Type Here to Get Search Results !

Vinays Info

టీస్ జీకే-1

హైదరాబాద్‌లోని ఫతే మైదాన్ నుంచి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్‌ని కూడా మిగలనివ్వను అని శపథం చేసింది ఎవరు?
- సర్దార్ పటేల్
నిజాం రాజ్యంలో నిర్మించిన తొలి ప్రాజెక్ట్?
- నిజాం సాగర్ ప్రాజెక్ట్ (మంజీరా నదిపై)
తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ ఎవరు?
- చిన్నారెడ్డి
తెలంగాణ కోసం కేశవరావ్ జాదవ్ నాయకత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పాటయ్యింది?
- 1997, అక్టోబర్ 28న
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎప్పుడు నిర్మించారు? ఫలక్‌నుమా అంటే అర్థం?
- 1884, మార్చి 3న నిర్మించారు. ఫలక్‌నుమా అంటే ఆకాశానికి ప్రతిబింబం అని అర్థం
నిజాం రాజు అధికార నివాసం?
- చౌమొహల్లా ప్యాలెస్
మా హైదరాబాద్ గ్రంథ రచయిత?
- శ్రీధర్ ధర్మాసనం
కులం అణచివేత మీద కంచె ఐలయ్య రాసిన పుస్తకం?
- STATE AND REPRESSIVE CULTURE
నక్సలైట్లు దేశభక్తులు అని అన్నదెవరు?
- మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు
తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించిన తెలంగాణ కవి?
- దాశరథి రంగాచార్య
దగాపడ్డ తెలంగాణ రాసిందెవరు?
- గాదె ఇన్నయ్య
గద్దర్ అసలు పేరు? ఆయన ఎక్కడ జన్మించారు?
- విఠల్‌రావు, 1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు ఎవరు?
- అల్లం నారాయణ
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్?
- కట్టా శేఖర్‌రెడ్డి (నల్లగొండ జిల్లా)
తెలంగాణ డిమాండ్ డే ఎప్పుడు?
-1969, మే 1 (తెలంగాణ ప్రజాసమితి ప్రకటించింది)
తెలంగాణ సిద్ధాంత కర్త?
- ప్రొ. జయశంకర్
1968లో తొలి దశ ఉద్యమంలో తెలంగాణలో ఫ్లాగ్‌డేని ఎప్పుడు నిర్వహించారు?
- జూలై 12న
పింగళి జగన్‌మోహన్‌రెడ్డి కమిషన్‌ని దేనిగురించి నియమించారు?
- 1952లో ముల్కీ ఉద్యమం-పోలీసుల కాల్పుల గురించి
అక్కన్న మాదన్నల ఆలయం ఎక్కడ ఉంది?
- శాలిబండ, హైదరాబాద్
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా పాట రాసి పాడింది ఎవరు?
- గద్దర్, 1997లో
2008లో 610 జీవో అమలు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఎవరు?
- ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తెలంగాణ కళాసమితి స్థాపకురాలు ఎవరు?
- బెల్లి లలిత
తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు 2007లో ఏర్పడిన సంస్థ?
- తెలంగాణ జాగృతి
తెలంగాణ ప్రభుత్వ తొలి కార్యదర్శి?
- రాజీవ్ శర్మ
రాళ్లవాగు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?
- కరీంనగర్ జిల్లాలో
రావి నారాయణరెడ్డి ఆడిటోరియం ఎక్కడ ఉంది?
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అయిన తెలంగాణకు చెందిన మొదటి వ్యక్తి?
- పీవీ నరసింహారావు
1968లో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆరుట్ల కమలాదేవి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అయితే ఆమెకు ఉన్న మరోపేరు?
- అభినవ రుద్రమ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section