చెందిన ఎరీస్ గ్రూప్ సంసిద్ధత ప్రకటించింది. 125 మిలియన్ డాలర్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్లో ఉత్పత్తులను ఆవిష్కరించనున్నారు. కాగా, 2015 జూన్లో టీఎస్-ఐపాస్ ప్రకటించిన 82 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. వాటిలో 13 ఉత్పత్తిని ప్రారంభించాయి.
ఆక్టోపస్ ట్రైనింగ్ సెంటర్
-ఆక్టోపస్ ట్రైనింగ్ సెంటర్ను డీజీపీ అనురాగ్ శర్మ ఫిబ్రవరి 27న ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని ఈ భవనాన్ని రూ. 7 కోట్లతో నిర్మించారు.
మనోహరాచారికి ఐపీఎస్ అవార్డు
-ఇండియన్ పాథలాజికల్ సొసైటీ ఐపీఎస్ రికగ్నేషన్ అవార్డును ఓయూ సైన్స్ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ మనోహరా చారికి ఫిబ్రవరి 23న ఢిల్లీలో ప్రదానం చేశారు.
జాతీయం
ఎన్నికల చట్టంలో సవరణ
-భారత్, బంగ్లాదేశ్ల మధ్య భూభాగాల మార్పిడితో దేశ పౌరులైన వారికి ఓటు హక్కు కల్పించే బిల్లును ఫిబ్రవరి 25న లోక్సభ ఆమోదించింది. ఎన్నికల చట్టం (సవరణ) బిల్లు-2016ను న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ లోక్సభలో ప్రవేశపెట్టారు. చట్టంలోని సెక్షన్ 9లో సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
పీఎఫ్ చట్టం కఠినతరం
-అన్ని చోట్ల పదవీ విరమణ వయసు 58 ఏండ్లకు పెంచిన నేపథ్యంలో పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ వయస్సును 54 నుంచి 57కు పెంచారు. గతంలో కొన్ని సంస్థల్లో పదవీ విరమణ వయసు 55 లేదా 56గా ఉండటంతో 54 ఏండ్లకు 90 శాతం సొమ్ము తీసుకునేందుకు అనుమతించేవారు.
మరో 37 దేశాలకు ఈ-టూరిస్ట్ వీసా
-విదేశీ పర్యాటకుల ఆకర్షణకు ప్రవేశపెట్టిన ఈ-టూరిస్ట్ వీసాను కేంద్రం ఫిబ్రవరి 26 నుంచి మరో 37 దేశాలకు విస్తరించింది. తాజా జాబితాలో ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, దక్షిణాఫ్రికా వంటి దేశాలున్నాయి. దీంతో ఈ-టూరిస్ట్ వీసా పథకంలో చేరిన దేశాల సంఖ్య 150కి పెరిగింది. ఈ పథకాన్ని 2014 నవంబర్ 27న కేంద్రం ప్రారంభించింది.
అరుణాచల్ సీఎం బల నిరూపణ
-అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి కలికోపుల్ ఫిబవ్రరి 25న శాసనసభలో బలాన్ని నిరూపించుకున్నారు. 27 మంది కాంగ్రెస్, 11 మంది బీజేపీ, ఇద్దరు స్వతంత్ర ఎమ్మేల్యేలు పుల్కు మద్దతునిచ్చారు.
ఎస్డీఆర్ నిబంధన సవరణ
-ఆర్బీఐ వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) నిబంధనలను సవరించింది. బ్యాంకులు మొత్తం రుణ విలువలో 15 శాతం వరకు ఎస్డీఆర్లకు కేటాయింపులు జరపాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎస్డీఆర్ ద్వారా తీసుకున్న కంపెనీల్లోని వాటాను 18 నెలల లోపు కొత్త ప్రమోటర్లకు విక్రయించరాదని పేర్కొంది.కశ్మీర్లో రికార్డు ఉష్ణోగ్రత
-ఫిబ్రవరి 23న శ్రీనగర్లో 20.6 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 10 డిగ్రీలు అధికమవడం గమనార్హం. 1940 ఫిబ్రవరి తర్వాత (76 ఏండ్లు) తొలిసారి ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భారత్-పాక్ దోస్తీ బస్సు పునరుద్ధరణ
-హర్యానాలో తమను ఓబీసీల్లో చేర్చాలంటూ జాట్ల ఆందోళన నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి ఆగిపోయిన భారత్-పాక్ దోస్తీ బస్సును ఫిబ్రవరి 24న పునరుద్ధరించారు. ఇది లాహోర్-ఢిల్లీల మధ్య నడుస్తుంది.
ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు
-ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆందోళనకారులకు సారధ్యం వహిస్తున్న వారే ఘటనలకు బాధ్యులని కూడా వెల్లడించింది.
మూడు రాష్ర్టాలకు కొత్త సీజేలు
-మూడు రాష్ర్టాల హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తులు (సీజే) నియమితులయ్యారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక చీఫ్ జస్టిస్గా ఉన్న సుబ్రోకమల్ ముఖర్జీని కేంద్ర న్యాయశాఖ నియమించింది. కర్ణాటక హైకోర్టు జడ్జి వినీల్ సరస్ను ఒడిశా హైకోర్టు సీజేగా నియమించారు.
అంతర్జాతీయం
మెర్సర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్
-మెర్సర్ 230 బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ నగరాల్లో వియన్నా, జ్యూరిచ్, ఆక్లాండ్, మ్యూనిక్, వాంకోవర్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ నుంచి ఏడు నగరాలకు స్థానం లభించింది. అవి.. హైదరాబాద్ (139), పుణె (144), బెంగళూరు (145), చెన్నై (150), ముంబై (152), కోల్కతా (160), ఢిల్లీ (142), ముంబై (149).
తొలి సోలార్ పార్లమెంట్
-ప్రపంచంలో తొలిసారి పూర్తి సౌరశక్తితో నడిచే పార్లమెంట్గా పాక్ రికార్డులకెక్కింది. 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ పవర్ ప్రాజెక్టును పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫిబ్రవరి 23న ప్రారంభించారు. చైనా సహకారంతో దీన్ని నిర్మించారు.
షాంఘైలో బ్రిక్స్ కార్యాలయం
-షాంఘైలో బ్రిక్స్ న్యూడెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ప్రధాన కార్యాలయం ఏర్పాటు ఒప్పందంపై ఫిబ్రవరి 27న చైనా విదేశాంగ మంత్రి వాంగ్యి, ఎన్డీబీ చైర్మన్ కేవీ కామత్ సంతకాలు చేశారు.
నేపాల్లో కూలిన విమానం
-మౌంట్ అన్నపూర్ణ వద్ద కొండచరియలు విరిగి మార్గం కనబడకపోవడంతో మ్యాగ్డి జిల్లాలోని సొలిఘెప్టే అడవుల్లో నేపాల్ విమానం కూలి 23 మంది మరణించారు.
భారత్కు వ్యతిరేకంగా WTO తీర్మానం
-భారత్లో సౌరవిద్యుత్ మిషన్లో స్వదేశీ వస్తువుల ఆవశ్యకత (డీసీఆర్) నిబంధన వివక్షాపూరితంగా ఉందని 2014లో అమెరికా చేసిన ఫిర్యాదుపై డబ్ల్యూటీవో భారత వ్యతిరేక తీర్పునిచ్చింది. డీసీఆర్ నిబంధనలు వాణిజ్య సంబంధిత పెట్టుబడి చర్యల (ట్రిమ్స్) ఒప్పందంలోని అంశాలకు అనుగుణంగా లేవంటూ ఫిబ్రవరి 25న అమెరికాకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
క్షిపణి తయారీ ఒప్పందం
-క్షిపణుల తయారీపై పరిశోధనలు సాగించేందుకు అంతర్జాతీయ క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏ మిసైల్ సిస్టమ్స్ (ఫ్రాన్స్)తో చెన్నై వెల్టెక్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్
-హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2016లో బిల్గేట్స్ (80 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (68 బిలియన్ డాలర్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 10 బిలియన్ డాలర్లు సంపాదించి జీవించి ఉన్న ఏకైక వ్యక్తి గేట్స్ 2 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. 30 శాతం వృద్ధితో 26 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ 21వ స్థానంలో నిలిచారు. బిలియనీర్ల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్ (111) మూడో స్థానంలో ఉంది. ఈ 111 మంది సంపద 308 బిలియన్ డాలర్లు.
వార్తల్లో వ్యక్తులు
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా హెచ్ఎల్ దత్తు
-జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హంద్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు ఎంపికయ్యారు.
బ్యాంక్ బోర్డ్ బ్యూరో
-బ్యాంక్బోర్డ్ బ్యూరో తొలి చైర్మన్గా మాజీ కాగ్ వినోద్ రాయ్ నియమితులయ్యారు. ప్రభుత్వరంగ బ్యాకులకు సంబంధించి ఉన్నతస్థాయి నియామకాలు, మొండి బకాయిల వంటి అంశాల్లో ఈ బోర్డ్ సలహాలిస్తుంది.
పేస్ మేకర్ ఆల్ఫ్రైడ్ మృతి
-కాలిఫోర్నియా కేంద్రంగా తొలి రీచార్జబుల్ పేస్ మేకర్, పీల్చే ఇన్సులిన్ను అభివృద్ధి పర్చిన వలెన్సియా కంపెనీకి 2001 నుంచి 2015 ఫిబ్రవరి ఆరంభం వరకు చైర్మన్గా పనిచేసిన ఆల్ఫ్రెడ్ ఈ మన్ (90) ఫిబ్రవరి 25న మరణించారు. అమెరికా సైన్యం, అంతరిక్ష పరిశోధనల కోసం సోలార్ సెల్స్, సెమీకండక్టర్లను ఉత్పత్తి చేశారు.
వేణుగోపాలాచార్య మృతి
-శ్రీవేంకటేశ్వర వైభవం చిత్రంలో ఘంటసాల ఆలపించిన నమో వేంకటేశా.. నమో తిరుమలేశా పాట రచయిత ఆచ్చి వేణుగోపాలాచార్యులు (91) ఫిబ్రవరి 25న సికింద్రాబాద్లో మరణించారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.